గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జూన్ 2018, సోమవారం

బడబానల పంక్తి మీద పచ్చిక మొలచెన్. సమస్య.... పూరణ.

జైశ్రీరామ్.
జైశ్రీమన్నారాయణ.

సమస్య.
బడబానల పంక్తి మీద పచ్చిక మొలచెన్.

నా పూరణ.
కంద గీత గర్భ చంపకమాల.

పలుపలు రీతులన్ దురితపాళి లయించెను దుర్గ కాళి. లే
రిల నిలుపన్ తనన్. కుపితనీశుఁడె మార్చెను. కోపమాపె. శో
భిల నిలిచెన్ తనే వలపుచే. బడబానల పంక్తి మీద ప
చ్చిక మొలచెన్ గదా. పసిరి చిన్నెలు మొల్చెను భర్తగాంచెనే.

చంపక గర్భ గత కందము.

పలు రీతులన్ దురితపా
ళి లయించెను దుర్గ కాళి. లేరిల నిలుపన్.
నిలిచెన్ తనే వలపుచే
బడబానల పంక్తి మీద పచ్చిక మొలచెన్.

చంపక గర్భ గత తేటగీతి.

దురితపాళి లయించెను దుర్గ కాళి.
కుపితనీశుడె మార్చెను. కోపమాపె
వలపుచే బడబానల పంక్తి మీద
పసిరి చిన్నెలు మొల్చెను భర్తఁ గాంచె.🏼
జైహింద్.🏼
Print this post

2 comments:

sam చెప్పారు...

dear sir very good blog and very good content
Telangana News

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మొదటి పద్యము " చంపక గర్భగత కందము "
పలు రీతులన్ దురితపా
ళి లయించెను దుర్గ కాళి , లేరిల నిలుపన్
నిలిచెన్ తనే వలపుచే
బడబానల పంక్తి మీద పచ్చిక మొలచెన్ .

చివరి పాదములో " డ " ప్రాస " ల " కి సరిపోతుందా ? తెలుప గలరు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.