గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జులై 2018, సోమవారం

ధారా, వినీత, మృదుమానస, కీర్తిఘటనా, నిగర్వ, చింతాక్రాంత, పరవశ, నశాంత, చిత్తశోభా, చేటదేల?,"- గర్భ-"పంతుగాంచు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
ధారా, వినీత, మృదుమానస, కీర్తిఘటనా, నిగర్వ, చింతాక్రాంత, పరవశ, నశాంత, చిత్తశోభా, చేటదేల?,"- గర్భ-"పంతుగాంచు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-పంతుగాంచు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.న.భ.ర.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చీటిమాటికి చేటదేల?చిరపు కీర్తి ఘటించుమా!చింతలేల?నశాంతమున్?
సాటివారిని చూడవేమి?జరుగుబాటునుచూడుమా?శాంతచిత్త సుశోభలన్?
మేటి నేనని గర్వమేల?మెరుపు తీగెల కాంతినిం?మింతువే!పరమాత్మునిన్?
వాటమోపగ!మెల్గు మయ్య?పరవసింపుమి?  జన్మతం!పంతుగాంచుమి లోకమున్?

1.గర్భగత"-ధారా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.జ.గణములు.వృ.సం.347.ప్రాసగలదు.
చీటి  మాటికి  చేటదేల?
 సాటి వారిని చూడవేమి?
మేటి నేనని గర్వ మేల?
వాటమోపగ మెల్గు మయ్య?

2.గర్భగత"-వినీత"-వృత్తము.
బృహతీఛందము.న.భ.ర.గణములు.వృ.సం.184.ప్రాసగలదు.
చిరపు కీర్తి ఘటించుమా!
జరుగుబాటును చూడుమా!
మెరుపు తీగెల కాంతినిన్?
పరవసింపుమి జన్మతన్?

3.గర్భగత"-మృదుమానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.ప్రాసగలదు.
చింత లేల?నశాంతమున్?
శాంత చిత్త సు శోభలన్?
మింతువే?పరమాత్మునిన్?
పంతు గాంచుమి లోకమున్?

4.గర్భగత"-కీర్తిఘనా"-వృత్తము.
ధృతిఛందము.ర.స.జ.న.భ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చీటి మాటికి  చేట దేల?
సాటి వారిని చూడ వేమి?
మేటి నేనని గర్వ మేల?
వాట మోపగ మెల్గు మయ్యా!

5.గర్భగత"-నిగర్వ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.ర.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చిరపు కీర్తి ఘటించుమా!చింత లేల నశాంతమున్?
జరుగుబాటును చూడుమా?శాంత చిత్త సుశోభలన్?
మెరుపు తీగెల కాంతినిం?మింతువే!పరమాత్మునిన్?
పరవసింపుమి జన్మతం?పంతు గాంచుమి లోకమున్?

6.గర్భగత"-చింతాక్రాంత"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.ర.స.య.జ.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
చిరపుకీర్తి ఘటించుమా!చింత లేల నశాంతమున్?చీటిమాటికి చేటదేల?
జరుగుబాటును చూడుమా?శాంత చిత్త సుశోభలం?సాటివారిని చూడవేమి?
మెరుపు తీగెల కాంతినిం?మింతువే!పరమాత్మునిం?మేటినేనని గర్వమేల?
పరవసింపుమి జన్మతం?పంతు గాంచుమి లోకముం?వాట మోపగ మెల్గు మయ్య?

7.గర్భగత"-పరవశ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.జ.జ.గల.గణములు.యతి.9,వయక్షరము
ప్రాసనీమముగలదు.
చింతలేల నశాంతముం?చీటిమాటికి చేటదేల?
శాంత చిత్త సుశోభలం?సాటివారిని చూడవేమి?
మింతువే!పరమాత్మునిం?మేటి నేనని గర్వమేల?
పంతు గాంచుమి లోకముం?వాటమోపగ మెల్గు మయ్య?

8.గర్భగత"-నశాంత"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.జ.జ.భ.స.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
చింతలేల!నశాంతముం?చీటిమాటికి చేటదేల?చిరపు కీర్తి ఘటించుమా?
శాంతచిత్త సుశోభలం?సాటివారిని చూడవేమి?జరుగుబాటును చూడుమా?
మింతువే పరమాత్మునిం?మేటి నేనని గర్వమేల?మెరుపు తీగెల కాంతినిన్?
పంతు గాంచుమి లోకముం?వాట మోపగ మెల్గు మయ్య?పరవసింపుమి జన్మతన్?

9.గర్భగత"-చిత్తశోభ"-వృత్తము.
ధృతిఛందము.న.భ.ర.ర.స.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చిరపు కీర్తి ఘటించుమా?చీటి మాటికి చేటదేల?
జరుగుబాటును చూడుమా?సాటి వారిని చూడవేమి?
మెరుపు తీగెల కాంతినిం?మేటి నేనని గర్వ మేల?
పరవసింపుమి జన్మతం?వాట మోపగ మెల్గు మయ్య?

10,గర్భగత"-చేటదేల?"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.ర.ర.స.జ.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చిరపు కీర్తి ఘటించుమా?చీటిమాటికి చేటదేల?చింతలేల?నశాంతమున్?
జరుగుబాటును చూడుమా?సాటి వారిని చూడవేమి?శాంతచిత్తసుశోభలన్?
మెరుపు తీగెల కాంతినిం?మేటి నేనని గర్వమేల?మింతువే!పరమాత్మునిన్?
పరవసింపుమి జన్మతం?వాటమోపగ మెల్గుమయ్య?పంతు గాంచుమి లోకమున్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.