గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జులై 2018, మంగళవారం

మత్తరజినీ,చీకట్లలరు,అహమస్మి,పర్వభా,సదాభక్తి,భుక్తిముక్తి,పూరిద,అజరామర,భూషల,సుపథ,గర్భ"-పథాక్రమ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ

జైశ్రీరామ్.

మత్తరజినీ,చీకట్లలరు,అహమస్మి,పర్వభా,సదాభక్తి,భుక్తిముక్తి,పూరిద,అజరామర,భూషల,సుపథ,గర్భ
"-పథాక్రమ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ

"-పథాక్రమ"-వృత్తము
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.య.జ.త.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
శక్తి,భుక్తి,,ముక్తి,మార్గమౌ?శర్వునాన,సన్మార్గతం?సదా భక్తి,భావ పూర్ణతన్?
యుక్తి యుక్త యోచనుండవై!యుర్వియందు కీర్తింపగం?నుదారుండువీడులే! యనన్ ?
యుక్తులందు పాపమోపకం?యోర్వగల్గు ధీ!శక్తినిం?యోధుండీవు గావుమా రసన్?
భక్తి ముక్తి ముక్త భూషలం?పర్వమౌగ?తేజంబులుం?పథంబందు పట్టు వీడకన్?

భావము:-శక్తి,భుక్తి,ముక్తులు వరుసగా!పరమేశ్వరునివలన,సన్మార్గమువలన,
భక్తి భావమువలన,పూర్ణత సిద్ధింప జేయునని క్రమాలంకారమువాడబడినది.
యుక్తాయుక్త జ్ఞానివై!లోకము కీర్తించునట్లు!ఉదారస్వభావి వీడనునటుల!
మాటలందు పాపము లేక! కష్టములకోర్చుధైర్యము గలవాడవై,బలముజూపు
,యోధుడవుకమ్ము!భక్తి,ముక్తి యను ముత్యాల సరు లాభరణలు తేజంబున
దనరి,మోక్షమునందు పట్టు వీడవకుమా!

1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
శక్తి,భుక్తి,ముక్తి,మార్గమౌ?
యుక్తి,యుక్త యోచనుండవై?
యుక్తులందు పాప మోపకన్?
భక్తి,ముక్తి ముక్త భూషలన్?

2.గర్భగత"-చీకట్లలరు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.య.లగ.గణములు.వృ.సం.75.ప్రాసగలదు.
శర్వు నాన ,సన్మార్గతన్?
యుర్వియందు కీర్తింపగన్?
యోర్వగల్గు ధీ శక్తి నిన్?
పర్వ మౌగ తేజంబులున్?

3.గర్భగత"-అహమస్మి"-వృత్తము.
బృహతీఛందము.య.జ.ర.గణములు.వృ.సం.170.ప్రాసగలదు.
సదా భక్తి భావ పూర్ణతన్?
నుదారుండు వీడులే?యనన్?
యోధుండీవు గావుమా!రసన్?
పథం బందు పట్టు  వీడకన్?

4.గర్భగత"-పర్వభా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.య.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శక్తి, భుక్తి, ముక్తి, మార్గమౌ? శర్వు  నాన  సన్మార్గతన్?
యుక్తి,యుక్త యోచనుండవై?యుర్వియందు కీర్తింపగన్?
యుక్తులందు పాప మోపకం?యోర్వ గల్గు ధీ శక్తి నిన్?
భక్తి, ముక్తి ముక్త భూషలం? పర్వమౌగ!తేజంబులున్?

5.గర్భగత"-సదాభక్తి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.జ.ర.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీము గలదు.
శర్వు నాన సన్మార్గతం?సదా భక్తి భావ పూర్ణతన్?
యుర్వియందు కీర్తింపగం?నుదారుండు వీడులే?యనన్?
యోర్వగల్గు ధీ శక్తినిం?యోధుండీవు గావుమా! రసన్?
పర్వమౌగ?తేజంబులుం?పథంబందు పట్టు వీడకన్?

6.గర్భగత"-భుక్తి,ముక్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.జ.ర.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18ప్ప్రాసనీమముగలదు.
శర్వు నాన సన్మార్గతం?సదా!భక్తి భావ పూర్ణతం?శక్తి,భుక్తి,ముక్తి,మార్గమౌ?
యుర్వియందు!కీర్తింపగం?నుదారుండు!వీడులే?యనం?యుక్తి యుక్త యోచనుండవై?
యోర్వగల్గు ధీ శక్తినిం?యోధుండీవు!గావుమా!రసం?యుక్తులందు!పాప మోపకన్?
పర్వ మౌగ!తేజంబులుం?పథంబందు!పట్టు వీడకం?భక్తి,ముక్తి ముక్త భూషలున్?

7.గర్భగత"-పూరిద"-వృత్తము.
ధృతిఛందము.య.జ.ర.ర.జ.ర.గణములు,యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సదా!భక్తిభావ! పూర్ణతం?శక్తి,భుక్తి,ముక్తి!మార్గమౌ?
నుదారుండు!వీవులే!యనం?యుక్తి,యుక్త యోచనుండవై?
యోధుండీవు!గావుమా!రసం?యుక్తులందు పాపమోపకన్?
పథంబందు!పట్టు వీడకం?భక్తి,ముక్తి!ముక్త. భూషలున్?

8.గర్భగత"-అజరామర"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.ర.ర.జ.ర.ర.య.లగ.గణములు.యతులు.10,19.
ప్రా నీమముగలదు..
సదాభక్తి భావ!పుర్ణతం?శక్తి,భుక్తి ముక్తి మార్గమౌ?శర్వు నాన?సన్మార్గతం?
నుదారుండు!వీవులే?యనం?యుక్తి యుక్త యోచనుండవై?యుర్వి యందు కీర్తింపగం?
యోధుండీవు!గావుమా!రసం?యుక్తులందు పాపమోపకం?యోర్వగల్గు ధీ శక్తి నిం?
పథంబందు!పట్టు వీడకం?భక్తి,ముక్తి,ముక్త భూషలుం?పర్వమౌగ? తేజంబులున్?

9.గర్భగత"-భూషల"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శర్వు నాన సన్మార్గతం?శక్తి,భుక్తి,ముక్తి,మార్గమౌ?
యుర్వియందు కీర్తింపగం?యుక్తి యుక్త యోచనుండవై?
యోర్వగల్గు ధీ శక్తినిం? యుక్తులందు పాప మోపకన్?
పర్వమౌగ?తేజంబులుం?భక్తి,ముక్తి,ముక్త భూషలున్?

10.గర్భగత"-సుపథ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.య.జ.ర.జ.త.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
శర్వు నాన సన్మార్గతం?శక్తి,భుక్తి,ముక్తి,మార్గమౌ?సదా!భక్తిభావ!పూర్ణతన్?
యుర్వియందు!కీర్తింపగం?యుక్తి,యుక్త!యోచనుండవై?నుదారుండు వీవు లే?యనన్?
యోర్వగల్గు ధీ శక్తినిం? యుక్తులందు పాపమోపకం?యోధుండీవు!గావుమా? రసన్!
పర్వ మౌగ !తేజంబులుం?భక్తి,ముక్తి,ముక్త భూషలుం?పథంబందు? పట్టు వీడకన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.