గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, డిసెంబర్ 2017, ఆదివారం

కనుమరుగు,త్రిన్నభ,నగణిత,కమనీయతా,గర్హిత,బ్రోవరి,కావరినీ, కనరాని,గర్విణీ,సన్నిభా,భృతిజలా,పతన,క్షుదార్తి,భాతిజన,గర్భ కలిభ్రమక వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

 జైశ్రీరామ్.
కనుమరుగు,త్రిన్నభ,నగణిత,కమనీయతా,గర్హిత,బ్రోవరి,కావరినీ,
కనరాని,గర్విణీ,సన్నిభా,భృతిజలా,పతన,క్షుదార్తి,భాతిజన,గర్భ
కలిభ్రమక వృత్తము
                             రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                   జుత్తాడ.   
                కలిభ్రమకవృత్తము.
ఉత్కృతిఛందము.స,న,న,న,న,న,భ,భ,గగ.
యతులు;10,17,22.
కలి'-యాకలి కలనము కనుమరుగగును కమనీయత కావర మోపన్
పలుకుల్నిజ మెడమగుపనితనమిలనుప్రమదంబగు పావనమౌనే?
వెల'శూన్యము తెలివికి వినరు పరులను భ్రమదేలుచు వేవిలి వేయున్
బలమే గుణకరియగు వనితల చెఱుప ప్రముఖుండవె? భావన మాయున్!

1.గర్భగత సననావృత్తము.
బృహతీఛందము.స.న.న.గణములు.వృ.సం.508.
కలి'యాకలి కలనము
పలుకుల్నిజ మెడమగు
వెల'శూన్యము తెలివికి
బలమే!గుణకరి యగు!

2 .గర్భగత ననలా వృత్తము.
ఉష్ణిక్ఛందము.న,న,ల, గణములు.వృ.సం.128.
కనుమరుగగును
పనితనమిలను
వినరు పరులను
వనితల చెఱుప!

3.గర్భగత వరదామ వృత్తము.
సుప్రతిష్టాఛందము.స,లల,గణములు.వృ.సం.28.
కమనీయత
ప్రమదంబగు!
భ్రమ దేలుచు!
ప్రముఖుండవె?

4.గర్భగత సందరి(పంక్తి)వృత్తము.
సుప్రతిష్టాఛందము.భ.గగ.గణములు.వృ.సం.07.
కావర మోపన్
పావన మౌనే?
వేవిలి వేయున్!
భావన మాయున్!
వేవిలి=పొలము, వేయున్=దిగవిడుచును.
(సంపదలుపోవును)

5.గర్భగత కలియా వృత్తము.
అత్యష్టీఛందము.స.న.న.న.న.లల.గణములు.యతి10వ.యక్షరము.
కలియాకలి కలనము కనుమరుగగును
పలుకుల్నిజ మెడమగు పనితన మిలను
వెలశూన్యముతెలివికి!వినరు పరులను
బలమే!గుణకరియగు!వనితల చెఱుప!

6.గర్భగత కలన వృత్తము.
ప్రకృతిఛందము.స.న.న.న.న.న.భ.గణములు.యతి10వ.యకషరము
కలి యాకలి కలనము కనుమరుగగును కమనీయత!
పలకుల్నిజ మెడమగు పనితన మిలను ప్రమదంబగు!
వెల శూన్యము తెలివికి! వినరు పరులను భ్రమ దేలుచు!
బలమే గుణకరి యగు!వనితల చెఱుప!ప్రముఖుండవె?

7.గర్భగత కావరి వృత్తము.
శక్వరీఛందము.భ.త.జ.న.లల.గణములు.యతి06వ. యక్షరము.
కావర మోపన్కలి యాకలి కలనము!
పావన మౌనే? పలకుల్నిజమెడమగు!
వేవిలి వేయున్! వెల శూన్యము తెలివికి!
భావన మాయున్!బలమే!గుణకరియగు!

8.గర్భగత యాకలిని వృత్తము.
ప్రకృతిఛందము.భ.త.జ.న.న.న.న.గణములు.యతి06.యక్షరము.
కావర మోపన్కలి యాకలి కలనము కనుమరుగగును
పావన మౌనె?పలుకుల్నిజ మెడమగు! పనితనమిలను
వేవిలి వేయున్!వెల శూన్యము!తెలివికి!వినరు పరులను
భావన మాయున్!బలమే!గుణకరియగు!వనితల చెఱుప

9.గర్భగత కనుమరుగు వృత్తము.
ఉత్కృతి ఛందము.భ.త.జ.న.న.న.న.స.లల.గణములు.
యతులు.06.15.22.
కావర మోపన్కలి యాకలి కలనము కనుమరుగగును కమనీయత!
పావనమౌనె?పలుకుల్నిజ మెడమగు!పనితన మిలను ప్రమదంబగు!
వేవిలి వేయున్!వెల శూన్యము!తెలివికి!వినరు పరులను!భ్రమదేలుచు!
భావనమాయున్!బలమే!గుణకరియగు!వనితల చెఱుప!ప్రముఖుండవె?

10.గర్భగత త్రిన్నభ వృత్తము.
.జగతిీఛందము.న.న.న.భ.గణములు.యతి08.యక్షరము.
కనుమరుగగును!కమనీయత!
పనితనమిలను!ప్రమదంబగు!
వినరుపరులను!భ్రమదేలుచు!
వనితల చెఱుపప్రముఖుండవె?.

11.గర్భగత నగణిత  వృత్తము.
అత్యష్టీఛందము.న.న.న.భ.భ.గగ.గణములు.యతి08.యక్షరము.
కనుమరుగగు కమనీయత కావర మోపన్!
పనితన మిలను ప్రమదంబగు!పావన మౌనే?
వినరు పరులను భ్రమదేలుచు!వేవిలి వేయున్!
వనితల చెఱుప!ప్రముఖుండవె?భావన మాయున్.
12. గర్భగత కమనీయతా వృత్తము..
ఉత్కృతిఛందము.న.న.న.భ.భ.త.జ.న.లల.గణములు.
.యతులు.8.13.18.యక్షరములు
కనుమరుగగున్ కమనీయత కావరమోపన్! కలి యాకలి కలనము!
పనితనమిలను ప్రమదంబగు పావనమౌనే?పలుకుల్నిజ మెడమగు!
వినరుపరులను భ్రమదేలుచు వేవిలివేయన్!వెలశూన్యము తెలివికి!
వనితల చెఱుప ప్రముఖుండవె?భావనమాయున్!బలమే గుణకరియగు!

13.గర్భగత గర్హిత వృత్తము.
పంక్తిఛందము.స.స.స.గ.గణములు.యతి06.యక్షరము.
కమనీయత!కావర మోపన్!
ప్ర మదంబగు?పావనమౌనే?
భ్రమదేలుచు!వేవిలి వేయున్!
ప్రముఖుండవె? భావన మాయున్!

14.గర్భగత బ్రోవరి వృత్తము
.అతిధృతిఛందము.స.స.స.భ.భ.న.ల.యతి11.యక్షరము.
కమనీయత!కావర మోపన్!కలి'యాకలలి కలనము!
ప్రమదంబగు !పావన మౌనే!పలుకుల్నిజ మెడమగు?
భ్రమ దేలుచు!వేవిలి వేయున్!వెల శూన్యము తెలివికి!
ప్రముఖుండవె?భావన మాయున్!బలమేగుణకరియగు!

15.గర్భగత కావరినీ వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.స.భ.భ.న.న.న.లల.గణములు
యతులు.06.11.20.యక్షరములు.
కమనీయత!కావరమోపన్!కలి యాకలి కలనము!కనుమరుగగును!
ప్రమదంబగు!పావనమౌనే?పలుకుల్నిజమెడమగు! పనితనమిలను!
భ్రమదేలుచు!వేవిలి వేయున్!వెల శూన్యము తెలివికి!వినరు పరులను!
ప్రముఖుండవె?భావన మాయున్!బలమే గుణకరియగు!వనితలచచెఱుప!

16.గర్భగత కనరాని వృత్తము.
జగతీఛందము.స.న.న.న.గణములు.యతి .06.యక్షరము.
కమనీయత!కనుమరుగగును
ప్రమదంబగు!పనితనమిలను
భ్రమ దేలుచు!వినరు పరులను
ప్రముఖుండవె?వనితల!చెఱుప!

17.గర్భగత గర్విణీ వృత్తము.
అత్యష్టీఛందము.స.న.న.న .భ.గగ.గణములు.యతి13.యక్షరము.
కమనీయత!కనుమరుగగును! కావరమోపన్!
ప్రమదంబగు!పనితన మిలను!పావన మౌనే?
భ్రమదేలుచు!వినరు పరులనువేవిలి వేయున్!
ప్రముఖుండవె?వనితల చెఱుప!భావన మాయున్!

18.గర్భగత సన్నిభతా వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.న.న.భ.త.జ.న.లల.గణములు.
యతులు.06.12.17.యక్షరములు.
కమనీయత కనుమరుగగును!కావర మోపన్!కలి యాకలి కలనము!
ప్రమదంబగు పనితన మిలను!పావన మౌనే?పలుకుల్నిజ మెడమగు!
భ్రమదేలుచు వినరు పరులను!వేవిలి వేయున్!వెలశూన్యముతెలివికి!
ప్రముఖుండవె?వనితల చెఱుప!భావన మాయున్!బలమే గుణకరియగు!

19.గర్భగత భతజలావృత్తము.
పంక్తిఛందము.భ.త.జ.ల.గణములు.యతి06.యక్షరము
కావరమోపన్!కమనీయత!
పావనమౌనే?ప్రమదంబగు?
.వేవిలి వేయున్!భ్రమదేలుచు!
భావన మాయున్ప్రముఖుండవె?

20.గర్భగత పతన వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.జ.న.న.లల.గణములు.యతి.11యక్షరము.
కావరమోపన్!కమనీయత!కనుమరుగగును
పావనమౌనే?ప్ర మదంబగు?పనితనమిలను
వెేవిలి వేయున్? భ్రమదేలుచు!వినరు పరులను
భావన!మాయున్ప్రముఖుండవె?వనితల చెఱుప!

21.గర్భగత క్షుదార్తి వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.జ.న.న.న.జ.న.లల.గణములు.
యతులు.06.11.18.అక్శరములు.
కావరమోపన్కమననీయత !కనుమరుగగును!కలి'యాకలి కలనము!
పావనమౌనే?ప్రమదంబగు!పనితనమిలను!పలుకుల్నిజమెడమగు!
వేవిలి వేయున్? భ్రమ దేలుచు!వినరు పరులను!వెలశూన్యము తెలివికి!
భావన మాయున్!ప్రముఖుండవె?వనితల చెఱుప!బలమే!గుణకరియగు!

22.గర్భగత భాతిజన వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.జ.న.భ.న.న.న.లల.గణములు
యతులు.06.11.16.యక్షరములు.
 కావరమోపన్!కమనీయత!కలియాకలి కలననుకనుమరుగగును
పావనమౌనే!ప్రమదంబగు!పలుకుల్నిజమెడమగు!పనితనమిలను
వేవిలివేయున్!భ్రమదేలుచు!వెలశూన్యము తెలివికి!వినరుపరులను
భావనమాయున్!ప్రముఖుండవె?బలమే!గుణకరియగు!వనితల చెఱుప!
 స్వస్తి.
జైహింద్.
Print this post

3 comments:

Unknown చెప్పారు...

ॐ। परमाद्भुत श्रीचक्रान्वितनक्षत्रयुक्तपद्यधारामृतप्रसाधनाभिनन्दनरत्नहारःभवत्कृतः।।। धन्याः।।। नमांसि अनेकानि।।।

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పాండితీ స్రష్ట శ్రీ వల్లభవఝుల అప్పల నరసిం హ మూర్తి గారి ప్రతిభకు శిరసాభి వందనములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నామగోపా చిత్రమా యిది? నాకునెన్నుట సధ్యమా?
శ్రీ మహాద్భుత సంస్కృతోక్తులఁ జిత్తమే కయికొంటిరే!
ధీమతీ! పరమేశు సత్కృప తీర్చిద్దిద్దు అనున్ సదా!
శ్రీ మహాత్ముల దీవనాళిని చిద్ప్రబీధను చేసెదన్.

ఆర్యా! మీ నామము గోపనమగుటచే నుచ్చరింపజాలనైతిని. మన్నింతురు గాక. మీకు నా ధన్యవాదములండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.