గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, మే 2015, శనివారం

రామ స్కంధం, హనూమంతం, మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.   
శ్లో. రామ స్కంధం, హనూమంతం, వైనతేయం, వృకోదరం, 
శయనేతు స్త్మృతే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి.
క. రాముని, స్కంధుని, హనుమను,
శ్రీమద్ఘన వైనతేయ శ్రేయస్కరునిన్,
ప్రేమను భీముని తలచిన
క్షేమము దుస్స్వప్నబాధ చేరదు నిద్రన్.
భావము. రాముని, స్కంధుని, హనుమంతుని, గరుడుని, భీముని, నిద్రించే వేళ తలుచుకొంటే దుస్వప్నాలు కలుగవు 
జైహింద్.

Print this post

3 comments:

సురేష్ బాబు చెప్పారు...

దుస్వప్నం తస్య నశ్యతి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమె ఈ దైవములను స్మరిస్తే మంచి నిద్ర పడుతుంది ఇక స్వప్నా లెక్కడివి ? మంచి శ్లోకం తెలియ జెప్పారు ధన్య వాదములు

అజ్ఞాత చెప్పారు...

పేరణి శివరాజ్, శయనేయ స్మరేన్నిత్యం దుస్వప్నం తస్యనస్యతి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.