గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, అక్టోబర్ 2017, శనివారం

"నాగబంధ కంద పద్యము". గణపవరపువేంకటకవి కృత "ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసం"లోినిది.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
బ్రహ్మశ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు 
పరమ భాగవతులు.
వారికి చిత్ర, బంధ, గర్భ కవితాసక్తి మెండు. వారి ఆదాయమును ఇట్టి కవితా సంపదను పునరుద్ధరించుటకై వెచ్చించుచు, మరుగునపడిపోయిన మాన్య కవుల బంధ చిత్రాదులను వెలికి తీసి, చిత్రీకరించి ముద్రించుచు, ఆధునిక కవులకు చిత్రకవితానురక్తి కల్పించుచు మార్గదర్శకులగుచున్నారు. వారి ఇట్టి ప్రయత్నమును మనసారా అభినందించిచున్నాను. వారు చిత్రీకరిమ్చిన ఈ బంధము చూడుడు.
 "నాగబంధ కంద పద్యము". 
గణపవరపువేంకటకవి కృత 
"ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసం"లో 
"వింశతిబంధకందం"ఉంది.
ఆ కందం-
క. సార వర హార వారా!
సార హరీ నరహరి హర శర కరసారా!
గౌర ధరధీర చారా!
సార హరీ సుర హరి నర సరసార భరా!

ఈ కందంలో ఉన్న ఇరవై బంధాలలో ఈ నాగబంధం ఒకటి. 
ఈ నాగబంధాన్నికూడా అనేక
విధాలుగా చిత్రం రూపొందించవచ్చు ,
వాటిలో ఇది ఒకటి.
జైహింద్.
Print this post

4 comments:

Unknown చెప్పారు...

బ్రహ్మశ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారికి శతసహస్ర వందనములు.

గురుదేవులకు ధన్యవాదాములు. కంద పద్యంలో ఇరవై బంధాలా? అద్భుతంగా నున్నది. వీలైనంతవరకు బ్లాగులో పెట్చండి

Zilebi చెప్పారు...


బంధ కవిత్వ మంటే ఏమిటి ?
దాని నియమనిబంధనలేమిటి ?
తెలియ చేయగలరు

జిలేబి

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పూజ్య జిలేబీ గారూ! చిత్ర కవిత్వమును గూర్చి తెలుసుకోవాలని చాలా ఆసక్తితో ఉన్నందులకు చాలా ఆనందం అనిపించిందండి. ఇందునిమిత్తము మీకు నా ధన్యవాదములండి.
మీరు
అప్పకవీయము నాలుగవ ఆశ్వాసము 549 వ పద్యమునుండి 651 వ పద్యము అనగా రమారమి ఆశ్వాసాంతము వరకు పఠించిరేని మీకు పూర్తిగా అవగతము కాగలదని నా విశ్వాసము. నమస్తే.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జిలేబీ గారూ! మీరు అప్పకవీయ గ్రంథమును అంతర్జాలంలో https://archive.org/stream/appakaveeyamu018071mbp#page/n413/mode/2up అనే చిఱునామాద్వారా పొందనలవియగును.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.