గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, అక్టోబర్ 2017, మంగళవారం

కవయిత్రి పావులూరి సుప్రభ కృత నాగోల్లేఖిత శ్రీకారబంధ కందాందము

జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి పావులూరి సుప్రభ కృత  నాగోల్లేఖిత శ్రీకారబంధ కందాందమును తిలకించండి.
నాగోల్లేఖిత శ్రీకారబంధ కందము 

కం.
శ్రీమతి! మతిమతి! భారతి! 
మామక హృత్పద్మసంస్థ మహిమోపేతా!
కామితవరదా! సుఖదా!
వామా!యందింతు జోత, ప్రముదిత మనమున్‌.
సుప్రభ 
10-26-2017.
కవయిత్రి సుప్రభవంటి వారి కృషి 
తెలుఁగు తేజాన్ని 
ద్విగుణీకృతం చేయకమానదు.
వారికి నా అభినందనలు.
జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

పావులూరి సుప్రభ గారి శ్రీకారబంధమును జూచి నేను మరియు కొందరు ఆ బంధమును ప్రయత్నము జేసితిమండి, సుప్రభ గారికి అభినందన వందనములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కవయిత్రి పావులూరి సుప్రభ గారి అందాల కందము అత్యద్భుతము . శ్రీ చింతా సోదరుల ఆంద్రామృతము బంధ కవనముల అమృతమును పంచి బంధించి వేస్తున్నందులకు . ధన్యోస్మి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.