గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జులై 2018, ఆదివారం

మత్తరజినీద్వయ,సమాశ్రీ,సుగంధి,యతిర్నవ సుగంధి ద్వయ,కొంగుబంగరు ద్వయ,రజినీకర ప్రియ,కల్పద్రుమ,గర్భ"గిరివరదమ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.

మత్తరజినీద్వయ,సమాశ్రీ,సుగంధి,యతిర్నవ సుగంధి ద్వయ,కొంగుబంగరు
ద్వయ,రజినీకర ప్రియ,కల్పద్రుమ,గర్భ"గిరివరదమ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"-గిరివరదమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
సాంప్రదాయ మేమిటాయెనే?చంక నాకె దేశ ఖ్యాతి!చాటు మాటు!ఓట్లు సాధనన్?
సంప్రదించు వారు లేరిలం?జంకు లేదె?స్వార్ధ భూతి?చాటి ద్వేష బీజ నాట్లతో?
కంప్రమించె లోక తీరిలం?కంకె దక్కు నెంచి చూడ?కాటి జేరు వాంఛ లేలనో?
తంప్రయైన నీటి పొందునై?టంక పాశ బద్ధమాయె?తాటిచెట్టు నీడ తీరునన్?

కంప్రము=గగుర్పటు,భీతితోవణకు,టంకపాశము=ధనమనేత్రాడు,
తంప్రము=కురువరద,తంపర,

1.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
1.సాంప్రదాయ మేమిటాయెనే?         2.చాటు మాటు ఓట్లు సాధనన్?
   సంప్రదించు వారు లేరిలన్?               చాటి ద్వేష బీజ నాట్లతో?
  కంప్రమించె లోక తీరిలన్?                  కాటి జేరు వాంఛ లేలనో?
  తంప్రయైన నీటి పొంగునై?                 తాటిచెట్టు నీడ తీరునన్?

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
చంక  నాకె దేశ ఖ్యాతి!
జంకు లేదె? స్వార్ధ భూతి?
కంకె దక్కు నెంచి చూడ!
టంక పాశ బద్ధ మాయె?

3.గర్భగత"-సుగంధి."-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సాంప్రదాయ మేమి టాయెనే?చంక నాకె దేశఖ్యాతి?
సంప్రదించువారు లేరిలన్?జంకు లేదె?స్వార్ధ  బుద్ధి?
కంప్రమించె లోక తీరిలం?కంకె దక్కు నెంచి చూడ?
తంప్ర యైన నీటి పొంగునై? టంక పాశ బద్ధ మాయె!

4.గర్భగత"-యతిర్నవ సుగంధి"-ద్వయ వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.చంక నాకె దేశ ఖ్యాతి!చాటు మాటు ఓట్ల సాధనం?
   జంకులేదె?స్వార్ధ భూతి?చాటి ద్వేష బీజ నాట్లతో?
  కంకె దక్కు నెంచి చూడ?కాటిజేరు వాంఛ లేలనో?
  టంక పాశ బద్ధమాయె?తాటి చెట్టు నీడ తీరునన్?

2.చంక నాకె దేశఖ్యాతి?సాంప్రదాయ మేమిటాయెనే?
    జంకులేదె?స్వార్ధ భూతి?సంప్రదించు వారు లేరిలన్?
    కంకె దక్కు నెంచి చూడ?కంప్ర మించె లోక తీరిలన్?
    టంక పాశ బద్ధ మాయెతంప్రయయైన నీటి పొంగునై?

5..గర్భగత "-కొంగు బంగరు"-ద్వయ వృత్తములు.యులు.9,18.
ప్రాసనీమముగలదు.
1,చంక నాకె దేశఖ్యాతి!సాంప్రదాయ మేమిటాయెనే?చాటు మాటు ఓట్ల సాధనన్?
   జంకు లేదె?స్వార్ధ భూతి?సంప్రదించు వారు లేరిలం?చాటి ద్వేష బీజ నాట్లతో?
   కంకె దక్కు నెంచి చూడ?కంప్ర మించె లోక తీరిలన్?కాటి జేరు వాంఛ లేలనో?
   టంక పాశ బద్ధ మాయె?తంప్రయైన నీటి పొంగునై?తాటి చెట్టు నీడతీరునన్?

2.చంక నాకె దేశ ఖ్యాతి!చాటు మాటు ఓట్ల సాధనం?సాంప్రదాయ మేమిటాయెనే?
జంకులేని స్వార్ధ భూతి!చాటి ద్వేష బీజ నాట్లతో?సంప్రదించు వారు లేరిలన్?
కంకెదక్కు నెంచి చూడ?కాటి జేరు వాంఛ లేలనో?కంప్రమించె! లోక తీరిలన్?
టంక పాశ బద్ధ మాయె?తాటిచెట్టు నీడ తీరునం?తంప్ర యైన! నీటి  పొంగునై?

6.గర్భగత"-రజినీకరప్రియ"-ద్వయ వృత్తములు.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.చాటుమాటు ఓట్ల సాధనం?సాంప్రదాయ మేమిటాయెనే?
   చాటి ద్వేష బీజ నాట్లతో?సంప్రదించు వారు లేరిలన్?
   కాటి జేరు వాంఛ లేలనో?కంప్రమించె !లోకతీరిలన్?
   తాటిచెట్టు నీడ తీరునం?తంప్రయైన నీటి పొంగునై?

2.సాంప్ర దాయ మేమిటాయెనో?చాటుమాటు ఓట్ల సాధనన్?
   సంప్రదించు వారు లేరిలం?చాటి ద్వేష బీజ నాట్లతో?
   కంప్రమించె!లోక తీరిలం?కాటి జేరు వాంఛ లేలనో?
   తంప్ర యైన నీటి పొంగునై?తాటి చెట్టు నీడ తీరునం?

7.గర్భగత"-కల్పద్రుమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చాటుమాటు ఓట్ల సాధనం?సాంప్రదాయ మేమిటాయెనే?చంక నాకె దేశ ఖ్యాతి?
చాటి ద్వేష బీజ నాట్లతో?సంప్రదించు వారు లేరిలం?జంకు లేదె?స్వార్ధ  భూతి!
కాటిజేరు వాంఛ లేలనో?కంప్రమించె లోక తీరిలం?కంకెదక్కు నెంచిచూడ?
తాటిచెట్టు నీడ తీరునం?తంప్రయైన నీటి పొంగునై?టంక పాశ బద్ధ మాయె?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.