గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, డిసెంబర్ 2017, శుక్రవారం

చిరంజీవి సాధు శ్రీవైష్ణవిని అభినందించిన ప్రజాపత్రిక వారపత్రిక.( తే.15-12-2017.) కు ధన్యవాదములు.

 జైశ్రీరామ్. 
ఆర్యులారా! శుభోదయమ్.
చిరంజీవి సాధు శ్రీవైష్ణవి వారగణన పృచ్ఛకురాలుగా నున్నందున నిర్వాహకులు ఈ చిరంజీవిని సత్కరించియున్నారు.
అవధాన నిర్వాహములచే సత్కరింపఁబడుతున్న కుమారి సాధు శ్రీవైష్ణవి.
చిరంజీవి సాధు శ్రీవైష్ణవిని అభినందించిన ప్రజాపత్రిక వారపత్రిక. తే.15-12-2017.
ఈ పత్రికా మణికి ధన్యవాదములు తెలియఁజేయుచున్నాను.
సుగుణ సుమాలనెన్నుకొని శోభను కొల్పెడి పత్రికాగ్రణిన్,
ప్రగణితరీతి వెల్గుచు ప్రభావము తోడ ప్రజాళి గుండెలన్
ధగ ధగ వెల్గు పత్రికను,  ధర్మప్రకాశను గొల్తునెన్నుచున్.
జగతిని వెల్గుగాత విరజాజులసౌరభమట్లు నిచ్చలున్.
జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

చిరంజీవి సాధు వైష్ణవి కి అభినందనలు..

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పృఛ్చకు రాలిగానే గాక ముందుముందు అవధానములు చేయగల అదృష్ట వంతురాలు కావలెనని " చి. సాధు శ్రీ వైష్ణవిని అభినందనలతో ఆశీర్వదించి .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.