గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, అక్టోబర్ 2017, శుక్రవారం

మన వడ్డాది పాపయ్య ప్రతిభా పాటవాలు మనకసలు తెలియనే తెలియవు.

జైశ్రీరామ్.
కీ.శే. శ్రీ వడ్డాది పాపయ్య శాస్త్రి గారు 
1904లో చిత్రించిన పటం 
చూడండి. 
తలక్రిందులు చేసినా మామూలుగానే కనిపిస్తుంది. 
ఇప్పుడు తలక్రిందులుగా చూద్దాం.

ఎంతటి భావనాగరిమ! ఏమి విలేఖన నైపుణంబు. ర
వ్వంతయు లేదు భేదము. దివంగతులయ్యును పాపయార్యులీ
వింతగు చిత్రలేఖన సువిస్తర తేజసమందు జీవులై
సంతతమున్ బ్రజాళి మది సన్నుతులందుచునిల్చిరిద్ధరన్.
పాపయార్యులకు అంజలులర్పిస్తున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వడ్డాది పాపయ్య శాస్త్రిగారు అద్భుతమైన చిత్ర కారులు .వారిని కొనియాడ డానికి ఈ చిన్న కలం సరిపోదు. ఆయన దేవ శిల్పి . శత వందనములు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.