జైశ్రీరామ్.
గవాక్ష బంధ కందము.
రామకృష్ణారావున్ మహేశా
రచన. చింతా రామ కృష్ణా రావు.
రారా మదీయ సుకృతిన్
ధీరుఁడ కృష్ణా మనోజ్ఞ కృపతో, రారా!
శ్రీరమణా! కను నీవున్
దా. రా. సన్నిగమ సంస్తుతా! హే శ్రీశా!
రా
రామదీ
య సుకృతిన్ ధీ
రుఁ
డ కృ ష్ణామ నోజ్ఞ
కృ
ప తో, రా రా శ్రీ ర మ ణా
క ను నీ వున్ దారాస
న్నిగ మసంస్తు
తా
హే శ్రీ
శా
జైహింద్.
2 comments:
గురుదేవులకు వరప్రసాదు వినమ్రవందనములు. మీ బంధ పద్యములు నేటి కవులుకు వేద పాఠము వలెనున్నవి. జయహో గురుదేవా !
==================
పద్య గర్భ మందు పద్యము లెల్లను
తల్లి దరి తనయులు తరలి నటుల
వ్రాయు ఘనుడగు మన రామకృష్ణ కవికి
వందన శతములను బలుక వలెను.
నమస్కారములు
పాండితీ స్రష్టకు ప్రణామములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.