జైశ్రీరామ్.
గతికా,సమాశ్రీ,మత్తరజి నీ,సుమాశ్రీ,యతిర్నవసు గంధి,నియమ,సునీతినీ,స ద్విశాల,సాధక,శోభక,గర్భ "-కీర్తిగామినీ"-వృత్త ము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-కీర్తిగామినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.జ.ర. లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
నిజము బల్క నిష్టురంబు!నీతి యన్న దోషమౌను!నీమ మన్న ఛాంద సుండగున్?
సుజన శీలి వాడు కాడు!చూతురేమి వాని వైపు?సోమిదుండు పొమ్మ నందురే?
భజనగాండ్రు గోప్పవారు!పాతకాల పుట్టయంచు?పాములట్లు కుట్టు చుందురే!
భోజనమే తలంతు రెప్డు?భూతి భ్రాంతి మానసాన!భూమికేది?వీరి తీరుకున్?
చూతురేమి=మంచి చెడ్డలు చూతురెందులకు?భజనగాండ్రు=వెను కజేరి
తాళమువేయువారు,పాతకాలపుట్ట=పాపా లనెలవు,భూతిభ్రాంతి=ఐశ్వమందేభ్ భ్రమ,భూమిక=ఆధారము,మూలము.
1.గర్భగత"గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములుయవృ.సం. 344.ప్రాసగలదు.
నిజము బల్క నిష్టురంబు!.
సుజన శీలి వాడు కాడు!
భజనగాండ్రు గొప్పవారు!
భోజనమే!దలంతురెప్డు?
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల గణములు.వృ.సం.171.ప్రాసగలదు..
నీతియన్న దోషమౌను!
చూతురేమి వాని వైపు?
పాతకాల పుట్టయంచు!
భూతి భ్రాంతి మానసాన!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం. 171.ప్రాసగలదు.
నీమ మన్న ఛాంద సుండగున్?
సోమిదుండు పొమ్మ నందురే!
పాము లట్లు కుట్టు చుందురే?
భూమి కేది? వీరి తీరుకున్?
4.గర్భగత"-సుమాశ్రీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నిజము బల్క నిష్టురంబు?నీతియన్న దోషమౌను!
సుజన శీలి వాడు కాడు?చూతురయ్య వానివైపు?
భజన గాండ్రు గొప్ప వారు?పాతకాల పుట్టయంచు?
భోజనమే దలంతు రెప్డు?భూతి భ్రాంతి మానసాన!
5.గర్భగత"-యతిర్నవ సుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.జ.ర.లగ.గణము లు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీతియన్న!దోషమౌను!నీమ మన్న ఛాందసుండగున్?
చూతురయ్యవాని వైపు?సోమిదుండు పొమ్మనందురే?
పాతకాల పుట్టయంచు?పాములట్లు కుట్టు చుందురే!
భూతిభ్రాంతి మానసాన!భూమికేది?వీరి తీరుకున్?
6.గర్భగత"-నియమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.స.జ. గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
నీతియన్న !దోషమౌను!నీమమన్న!ఛాందసుండగున్? నిజము బల్క నిష్టురంబు?
చూతురయ్య!వానివైపు!సోమిదుండు!పొ మ్మనందురే?సుజన శీలి వాడు కాడు?
పాతకాల పుట్టయంచు?పాములట్లు కుట్టుచుందురే?భజనగాండ్రు గొప్ప వారు!
భూతిభ్రాంతి మానసాన!భూమికేది?వీరి తీరుకుం?భోజనమే!దలంతు రెప్డు?
7.గర్భగత"-సునీతినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.జ.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీమమన్న ఛాందసుండగున్?నిజము బల్క నిష్టురంబు?
సోమిదుండు!పొమ్మనందురే?సుజన శీలి వాడు కాడు?
పాములట్లు!కుట్టు చుందురే?భజనగాండ్రు!గొప్పవారు?
భూమికేది?వీరి తీరుకుం?భోజనమే! దలంతు రెప్డు?
8.గర్భగత"-సద్విశాల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.ర.జ. గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
నీమమన్న!ఛాందసుండగుం?నిజముబల్క నిష్టురంబు?నీతియన్న దోష మౌను?
సోమిదుండు!పొమ్మనందురే?సుజన శీలి వాడు కాడు?చూతురయ్య!వాని వైపు?
పాములట్లు కుట్టు చుందురే?భజన గాండ్రు గొప్ప వారు?పాతకాల పుట్ట యంచు?
భూమికేది?వీరి తీరుకుం?భోజనమే!దలంతు రెప్డు?భూతి భ్రాంతి మానసాన!
9.గర్భగత"-సాధక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.జ.గల. గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీతియన్న దోషమౌను?నిజము బల్క నిష్టురంబు!
చూతురయ్య వానివైపు?సుజన శీలి వాడు కాడు?
పాతకాల పుట్టయంచు?భజనగాండ్రు గొప్పవారు?
భూతి భ్రాంతి మానసాన!భోజనమే?దలంతు రెప్డు?
10,గర్భగత"-శోధకా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.ర.జ.ర. లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
నీతియన్న దోషమౌను?నిజము బల్క నిష్టురంబు?నీమ మన్న?ఛాందసుం డగున్?
చూతురయ్య!వానివైపు?సుజన శీలి వాడు కాడు?సోమిదుండు పొమ్మ నందురే?
పాతకాల పుట్టయంచు?భజనగాండ్రు గొప్పవారు!పాములట్లు కుట్టు చుందురే?
భూతిభ్రాంతి మానసాన!భోజనమే!దలంతు రెప్డు?భూమికేది?వీరి తీరుకున్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.