గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, డిసెంబర్ 2017, మంగళవారం

మహనీయుల ఔదార్య ఫలమే నాకు జరిగిన సత్కృతి.

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.
 వివేకానందనగర్,కూకట్పల్లిలో 9-12-2017న జరిగిన అష్టావధాన కార్యక్రమ్ంలో జరిగిన సత్కృతి 
మహనీయులారా! నా మనసు నన్ను అడుగుతోంది.
ఈ సత్కారము పొందుటకు నీవు అర్హుఁడవనే అనుకొంటున్నావా? అని.
ఔను నిజమే. పాపం అంతరాత్మ ఎప్పుడూ ఇలాగే చైతన్యపరుస్తూ ఉండే
ప్రయత్నమైతే చేస్తూనే ఉంటుంది కాని,అరిషడ్వర్గాల ప్రేరణా ప్రభావం ఆ
అంతరాత్మ మాటను చెల్లకుండా చేస్తూనే ఉంటుంది.
జితేంద్రియులైన మహనీయులైతే దానిని గ్రహించి,
అరిషడ్వర్గములనదుపులో పెట్టి అంతరాత్మ ప్రబోధను పాటిస్తుంటారు.
సరే నేను ఆత్మ పరిశీలన చేసుకొన్నాను.
నిజమే సత్కారింపఁబడుటకు నాకున్న అర్హత శూన్యమే.
ఐనే నెవరిని స్వీకరించుటకైనా తిరస్కరించుటకైనా?
ఆ పరమేశ్వరీ అనుగ్రహ ప్రాప్త ఫలములు అనివార్య గ్రాహ్యములు కదా.
అదీ కాక
ఇది సత్కరించే వారిలో ఉన్న ఔదార్యము, ఔన్నత్యము, సంస్కారము,
ఏవైతే ఉన్నవో అవి మాత్రమే నాకు జరిగిన యీ సత్కృతికి హేతువులు.
సీ. నిజభక్తి గరిమతో నిత్యుని జగమెల్లఁ గనుచు సేవించెడి ఘనులు కాన,
ప్రజలలో పరమాత్మ నిజరూపమును గాంచు సరససద్వర్తనాపరులు కాన,
భజియింప దేవునిన్ పద్యమే ఘనమంచు మదినెంచఁగల్గిన బుధులు కాన,
ప్రజ - పద్య సత్కృతుల్ భావించి యున్నట్టి హృద్యమై వెలుగొందు హితులు
కాన,
తే.గీ. దైవ భావంబు మదినెంచి తత్పరులయి
సత్కృతులు చేయు శిలకైన సజ్జన తతి.
వారి సంస్కారమౌనిది, మీరరాదు.
ధన్యవాదముల్ పల్కెద మాన్యులకును.
ఉ. దేహము తల్లిదండ్రులిడ, దీనికి ప్రాణము దైవమీయ, సం
దేహ నివృత్తి చేయు గురుదేవులు విద్యననుగ్రహింప, స
మ్మోహనివృత్తి సజ్జనుల బోధలు కల్గఁగఁ జేయ, సత్కృతుల్
దేహము పొందు. సత్కృతులు దేహికి చెందును. నాకు కాదయా.

నాపై అవ్యాజానురాగమును చూపెడి మహనీయుల మనోహర భావనాచయము
ముఖ పుస్తకమున ప్రకటితమైనవి వారి ఔదార్యప్రకటనకై ఇచ్చట ప్రచురించుచున్నాను.
ఆర్యులకు శుభోదయమ్. మహనీయులారా! నా మనసు నన్ను అడుగుతోంది.
ఈ సత్కారము పొందుటకు నీవు అర్హుఁడవనే అనుకొంటున్నావా? అని. 
...See More
LikeShow more reactions
Comment
Comments
Chandrashekhar Acharyulu Mummadi అభినందనలతో, నమస్కారములు గురువుగారు.
LikeShow more reactions
Reply
1
21 hrs
Manage
Chinta Rama Krishna Rao 🙏🙏🙏
LikeShow more reactions
Reply
1
20 hrs
Manage
LikeShow more reactions
Reply19 hrs
Manage
LikeShow more reactions
Reply18 hrs
Manage
Kadiyala Sridevi ముదావహం.అధ్భుతమైన మాననీయత పొందు పద్యములు.సర్.అభినందనలు సన్మానము పొందే వారికనీ,చేసేవారికినీ
LikeShow more reactions
Reply
2
19 hrs
Manage
Chinta Rama Krishna Rao అమ్మా! మీ మృదువాఙ్మహనీయత ఆనందం కలిగిస్తోందమ్మా.
LikeShow more reactions
Reply
1
18 hrs
Manage
జాజి శర్మ ఆర్యా !! ఆ సరస్వతీ మాత అనుగ్రహము పూర్తిగా ఉన్న మిమ్ములను సత్కరించే భాగ్యము కలిగిన వారే ధన్యులు. మీకు వందనసహస్రములు. !!
LikeShow more reactions
Reply
2
19 hrs
Manage
Chinta Rama Krishna Rao ఆర్యా! నమస్తే.

సహృదయులైన సజ్జనుల సంగతి నా పరమాత్ముఁడీయఁగా

మహితులు మీరు నన్ గనుచు మాన్యతఁ గొల్పుచు చూపుచుండఁగా
సహిత సువాక్స్రవంతి వర శారద పారఁగ జేయ, నుంటి నే
నిహము పరమ్ము జూపెడి మహేశ్వర సన్నిభులైన మీ దరిన్.
LikeShow more reactions
Reply18 hrsEdited
Manage
LikeShow more reactions
Reply
1
18 hrs
Manage
LikeShow more reactions
Reply18 hrs
Manage
Narayanabhatla Chaitanya ఈ సత్కారం మీకు జరగటం వలన నిజమైన సత్కార్యమై విలసిల్లుతున్నదండి 👌👌👌👏👏👏💐
LikeShow more reactions
Reply
1
19 hrs
Manage
Chinta Rama Krishna Rao ఆర్ష సాంప్రదాయ సంపన్నులైన మీవంటివారి పరిచయ భాగ్య ఫలములండి ఇటువంటి సత్కారములు. మీకు నా ధన్యవాదములండి.
LikeShow more reactions
Reply18 hrsEdited
Manage
Dubbakula Krishnaswamy అభినందనలు సార్
LikeShow more reactions
Reply
1
18 hrs
Manage
LikeShow more reactions
Reply18 hrs
Manage
కవిశ్రీ సత్తిబాబు సరస్వతీ పుత్రులు మీకు గాక ఇంకెవరికి ఆర్యా!
LikeShow more reactions
Reply
1
17 hrs
Manage
Rajendhar Ganapuram అభినందనలు సార్..!
LikeShow more reactions
Reply
1
15 hrs
Manage
Chinta Rama Krishna Rao ధన్యవాదములండి.
LikeShow more reactions
Reply
1
12 hrs
Manage
Satyanarayana Choppakatla సర్వధాసత్కారమునకు మీరుయోగ్యులు!అభినందనలు!
LikeShow more reactions
Reply
2
13 hrsEdited
Manage
LikeShow more reactions
Reply
1
12 hrs
Manage
Apaji Peri ॐ। शुभाभिनन्दनाःशुभाकाङ्क्षाः शुभाशयाश्च।।। भवन्त( एव अर्हः।।। नमः।।।
LikeShow more reactions
Reply
1
13 hrs
Manage
Suryanarayana Rao Ponnekanty సరస్వతీ కటాక్షముతో, అనితరసాధ్యసాహితీ ధురీణులుగా ప్రసిద్ధిగాంచిన సహోదరునకు హార్దిక అభినందనలు.
LikeShow more reactions
Reply
1
13 hrs
Manage
Chinta Rama Krishna Rao శ్రీమాన్ పొన్నెకంటి సహోదరులకు నమస్కార పూర్వక ధన్యవాదములు.
క. అగ్రజులాశీర్వాద స
మగ్రఫలంబగు మహాత్మ! మన్నికలెల్లన్.

నిగ్రహ మొసగిన దైవము
కుగ్రహ దోషములు బాపి కూర్చును శుభముల్.
LikeShow more reactions
Reply12 hrs
Manage
Suryanarayana Rao Ponnekanty వాణికరుణను తనిసెడు వరమువలన
పదము పదమున చిత్రమ్ము పరిఢవిల్లి
సారవంతపు కవనంబు స్వాదుగరిమ

మీదు చిర్నగవులలోన మిణుకు మనును.
LikeShow more reactions
Reply
1
11 hrs
Manage
Gopala Krishna Rao Pantula వినయము అన్నిటినీ మించిన భూషణమండీ.మీరు వినయ భూషణులని మీ పద్యాలే తెలుపు తున్నాయి.అద్భుతమైన పద్యాలు.అభినందనలు.
LikeShow more reactions
Reply
1
13 hrs
Manage
Chinta Rama Krishna Rao శ్రీమాన్ గోపాల కృష్ణ సహోదరులకు నమస్కార పూర్వక ధన్యవాదములు.
క. పంతుల జోగారావే
సాంతమునన్నియును నేర్పె సద్గుణ గణుఁడై.

చింతాన్వయుఁడనయిన నే
పంతులకున్ సోదరుండ వరగుణ ధామా!
LikeShow more reactions
Reply
1
12 hrs
Manage
Gopala Krishna Rao Pantula నమస్కారమండీ తమ్ముడిద్వారా మీ గురించి ఎన్నో సార్లు విన్నానండీ.
LikeShow more reactions
Reply
1
11 hrs
Manage
Chinta Rama Krishna Rao Gopala Krishna Rao Pantula గారూ! జోగన్న ఆశీస్సులతో పాటు మీ యొక్క ఆశీస్సులు కూడ నాకు లభిస్తున్నందుకు ఆనందంగా ఉందండి.
LikeShow more reactions
Reply
1
11 hrs
Manage
Apaji Peri ॐ। "अत्र'कालिदासोक्तिः'मम'मनःफलके'शम्पा+इव द्योतयतिस्म...'मन्दः'कवियशःप्रार्थी....इति।यथा... कालिदासः'प्रथितयशस्कोऽभवत्, तथैव... भवन्तोऽपि च ।।। किन्तु... सरस्वत्यर्चनालीनाः।।।"
LikeShow more reactions
Reply
1
12 hrs
Manage
Chinta Rama Krishna Rao శ్రీమాన్ అప్పాజీ మహనీయులకు నమస్కార పూర్వక ధన్యవాదములు.
మ. విలసద్భాషణ భాస్కరా! శుభగుణా! ప్రేమార్ద్ర సన్మానసా!
వెలయం జేసిరి నన్ను మీరు కవిగా, ప్రీతిన్ ప్రవర్ధిల్లఁగన్,
...See More
LikeShow more reactions
Reply
1
11 hrs
Manage
Apaji Peri ॐ। "ఇప్పఁటికే.... 'మీరు' జగమెఱిఁగిన'బ్రాహ్మణులు'!!! नमांसि अनेकानि ।।।"
LikeShow more reactions
Reply11 hrs
Manage
LikeShow more reactions
Reply11 hrs
Manage
Bhanumathi Hatti అభినందనలు గురువుగారు
LikeShow more reactions
Reply
1
10 hrs
Manage
Lsrk Sastry ఎదిగునకొద్దీ ఒదగమనే సత్యాన్ని చాలా చక్కగా చెప్పారు. అభినందనలు ఆర్యా నమస్కారం.
LikeShow more reactions
Reply
1
8 hrs
Manage
LikeShow more reactions
Reply
1
8 hrs
Manage
LikeShow more reactions
Reply7 hrs
Manage
Muddu Rajaiah Avadhani ఆభినందనలు

జైహింద్.
Print this post

3 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు
మిమ్ములను సత్కరించే భాగ్యము కలిగిన వారు ధన్యులు!!
మండలి సభ్యులకు అభివందనములు తెలియ జేయుచున్నాను.
తమరు వినయ భూషణులని పద్యాలే తెలుపు తున్నాయి.అద్భుతమైన పద్యాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మీ అభిమానానికి చాలా ఆనందంగా ఉందండి. నీకు శుభమగునుగాక.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా సంతోషంగా ఉంది. శుభాభి నందనలు సోదరా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.