గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, డిసెంబర్ 2017, ఆదివారం

వివేకానందనగర్ లో జరిగిన తాతా సందీప్ అష్టావధానము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నిన్నను వివేకానందనగర్లో చి.సందీప్ అష్టావధానము చక్కగా జరిగినది.
అవధాన వేదిక
శ్రీ సోమయాజి నిషిద్ధాక్షరిన్ జేసె. వ్యస్తంబు శంకరుల్ వరలఁజేసె.
సరస సమస్యకు సత్యనారాయణుల్, దత్తపది కిట శ్రీ ధరుఁడు, మరియు,
రామమోహనుడిట రమణీయ వర్ణనన్, ఆశువునడిపె ననంతకృష్ణ.
అప్రస్తుతంబుననలరె కామేశ్వరుల్. వైష్ణవి నడిపెను వారగణన.
నన్ను నడిపించినాడు వేంకన్నతండ్రి !- వినెను నామాట సందీపు, విబుధ నుతిగ
వరల నష్టావధానంబు సురుచిరముగ - చేసినాడిట ఘనముగ శ్రీశు కృపను.
 జైహింద్.
Print this post

3 comments:

Unknown చెప్పారు...

అవధాన సరస్వతులు సందీప్ శర్మ గారికి, మీకు వినమ్రవందనములు.

Unknown చెప్పారు...

అవధాన సరస్వతులు సందీప్ శర్మ గారికి, మీకు వినమ్రవందనములు.

గిరి Giri చెప్పారు...

అవధానిగారికీ, కార్రక్రమసంచాలకులైన మీకూ అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.