జైశ్రీరామ్.
శ్లో. రాజా రాష్ట్ర కృతం పాపం!రాజపాపం పురోహితః!
భర్తా చ స్త్రీకృతం పాపం!
శిష్యపాపం గురుర్వ్రజేత్!! (భోజచరితమ్)
తే.గీ. ప్రజల పాపంబులవియెల్ల ప్రభువుఁ జేరు.
నృపుని పాపమరయ పురోహితుని జేరు
భార్య చేసిన పాపముల్ భర్తఁ జేరు.
శిష్యపాపంబు గురువునే చేరునయ్య.
భావము.
రాష్ట్రములోని ప్రజలు చేయు పాపములు రాజును పొందును; రాజు గావించు పాపములు పురోహితుడును, స్త్రీలు చేయు పాపములను భర్తలును పొందుదురు,శిష్యుల పాపములు గురువునకు సంక్రమించును. అనగా రాజు,పురోహితుడు,భర్త,గురువు,-వీరు ప్రజలు,రాజు,భార్య,శిష్యులు మంచిమార్గమున నడచుకొనునట్లు చూడవలసిన బాధ్యత గలవారని భావము.
జైహింద్.
1 comments:
నమస్కారములు
బాగుంది. పాపములను గురించిన వివరణ. నిజానికి ఇలాటివేవీ తెలియని నాలాంటి వారికి తెలుసుకోగల అవకాశం లభించినది. ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.