గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, డిసెంబర్ 2017, ఆదివారం

శ్రీ బీయస్సెస్ ప్రసాద్ కవి కృత శంఖ బంధ కందము.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ బియస్సెస్ ప్రసాద్ గారు శంఖబంధ కందమునందంగా వ్రాసియున్నారు. తిలకించండి.
శ్రీ బీయస్సెస్ ప్రసాద్ కవి కృత శంఖ బంధ కందము.
కం.వంచించుట నేరమ్మే!
వంచుట తల లంచమునకు వర నీచమ్మే!
వంచితులవర్ధనమ్మే
మంచిదనచు పంచ నెంచ మనధర్మమ్మే!
శ్రీమతి సుప్రభ గారి చేసిన ప్రక్రియ ననుసరించి వ్రాసినది. వారికి ధన్యవాదములు.
స్వస్తి.
బీయస్సెస్ పెఅసాద్.
కవిగారికి నా అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగుంది . ప్రసాద్ గారికి అభినందనలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.