గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, మే 2015, ఆదివారం

శ్రీచక్ర బంధ శ్రీరామ దశకము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆ శ్రీరామ చంద్రుఁడు నాచే వ్రాయించిన శ్రీచక్రబంధ శ్రీరామ దశకముపై మీ అమూల్యమైన సూచనలీయగలరని ఆశించుచున్నాను.
మధుర సన్నామ శ్రీ రామ మాన్య నామ!
మహిమతో గను శ్రీ  వర మాన్య వేగ!
మదిని సద్గుణ శ్రీ గన మార్చి తీర్చు !
మహిమతో మది మల్లెగ మార్చు రామ! 1. 
 మమతలన్ బాసి శ్రీ గతి మార లేమ?
మదికి నిన్జూపి శ్రీ గొల్పుమయ్య వేగ!
మర్త్య కుల పోష శ్రీలుగ! మమ్మొనర్చు.
మహిమతో మది మల్లెగ మార్చు రామ! 2.
 మనుజ శేఖర! శ్రీ రామ! మర్త్య ధామ!
మసలఁజేయుమ! శ్రీమార్గ మర్త్యులనగ.
మసకలన్ బాపి శ్రీ జూపి మంచిఁ గూర్చు.
మహిమతో మది మల్లెగ మార్చు రామ! 3.
 మనమయోధ్యగ శ్రీరామ మార్చ లేమ?
మసల నీ తోడ శ్రీమాత మమ్ము వేగ.
మది సురాజ్యమ్ము శ్రీ రామ మాన్య కూర్చు.
మహిమతో మది మల్లెగ మార్చు రామ! 4.
 మమ్ము  గృపఁ జూచు శ్రీ శుభ మార్గ రామ!
మరులు బాపుమ! శ్రీయజ్ఞ మార్గ వేగ.
మకిల మంటని శ్రీశుగా మమ్మొనర్చు.
మహిమతో మది మల్లెగ మార్చు రామ! 5.
 మదిని నీవుండ శ్రీ చేరు మమ్ముఁ బ్రేమ.
దయను బోధించు శ్రీచక్ర తత్వ భాస.
గరువమున్బాపి శ్రీ లిచ్చి కాచు మాన్య.
మమ్ము దయఁ గనుమయ్య సమ్మాన్య! రామ.6.
 మధుర సన్నామ శ్రీ రఘు మాన్య రామ.
దర్ప ప్రశమన! శ్రీమద్విధాన భాస.
గరుఁడ వాహన! శ్రీమత్సు కావ్య మాన్య.
మమ్ము దయఁ గనుమయ్య సమ్మాన్య! రామ.7.
మరపునే బాపి శ్రీగొల్పు మద్విరామ.
దక్షుఁడవు నీవె శ్రీ శుభదప్రభాస!
గతిని చూపించు శ్రీ యనఘా! వదాన్య.
మమ్ము దయఁ గనుమయ్య సమ్మాన్య! రామ. 8. 
 మనుజ రక్షక శ్రీ రామ మాన్యధామ!
దప్పికను బాపు. శ్రీ రామ తత్వ దాస.
గట్టు కృపఁ జేర్చి శ్రీ గూర్చి కాచు మాన్య!
మమ్ము దయఁ గనుమయ్య సమ్మాన్య! రామ. 9.
మచ్చికను జేర్చు శ్రీ శుభమార్గ రామ.
దమము చేకూర్చు శ్రీ పరంధామ వాస
గమ్య మును చూపు శ్రీ రామ కావ్య  మాన్య.
మమ్ము దయఁ గనుమయ్య సమ్మాన్య! రామ. 10.
 భగవదర్పితముగా చింతా రామ కృష్ణా రావు
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ చక్రబంధ శ్రీరామ దశకము సులభ శైలిలో " మనసు మల్లెగ మార్చురామ " అన్న మకుటంతో తేటగీతిలో , మరికొన్ని " దయగనుమయ్య సమ్మాన్య రామ " అన్న మకుటంతో అతి మధురంగా రచించిన శ్రీ చింతా రామ " కృష్ణా రావుగారికి హృదయ పూర్వక శుభాభి నందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.