గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జులై 2018, గురువారం

రసభాతి,కమఠ,ఆనంద,నిభద్ర,స్వేచ్ఛేల?,భద్రమోపని,ప్రాణకంటక,ఫణముగా,ప్రత్యేకత,కీనమెంచు,గర్భ"-ప్రాణాంతక"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
రసభాతి,కమఠ,ఆనంద,నిభద్ర,స్వేచ్ఛేల?,భద్రమోపని,ప్రాణకంటక,ఫణముగా,ప్రత్యేకత,కీనమెంచు,గర్భ"-ప్రాణాంతక"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

-"ప్రాణాంతక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.భ.న.భ.మ.ర.స.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ప్రాణ కంటక ప్రత్యేకత!ఫణముగా గొనె ప్రాణాలం!భద్రమోపని స్వేచ్ఛేలన్?
దానవత్వపు దీప్తింజనె!ధనము మూలపు లోకంబై!తద్రుమంబది పెద్దాయెన్?
కీనమెంచగ న్యాయంబొకొ!కినుక కేళి చరింపేలం?గృద్ధ్రజాల విహారంబై?
చేనుమేసిన కంచెం బలె!చినుకు  లేని  యడారాయెం? ఛిద్ర సంస్కత ప్రాబల్యం?
కీనమెంచగ=మాంసమునేయెంచు చుండగ,ప్రత్యేకత=రిజర్వేషన్లు,
తద్రుమంబు=ఆవృక్షము(ధనాశ,జాతివైషమ్య),కినుకకేళి=కోపపూరితపు
టాట(జాతివైషమ్య చర్వణము),గృద్ధ్రజాల విహారము=గ్రద్ధలగుంపుల
భ్రమణము),(కాకాటియందుపిండములుముట్టుటకు భ్ద్రరమించుగ్రద్దలు),
 ఛిద్ర సంస్కృతి=ఛిన్నాభిన్న సంస్కారము,

,"అజ్ఞానులకు జ్ఞాన పీఠం!జనానికి ప్రాణగండం!రిజర్వేషన్లప్రభావం"!.

1.గర్భగత"-రసభాతి"-వృత్తము.
బృహతీఛందము.ర.స.భ.గణములు.వృ.సం.411.ప్రాసగలదు.
ప్రాణ  కంటక   ప్రత్యేకత!
దాన  వత్వపు దీప్తింజనె!
కీన మెంచగ న్యాయంబొకొ?
చేను మేసిన కంచెంబలె?

2.గర్భగత"-కమఠ"-వృత్తము.
బృహతీఛందము.న.భ.మ.గణములు.వృ.సం.56.ప్రాసగలదు.
ఫణముగా గొనె ప్రాణాలన్?
ధనము మూలపు లోకంబై!
కినుక  కేళి  చరిం పేలన్?
చినుకు లేని యెడారాయెన్!

3.గర్భగత"-ఆనంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.గగ.గణములు.వృసం.27.ప్రాసగలదు.
భద్ర మోపని స్వేచ్ఛేలన్?
తద్రుమంబది పెద్దాయెన్?
గృద్ధ్ర జాల విహారంబై!
ఛిద్ర సంస్కృతి ప్రాబల్యం?

4.గర్భగత"-నిభద్ర"-వృత్తము.
ధృతిఛందము.ర.స.భ.న.భ.మ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ప్రాణకంటక ప్రత్యేకత!ఫణముగా గొనె ప్రాణాలన్?
దానవత్వపు దీప్తింజనె!ధనము మూలపు లోకంబై?
కీన మెంచగ న్యాయంబొకొ?కినుక కేళి చరింపేలన్?
చేను మేసిన కంచెం బలె?చినుకు లేని యెడారాయెన్?

5.గర్భగత"-స్వేచ్ఛేల?.వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.మ.ర.స.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఫణముగా గొనె ప్రాణాలం?భద్రమోపని స్వేచ్ఛేలన్?
ధనము మూలపు లోకంబై!తద్రుమంబది పెద్దాయెన్?
కినుక కేళి చరింపేలం?  గృద్ధ్ర జాల విహా  రంబై?
చినుకు లేని యడారాయెం?ఛిద్ర సంస్కృతి ప్రాబల్యం?

6.గర్భగత"-భద్రమోపని"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.మ.ర.స.మ.జ.య.లల.గణములు.యతులు.10,18.ప్రాసనీమముగలదు.
ఫణముగాగొనె ప్రాణాలం?భద్రమోపని స్వేచ్ఛేలం?ప్రాణ కంటక ప్రత్యేకత?
ధనము మూలపు లోకంబై!తద్రుమంబదిపెద్దాయెం?దానవత్వపు దీప్తింజనె?
కినుక కేళి చరింపేలం?గృద్ధ్రజాల విహారంబై?కీన మెంచగ న్యాయంబొకొ?
చినుకు లేని యెడారాయెం?ఛిద్ర సంస్కృతి ప్రాబల్యం?చేనుమేసిన కంచెం బలె?

7.గర్భగత"-ప్రాణకంటక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.మ.య.జ.య.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భద్రమోపని స్వేచ్ఛేలం?ప్రాణకంటక ప్రత్యేకత?
తద్రుమంబది పెద్దాయెం?దానవత్వపు దీప్తింజనె?
గృద్ధ్రజాల విహారంబై?కీన మెంచగ న్యాయంబొకొ?
ఛిద్ర సంస్కృతి ప్రాబల్యం?చేను మేసిన కంచెంబలె?

8.గర్భగత"-ఫణముగా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.మ.జ.య.న.స.స.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
భద్రమోపని స్వేచ్ఛేలం?ప్రాణకంటక ప్రత్యేకత?ఫణముగా గొనె!ప్రాణాలన్?
తద్రుమంబది పెద్దాయెం?దానవత్వపు దీప్తింజనె?ధనము మూలపు లోకంబై
గృద్ధ్రజాల విహారంబై?కీన మెంచగ న్యాయంబొకొ?కినుక కేళి చరింపేలన్?
ఛిద్ర సంస్కృతి ప్రాబల్యం?చేనుమేసిన కంచెంబలె?చినుకులేని యెడారాయెన్

9.గర్భగత"-ప్రత్యేకత"-వృత్తము.
ధృతిఛందము.న.భ.మ.ర.స.భగణమములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఫణముగా గొనె ప్రాణాలం?ప్రాణకంటక ప్రత్యేకత?
ధనముమూలపు లోకంబై!దానవత్వపు దీప్తింజనె ?
కినుక కేళి చరింపేలం?కీనమెంచగ న్యాయంబొకొ?
చినుకు లేని యెడారాయెం?చేనుమేసిన కంచెంబలె?

10.గర్భగత"-కీనమెంచు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.మ.ర.స.భ.ర.స.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఫణముగా గొనె ప్రాణాలం?ప్రాణకంటక ప్రత్యేకత?భద్రమోపని స్వేచ్ఛేలన్?
ధనము మూలపు లోకంబై!దానవత్వపు దీప్తింజనె?తద్రుమంబది పెద్దాయెన్?
కినుక కేళి చరింపేల?కీనమెంచగ న్యాయంబొకొ?గృద్ధ్రజాల విహాహారంబై?
చినుకులేని యెడారాయెం?చేను మేసిన కంచెంబలె?ఛిద్రసంస్కృతి ప్రాబల్యం
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.