గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, అక్టోబర్ 2017, శుక్రవారం

శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవికృత గవాక్ష బంధ కందము.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి గారు
వ్రాసిన గవాక్షబంధ కందము తిలకించండి.
శ్రీ హరి వీయస్సెన్ మూర్తి

మాన్యులు కవివర్యులు శ్రీ చింతా రామకృష్ణారావుగారు 
ఈరోజు పరిచయము చేసిన రచనను 
చూచూటవలన కలిగిన స్ఫూర్తితో చేసిన ప్రయత్నము.
వారికి నమశ్శతములు.

సత్యత్యక్తుం డగునా
నిత్యము కరిరాట్ప్రసాదు నిర్మల దయతో
భృత్యుడు నౌనా ప్రణతిన్
సత్యైశ్వర్యాహరుండు శౌరీ జేజే. 
 హరి వీయస్సెన్ మూర్తీ!
పరమాద్భుత రీతి మీరు పరుగు పరుగునన్
మురియుచు గవాక్ష బంధము
 నరయుచు కందమును వ్రాసిరాహా యనగా!
కవిగారికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు. శ్రీ హరి వీయస్సెన్ మూర్తి గారి గవాక్ష బంధం బహు సుందరముగా నున్నది. వారికి అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.