గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మే 2015, శుక్రవారం

యజ్ఞోపవీత ధారణ ప్రక్రియ.

జైశ్రీరామ్.
యజ్ఞోపవీతం (జంధ్యం) మార్చుట
ప్రశ్న. జంధ్యం ఎప్పుడు మార్చవలెను?
సమాధానము. ఎడమ చేయి క్రిందకు జారినప్పుడు./ క్రింద పడిపోయినప్పుడు / దారం తునిగిపోయినప్పుడు / ముట్టకూడనిది ముట్టినప్పుడు/మలినము అయినప్పుడు / ప్రతి నాలుగు నెలలకూ ఒక సారి / దగ్గర బంధువులు చనిపోయినప్పుడు / శ్రాద్ధం సమయంలో /యజ్ఞం చేయునప్పుడు / చంద్ర/సూర్య గ్రహణం తరువాత.
పూజా విధానం
జంధ్యమునకు పూజ.
(జంధ్యాన్ని ఏదైనా ఆకు లేక పళ్ళెం లో వుంచి, నీళ్ళు చల్లి, ఈ క్రింది మంత్రము చదువుతూ, ప్రతి సారి అక్షింతలు, పూలు విడువవలెను)
ప్రథమ తంతో; ఓం ఒంకారమావాహయామి| ద్వితీయ తంతో; ఓం అగ్నిమావాహయామి| తృతీయ తంతో; సర్పానావాహయామి| చతుర్థ తంతో; ఓం సోమనావాహయామి| పంచమ తంతో; ఓం పిత్రునావాహయామి| షష్ఠ తంతో; ఓం ప్రజాపతిమావాహయామి| అష్టమ తంతో; ఓం సూర్యమావాహయామి| నవమ తంతో; ఓం విశ్వాన్ దేవానావాహయామి|

ప్రథమ గ్రన్తో ఓం బ్రహ్మనే నమః; బ్రహ్మ నావాహయామి| ద్వితీయ గ్రన్తో ఓం విశ్వనే నమః; విష్ణు మావాహయామి| తృతీయ గ్రన్తో ఓం రుద్రాయనమః; రుద్రమావాహయామి|
(చందనంతో ఈ క్రింది మంత్రము చదువుతూ పూజ చేయవలెను)
ప్రణవాధ్యావాహిత దేవతాభ్యోనమః యథాస్థానం న్వసామి|
(తరువాత అక్షింతలు నీళ్ళు చల్లుతూ పది సార్లు గాయత్రీ మంత్రము చెప్పవలెను)
ఓం యగ్నోపవీతమితి మంత్రస్య పరమేష్టీ రుషిహి, లింగోక్తా దేవతాః, త్రిష్టుప్ ఛందః, యజ్ఞోపవీత ధారణే వినియోగః|
(పై మంత్రము తరువాత నీళ్ళు వదలవలెను)

యజ్ఞోపవీత ధారణ మంత్రం
(ఈ క్రింది మంత్రము చదువుతూ ఒక్కొక్క పోరువు వేసుకోనవలెను. మధ్యలో ఆచమనము చేయవలెను. ఎడమ చేయి మీదుగా వేసుకొని, తల మీదనుండి కుడి వైపునకు మార్చి, కుడి చేయి క్రిందకు వచ్చేటట్టు వేసుకొనవలెను)
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం, ప్రజపతేర్వత్ సహజం పురస్తాత్|
ఆయుష్యమగ్ర్యం ప్రతిమృచ్చ శుభ్రం, యజ్ఞోపవీతం బలమస్తు తేజః||
ఓం యగ్నోపవీతమసి యజ్ఞస్వత్వా యగ్నోపవీతనోపనహ్యామి |

పాత యజ్ఞోపవీతాన్ని త్యజించుట
ఎతావద్దిన పర్యంతం బ్రహ్మత్వం ధారితం మయా| జీర్ణత్వాత్ త్వత్ పరిత్యాగే గచ్చ సూత్ర యథాసుఖం||
(పై మంత్రము చదువుతూ తల మీదనుండి వెనుక ప్రక్కకు తీసి, ముడి వేసి, జలములో(ప్రవాహములో) విడువవలెను)

(తరువాత) నూతన యజ్ఞోపవీత ధారణ సమయే మంత్ర తంత్ర స్వర వర్ణ లోప ప్రాయశ్చిత్తార్థం యథా శక్తి గాయత్రీ మంత్ర జపం కరిష్యే అని గాయత్రీ మంత్రము జపించి  ధారపోయ వలెను.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.