జైశ్రీరామ్.
ఆర్యులారా!
కవయిత్రి శ్రీమతి మంతా భానుమతి గారు
శివశంకర గర్భ సీస పద్యమును వ్రాశారు.
గురువర్యులు, పండితులు చింతా రామకృష్ణా రావుగారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, ప్రతీ రోజూ పద్య గర్భ సీసములతో అమ్మవారిని స్తుతిస్తున్నారు. వారి స్తుతిలో భాగంగా శివశంకర గర్భ సీస పద్యమును వ్రాశారు. ఆ పద్యముతో స్ఫూర్తి నొంది, మేము కొందరం ప్రతీరోజూ నడుపుకుంటున్న ప్రహేళికకి శివశంకర గర్భిత సీస పద్యమును వ్రాశాను.
కవి మిత్రులు వీక్షించాలనే ఆశతో ..
శివశంకర గర్భ సీస పద్యము
సీ. జనియించి నది యశస్సనిశము భాసిలు
పొలుపౌ చరిత గల, పుడమి నేలు
ఘన వంశమున, నదే కద ఘన కీర్తిగ
తనకే, వరింపగా తమ్మునిగను,
వని యందున పురమున్పర వలతిన్, పను
చుకొనెన్ మమతలను సురతములను
తన సూత పటిక సత్ఫలితము లన్ సహ
జులతోడ తాతయే నిలను పలుక
పొలుపౌ చరిత గల, పుడమి నేలు
ఘన వంశమున, నదే కద ఘన కీర్తిగ
తనకే, వరింపగా తమ్మునిగను,
వని యందున పురమున్పర వలతిన్, పను
చుకొనెన్ మమతలను సురతములను
తన సూత పటిక సత్ఫలితము లన్ సహ
జులతోడ తాతయే నిలను పలుక
ఆ.వె. దేవు నామములను భావి తరముకిచ్చె
ఆలమంద నతడు నలవి కాచి
పాలనందజేసి బాగోగుల నడిగె,
మాయగాని చంపె మదమునణచి.
ఆలమంద నతడు నలవి కాచి
పాలనందజేసి బాగోగుల నడిగె,
మాయగాని చంపె మదమునణచి.
శివశంకర వృత్తము.
జనియించి నది యశస్సనిశము భాసిలు పొలుపౌ
ఘన వంశమున, నదే కద ఘన కీర్తిగ తనకే
వని యందున పురమున్పర వలతిన్ పనుచుకొనెన్
తన సూత పటిక సత్ఫలితము లన్ సహజులతో!
జనియించి నది యశస్సనిశము భాసిలు పొలుపౌ
ఘన వంశమున, నదే కద ఘన కీర్తిగ తనకే
వని యందున పురమున్పర వలతిన్ పనుచుకొనెన్
తన సూత పటిక సత్ఫలితము లన్ సహజులతో!
(మా ప్రహేళిక విప్పడానికి, పద్యం చదివి.. ఆ కథను చెప్పాలి.
స్వస్తి.
ఇట్లు
మంతా భానుమతి.
అమ్మా! భానుమతిగారూ! నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మీరు చేస్తున్న ప్రయత్నంలో కృతకృత్యులగుచున్నందులకు మీకు నా మనః పూర్వక అభినందనలమ్మా.
శుభమస్తు.
జైహింద్.
2 comments:
ధన్యవాదములండీ. చాలా ఆనందంగా ఉంది నాకు, మీ బ్లాగులో నా పద్యమునుంచినదుకు.
నమస్కారములు
శ్రీమతి భానుమతి గారు ! మీ శివశంకర గర్భ సీసము రసరమ్యముగా నున్నది. శ్రీ చింతా సోదరుల ఆంధ్రామృతములో మరిన్ని వ్రాయగలరని కోరుతూ .మీ అభిమాని
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.