గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, అక్టోబర్ 2017, ఆదివారం

విశ్వముఖమత్స్యత్రయబంధ చంపకమాల. .. .. .. సుప్రభ


జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి పావులూరి సుప్రభగారు మత్స్యత్రయబంధ రచన ఎంత సులభంగా చేసారో చూడండి.

శుభకరి శారదాంబ యిటు చూడుము! చూడుము మించు కూర్మినే !
ప్రభ యెద మెచ్చ కాదనక పల్కుము ! పల్కుము పద్యమాలనే !
అభినవ మొల్లనే యనఁగ నల్లెద! నల్లెద నీదుగాథనే !
విభవము నెన్న నేనికను బ్రేమమునే యిల మెచ్చు భంగి నే !

మొదటి మూడు పాదములలో నొక్కొక్కటి యొక మత్స్యములో పొందుపరచబడినది. నాలుగవది చుట్టునున్న వలయములో నిక్షిప్తమైనది.
కవయిత్రి
పావులూరి సుప్రభ.
కవయిత్రికి నా అభినందనలు. ఇంకా అద్భుతమైన చిత్ర బంధ గర్భ కవితానురక్తితో కవితలు వెలయించాలని మనసారా కోరుకొనుచున్నాను.
జైహింద్.
Print this post

3 comments:

Unknown చెప్పారు...

కవయిత్రి పావులూరి సుప్రభగారు మత్స్యత్రయబంధ ము చాలా బాగున్నది. వారికి అభివందన శతము, వారి మనమునున్న కోరిక శారదాంబ తప్పక నెరవెర్చాలని మనసారా కోరుకుంటూ.....

Unknown చెప్పారు...

కవయిత్రి పావులూరి సుప్రభగారు మత్స్యత్రయబంధ ము చాలా బాగున్నది. వారికి అభివందన శతము, వారి మనమునున్న కోరిక శారదాంబ తప్పక నెరవెర్చాలని మనసారా కోరుకుంటూ.....

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కవయిత్రి పావులూరి సుప్రభ గారికి అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.