గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, డిసెంబర్ 2017, శుక్రవారం

కుండలాకార నాగబంధ కందము. రచన. కవయిత్రి పావులూరి సుప్రభ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
కవయిత్రి పావులూరి సుప్రభ విరచిత కుండలి నాగ బంధ కందమును చూడండి ఎంత నిపుణతతో వ్రాసరో. చూచి అభినందించండి. వ్రాయుటకు మీరూ యత్నించండి. 

కుండలాకార నాగబంధ కందము.
గారవమొప్పఁగ మరిమరి
కోరి కొలుతు జలజవదన కుదురగు మదితో
తీరమ్ము జేరి వారీ!
నీరీతులును గనఁగ నెద నిలుచును సుఖిగా
స్వస్తి.
సుప్రభ.
11-09-2017
కవయిత్రికి కవికభినందనలు.   
జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

గురుదేవులకు,సుప్రభ గారికి ధన్యవాదాలు మంచి పద్యబంధమును అందించారు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కవయిత్రి సుప్రభ గారు కంద బంధములతో అందరి మనసుల్ని బంధించి వేయడం ముదావహం . ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.