జైశ్రీరామ్.
ఆర్యులారా! చి.మఠం శివకుమార్ విరచించిన గవాక్షబంధ కందము తిలకించండి.
శివవల్లభ నాకునొసగె
శివమాయను దాటుశక్తి !శిరమున గొలువై
వివిధ పదంబులు బలుకును!
దవతౌ కలమౌ జయంతి! తా యంత్రంబే!
దవతి= సిరాబుడ్ది
నా తొలి ప్రయత్నము ఈ ప్రక్రియలో. ప్రేరణగా నిలిచిన పెద్దలకు ధన్యవాదములు.
సుందర గవాక్ష బంధము
నందముగా శివకుమారు డమరిచె కనుడీ!
సుందర భావోద్బంధుర
కందమ్ముగ శివుడె వెలసె కారుణ్యముతో.
శివ కుమారునకు అభినందనలు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
గౌరవ నీయులైన శ్రీ మఠం శివకుమార్ గారికి అభినందన మందారములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.