గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మే 2015, బుధవారం

రాజన్. కనకదారాభిః ... (భోజ రాజ యుగమ్)

జైశ్రీరామ్.
శ్లో. రాజన్. కనకదారాభిః త్వయి సర్వత్ర వర్షతి
అభాగ్యచ్చత్ర సంఛన్నేమయి నాయాన్తి బిందవః
ఆ.వె. నిరత కనక వృష్టి నీ చేత నంతటా
పడుచునుండి కూడ పడదు నాదు  
శిరముపైన. కనుమ దురదిష్ట ఛత్రమ్ము 
నాదు శిరము పైన.  సాధు భోజ!
భావము. భోజరాజా! నీవు కనక వర్షాన్ని కుర్పిస్తున్నావు. అయితేనేమి? దురదృష్టమనే గొడుగు 
నా తలమీదనుంది. ఒక్క చినుకైనా నా మీద పడటం లేదు సుమా!
ఈ మాట విన్న భోజరాజు ఆ మహాకవి దీన స్థితిని అర్థం చేసుకొని, అవసరమైన ఆర్ధిక సహాయం అమ్దజేసెను. పిదప తాను చేయుచున్న దాన ధర్మాదులు రాజోద్యోగుల దుష్ప్రవృత్తి కారణంగా సద్వినియోగమవటం లేదని గ్రహించి, దురితులను దండించి, ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకొనెను..
జైహింద్.




Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఒక కవి భావ గర్భితంగా విన్నవించిన విషయాన్ని భోజ రాజు అర్ధం చేసుకుని తన పరిపాలనను సరిదిద్దు కోవడం ముదావహం చాలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.