గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, డిసెంబర్ 2017, గురువారం

కవి . .. .. .. కవిశ్రీ సత్తిబాబు.

 జైశ్రీరామ్.
కవి : - ' ఆత్వా మంత్రాః కవి శస్తావహస్తు' ( ఋగ్వేదము )
' సతోబంధ మసతి నిర విందన్ హృది ప్రతీష్య కవయో మనీషా' ( ఋగ్వేదము )
ఇట్లుగా వేదములో ఋషి పరముగాను ( జ్ణానిగా)...కవి పదము ప్రయుక్తమైనది.
నిఘంటుకారులు కవి శబ్దమును పండిత పర్యాయములలో వాడినారు.
'' విద్వాన్ విపశ్చి ద్దోషజ్ణ స్సస్సుదీః కోవిదో బుధః ధీరో మనీషీజ్ణః ప్రాజ్ణః సంఖ్యావాన్ పండితః 'కవిః'
రాగ ద్వేషాది విరహితుడును, సత్య సంపన్నుడు నగు వాడు ఋషి.
తత్వ దర్శనము చేసినవాఁడతడు....కవియు సర్వ విధముల ఋషిని బోలును.
విశుద్ఢమైన మనోముకురమున లోకాతీత పదార్ఢ దర్షనమాతనికి కలుగును.
శబ్ఢ బ్రహ్మ సాక్షాత్కారమును పొందిన పుణ్యుడు. ఇరువురును లోకకళ్యాణాకాంక్షులు.
కావుననే ఋషి ధర్మములు లేనివాడు కవి కాడు...
' నానృషిః కురుతే కావ్యః ' అను మను సూక్తి యు ఈభావమునే తెలుపును.
తత్వద్రష్టలైన వారు ఋషులే యగుదురు...కాని...కవులు గారు.
వారు వర్ణన రూపమైన వాక్+వ్యాపారమును సాగించినపుడు మాత్రమే కవులని వ్యవహరింపబడుదురు....
తత్వదర్షనము...వర్ణనము...అను ఈ రెండును గలవారే కవులని...లోకములో...ప్రసిద్దినొందినారు.......
వాల్మీకి తత్వ ద్రష్టయైనను.. రామాయణ రచన చేయనంతవఱకును...ఆమహర్షికి...కవియను పేరు రాలేదు.
కవి కావ్య ప్రపంచమునకు బ్రహ్మ. అతడు కోరిన రీతిలో అది మాఱుచుండును.
కవి రసికుఁడగుచో కావ్యము రసవంతమగును.
నీరసుడగుచో కావ్యము కూడ నీరసమగును.
మహాప్రతిభావంతుడగువాడు మాత్రమే కవి యనబడుట కర్హుడు.
ఎప్పటికప్పుడు నూతన నూతనముగా వికసించు బుద్దియే ప్రతిభ.
అట్టి ప్రతిభతో కూడిన వర్ణనమున నేర్పుగలవాడే కవి.
గతానుగతికుడు మాత్రము కవి కాజాలడు.
'ప్రజ్ణానవనవోన్మేష శాలినీ ప్రతిభామతా,
తదను ప్రాణనా జీవద్వర్ణనా నిపుణః కవిః'
స్వస్తి.
కవిశ్రీ సత్తిబాబు.
శ్రీ సత్తిబాబుగారికి అభినందనలు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.