గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జులై 2018, ఆదివారం

సామజ,రసాంఘ్రి,సమజా,వెదకు,మంత్రిణీ,తాపనా,దాస్యతా,వాపోవ,గతి తప్పిద,గతమాగత,గర్భ"-పతనావలోకనా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

 జైశ్రీరామ్.

సామజ,రసాంఘ్రి,సమజా,వెదకు,మంత్రిణీ,తాపనా,దాస్యతా,వాపోవ,గతి తప్పిద,గతమాగత,గర్భ"-పతనావలోకనా"-వృత్తము.

రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

"-పతనావలోకనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.జ.స.స.త.జ.ర.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
గత మాగతమె!చరిత్ర!గత తప్పిద వాణిజ్యం?గతి బానిసత్వ మేర్చెంగా!
పతితంబగు!చెడు నూహ! పతనాశ్రయ మందుంగా!పతనావలోక మౌనేమో?
మతి నెంచుడి స్తుతిదంబు!మత మారణ మేలోయీ?మతి నూహిలవలెం భావిన్?
వెతనౌ గదె!రిపురాక!వెతలాసిల ఘోరంబౌ?వెతుకం విభూతి  చేకూరున్!

1.గర్భగత"-సామజ"-వృత్తము.
బృహతీఛందము.స.న.జ.గణములు.వృ.సం.330.ప్రాసగలదు.
గత మాగతమె చరిత్ర!
పతితంబగు చెడు నూహ!
మతి నెంచుడి స్తుతిదంబు!
వెతనౌ గదె?రిపు రాక!

2.గర్భగత"-రసాంఘ్రి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.గగ.గణములు.వృ.సం.28.ప్రాసగలదు.
గత తప్పిద వాణిజ్యం?
పతనాశ్రయ మందంగా!
మత మారణ మేలోయీ?
వెతలాసిల ఘోరంబౌ?

3.గర్భగత"-సమజా"-వృత్తము.
బృహతీఛందము.స.మ.జ.గణములు.వృ.సం.324.ప్రాసగలదు.
గతి బానిసత్వ మేర్చెంగా!
పత నావలోక మౌ నేమో?
మతి నూహిల వలెం? భావిన్.
వెతుకం విభూతి చేకూరున్!

4.గర్భగత"-వెదకు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.న.జ.స.స.గగ.గణములు.యతి..10,వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
గత మాగతమె?  చరిత్ర!     గత తప్పిద వాణిజ్యం?
పతితంబగు!చెడునూహ?పతనాశ్రయ మందంగా?
మతి నెంచుమి స్తుతిదంబు?మత మారణ మేలోయీ?
వెతనౌ  గదె! రిపు రాక? వెత  లాసిల  ఘోరంబౌ?

5.గర్భగత"-మంత్రణీ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.త.జ.ర.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
గత తప్పిద వాణిజ్యం!గతి బానిసత్వ మేర్చెంగా?
పతనా శ్రయ మందంగా! పత నావలోక మౌనేమో?
మత మారణ మేలోయీ?మతి నూహిలంవలెం?భావిన్!
వెత లాసిల ఘోరంబౌ?వెతుకం?  విభూతి చేకూరున్!

6.గర్భగత"-తాపనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.త.జ.ర.త.జ.న.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
గత తప్పిద వాణిజ్యం!గతి బానిసత్వ మేర్చెంగా?గత మాగతమె చరిత్ర?
పతనాశ్రయ మందంగా!పతనావ లోకమౌనేమో?పతితంబగు చెడు నూహ!
మత మారణ మేలోయీ?మతి నూహిలంవలెం?భావిం!మతి నెంచుమి స్తుతి దంబు?  
వెతలాసిల ఘోరంబౌ?వెతుకం?విభూతి చేకూరుం!వెతనౌ గదె!రిపు రాక?

7.గర్భగత"-దాస్యతా"-వృత్తము.
ధృతిఛందము.స.జ.మ.స.న.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
గతి బానిసత్వ మేర్చెంగా?గత మాగతమె!చరిత్ర?
పతనావలోక మౌనేమో?పతితంబగు చెడు నూహ!
మతి నూహిలం వలెం!భావిం?మతి నెంచుమి స్తుతిదంబు?
వెతుకం విభూతి చేకూరుం?వెతనౌ గదె!రిపు రాక?

8.గర్భగత"-వాపోవ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.మ.స.న.జ.స.స.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
గతి బానిసత్వ మేర్చెంగా?గత మాగతమె?చరిత్ర!గత తప్పిద వాణిజ్యం?
పతనావ లోక మౌనేమో?పతితంబగు చెడునూహ!పతనాశ్రయ మందంగా!
మతి నూహిలం వలెం?భావిం? మతి నెంచుమి స్తుతిదంబు?మత మారణ మేలోయీ?
వెతుకం విభూతి చేకూరుం?వెతనౌగదె!రిపురాక?వెత లాసిల ఘోరంబౌ?

9.గర్భగత"-గతితప్పిద"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.త.జ.న.గల.గణములు.యతి.9,వవయక్షరము.
ప్రాసనీమముగలదు.
గత తప్పిద వాణిజ్యం?గత మాగతమె! చరిత్ర?
పతనాశ్రయ మందంగా?పతితంబగు చెడు నూహ!
మత మారణ మేలోయీ?మతినెంచుమి!స్తుతిదంబు?
వెత  లాసిల  ఘోరంబౌ?  వెత  నౌగదె!  రిపు రాక?

10,గర్భగత"-గతమాగత"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.త.జ.న.భ.జ.ర.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
గత తప్పిద వాణిజ్యం? గత మాగతమె!చరిత్ర?గతి బానిసత్వమేర్చెంగా?
పతనాశ్శ్రయ మందంగా?పతిదంబగు!చెడు నూహ!పతనావలోకమౌ నేమో?
మతమారణ మేలోయీ?మతి నెంచుమి!స్తుతిదంబు?మతి నూహిల వలెం భావిన్?
వెతలాసిల ఘోరంబౌ?వెత నౌగదె?రిపు రాక!వెతుకం విభుతి చేకూరున్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్..
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.