జైశ్రీరామ్.
1.హంసయాన(శాంతి)వృత్తము.
అతిశక్వరీఛందము.వృ.సం10,923.
ర,జ,ర.జ,ర.గణములు.యతి9.వ.అక్షరము .
మేలు కొల్పు తెల్గుభాష-మేలు మేలు మిత్రమా!
జాల మేలె!నాంధ్రభూమి-చాలకాల మెంచుమా!
నేలవీడి సాముచేయ నేల?శ్రీల కోర్కెలన్!
కాల ధర్మ మంచునెంచి-కాలరాయ రాదుగా!
2.హంసయానవృత్తము
కమ్మనైన యమ్మ కాదె?-కష్టమెంచి కూర్చకన్!
దిమ్మదిర్గ!నెత్తిమోది-తేటుమాపి యొప్పగా
చెమ్మగిల్లె!తల్లికళ్ళు!-చేష్టవీ డి!స్తబ్దతన్!
ఇమ్మహింగనంగనౌనె?-యెంచు!తెల్గు శోభలన్!
3.తత్రసార వృత్తము
అష్టీఛందము.వృసం.38,267.
ర.న.జ.ర.జ.గ.గణములు.యతి.10.వ. అక్షరము.
చిత్ర గర్భ కవితలెల్ల! -చిందు తెల్గు వెల్గునై!.
మిత్ర తత్వ మొదవ జేసి-మేధ పెంచు సౌరులన్!
తత్ర సార మవధరించి-తాదృశావధానముల్!
ధాత్రి వెల్గు!శృతి వరామ!-ధన్య! కావగా వలెన్!
4.హంసయాన వృత్తము.
జీవ నాడి పెంపు చేయు!-శీఘ్ర మీవు!తెల్గుకున్!
భావజాల మేర్చి కూర్చి!-భావి దేశభాషగగా!
బ్రోవ రండి!కీర్తికాంత పూర్వ శోభ!నిండగా!-
నేవమొప్పధీటు పెంచి- నీమ నిష్టపెచుడీ!
5తావియ వృత్తము
అతిశక్వరీ ఛందము.వృ.సం.11,434.
ర.జ.ర.భ.ర.గణములు.యతి.9.వ.అక్ షరము.
ఆవగింజ మేలు లేని-యారాట మదేలనే?
పావనంబు కూర్చరండి-భద్రంపు స్వభావతన్!
తావి యౌత!తెల్గువారి-ధర్మంబు! సు శోధనన్!
భావి జీవితాలవెల్గు!-వాసింగన!నౌనటుల్ !
స్వస్తి.
వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ..
జైహింద్.
2 comments:
చాలా బాగున్నవి కవీశ్వరుల పద్యములు ముఖ్యంగా తత్రసార పద్యం.వారికి మాకందించిన మీకు వందన శతములు.
నమస్కారములు
అద్భుత మైన ఛందస్సులను అందిస్తున్న పండితోత్తములకు శిరసాభి వందనములు . మాకందిస్తున్న శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.