గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, అక్టోబర్ 2017, శనివారం

మానినీవృత్త గర్భ సీసము. .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

 జైశ్రీరామ్
మానినీవృత్త గర్భ సీసము.
శ్రీమదనంతుని, చిన్మయ రూపుని, చేర్చిన చిత్తులు క్షేమకరులు.
క్షేమసుయోగ విశేషఫలంబుల శేష జనాళికిఁ జేర్తురిలను.
నీమముతోడ మనీష సుభక్తులనేకులనెన్నుచు నేర్పుమెయిని
మీ మహనీయ సమీప్సిత సత్కృతి మేలుగ నిచ్చిన  మేల్కలుగును.
తే.గీ. కాన మహనీయ కావ్యసత్కర్తలగుచు
చిత్ర గర్భసద్బంధముల్ చేర్చి హరిని
కొలుచువారల కర్పించి కోర్కె మీర
యిహపరంబులసాధించి హాయిఁ గనుఁడు.
సీస గర్భస్థ మానినీవృత్తము. (భ భ భ భ భ భ భ గ .. యతి 1-7-13-19)
శ్రీమదనంతుని, చిన్మయ రూపుని, చేర్చిన చిత్తులు క్షేమకరుల్..
క్షేమ సుయోగ విశేషఫలంబులశేష జనాళికిఁ జేర్తురిలన్.
నీమముతోడ మనీష సుభక్తులనేకులనెన్నుచు నేర్పుమెయిన్.
మీ మహనీయ సమీప్సిత సత్కృతి మేలుగ నిచ్చిన  మేల్కలుగున్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మనసును అలరింప జేసిన మానినీ వృత్తము రసరమ్యముగా నున్నది . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.