జైశ్రీరామ్.
చరమా,శోభక,గోపదా,శ్లో కించు,జీవినా,వాకొను, తమియలరు,చేకొను,ఋణగ్ర స్త,పోకాడు, గర్భ"-లోకాశ్రిత"-వృత్త ము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
లోకాశ్రిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.న.స.త.జ.ర.భ.జ. గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
చీకట్లలరును యహమున్!ఛీ!కొట్టుమి చిన్నవాడ!చేకొందు సుఖ జీవితంబున్!
పోకాడు పనుల కెడమౌ!బోకుల్కెడమైన శాంతి! పోకిళ్ల!తరుమంగ మంచౌ?
శ్లోకించు తెరగు మనుమా!లోకంబున గణ్యుడీవె!శోకంబు గతజన్మ పాపం!
లోకానికి శుభ మలరం!లోకాశ్రిత దోష మాపు! లోకో పకరి వౌటె?మోక్షం!
1.గర్భగత"-చరమా"-వృత్తము.
బృహతీఛందము.త.న.స.గణములు.వృ.సం. 253పప్రాసగలదు.
చీకట్లలరును యహమున్!
పోకాడు పనుల కెడమౌ!
శ్లోకించు తెరగు మనుమా!
లోకానికి శుభ మలరన్?
2.గర్భగత"-శోభక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.జ.గల.గణములు. వృ.సం.175.ప్రాసగలదు.
ఛీ!కొట్టుమి చిన్నవాడ!
బోకుల్కెడ మైన శాంతి!
లోకంబున గణ్యు డీవె!
లోకాశ్రిత దోషమాపు!
3.గర్భగత"-గోపదా"-వృత్తము.
బృహతీఛందము.త.స.య.గణములు.వృ.సం. 93.ప్రాసగలదు.
చేకొందు సుఖ జీవితంబున్!
పోకిళ్ల తరుమంగ మంచౌ!
శ్లోకాయుత వరాల ప్రోవై!
లోకోపకరి వౌట మోక్షం!
4.గర్భగత"-శ్లోకించు"-వృత్తము.
అత్యష్టీఛందము.త.న.స.భ.జ.గల. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాస నీమము గలదు.
చీకట్లలరును యహమున్!ఛీ కొట్టుమి చిన్నవాడ!
పోకాడు పనుల కెడమౌ!బోకుల్కెడమైన శాంతి!
శ్లోకించు తెరగు మనుమా!లోకంబున గణ్యు డీవె!
లోకానికి శుభ మలరం!లోకాశ్రిత దోష మాపు!
5.గర్భగత"-జీవినా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.భ.జ.గగ. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఛీ కొట్టుమి చిన్నవాడ!చేకొందు సుఖ జీవితంబున్!
బోకుల్కెడమైన శాంతి!పోకిళ్ల తరుమంగ మంచౌ!
లోకంబున గణ్యు డీవె!శ్లోకాయుత వరాల ప్రోవై!
లోకాశ్రిత దోష మాపు!లోకోపకరి వౌట మోక్షం!
6.గర్భగత"-వాకొను"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.భ.జ.మ.భ.న. గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ఛీ కొట్టుమి చిన్నవాడ!చేకొందు సుఖ జీవితంబున్!చీకట్లలరుం యహమున్!
బోకుల్కెడమైన శాంతి!పోకిళ్ల తరుమంగ మంచౌ!పోకాడు పనుల కెడమౌ!
లోకంబున గణ్యుడీవె!శ్లోకాయుత వరాల ప్రోవై!శ్లోకించు తెరగు మనుమా!
లోకాశ్రిత దోష మాపు!లోకోపకరి వౌట మోక్షం! లోకానికి శుభ మలరన్!
7.గర్భగత"-తమియలరు"-వృత్తము.
ధృతిఛందము.త.స.య.త.న.సగణములలు యతతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చేకొందు సుఖ జీవితంబుం!చీకట్లలరుం యహమున్!
పోకిళ్ల తరుమంగ మంచౌ!పోకాడు పనుల కెడమౌ!
శ్లోకాయుత వరాల ప్రోవై!శ్లోకించు తెరగు మనుమా!
లోకోపకరి వౌట మోక్షం!లోకానికి శుభ మలరన్!
8.గర్భగత"-చేకొను"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.స.య.త.న.స.త.జ. గల.గణములు.యతులు.10,19.
ప్రాసజీవితంబుం
చేకొందు సుఖ జీవితంబుం!చీకట్లలరుం యహముం!ఛీ కొట్టుము చిన్నవాడ!
పోకిళ్ల తరుమంగ మంచౌ!పోకాడు పనుల కెడమౌ!బోకుల్కెడమైన శాంతి!
శ్లోకాయుత వరాల ప్రోవై!శ్లోకించు తెరగు మనుమా!లోకంబున గణ్యు డీవె!
లోకోపకరి వౌట మోక్షం!లోకానికి శుభ మలరం! లోకాశ్రిత దోష మాపు!
9.గర్భగత"-ఱుణగ్రస్త"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.భ.న.లగ. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఛీ కొట్టుము చిన్నవాడ!చీకట్లలరుం యహముం!
బోకుల్కెడమైన శాంతి!పోకాడు పనుల కెడమౌ!
లోకంబున గణ్యు డీవె!శ్లోకించు తెరగు మనుమా!
లోకాశ్రిత దోష మాపు!లోకానికి శుభ మలరన్!
10,గర్భగత"-పోకాడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.భ.న.య.భ.జ. గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ఛీ కొట్టుము చిన్నవాడ!చీకట్లలరుం యహముం!చేకొందు సుఖ జీవితంబున్!
బోకుల్కెడమైన శాంతి!పోకాడు పనుల కెడమౌ!పోకిళ్ల తరుమంగ మంచౌ!
లోకంబున గణ్యుడీవె!శ్లోకించు తెరగు మనుమా!శ్లోకాయుత వరాల ప్రోవై!
లోకాశ్రిత దోష మాపు!లోకానికి శుభ మలరం!లోకోపకరి వౌట మోక్షం!
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.