గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మే 2015, శుక్రవారం

ఆదివారం వచ్చిందంటే చాలు ఇంటిల్లుపాదిచేత ఆముదం త్రాగించేయదమే .

జైశ్రీరామ్.
ఆర్యులారా! పూర్వం మన పెద్దలు ఆదివారం వస్తే చాలు ఇంటిల్లుపాదికీ ఆముదం పట్టేసేవారు.  ఆ త్రాగే ఆముదం విరోచన సాధనము. కడుపులో ఎటువంటి వ్యర్ధ పదార్థములున్నా ఈ ఆముదం త్రాగడం వల్ల విరోచనం ద్వారా శరీరం నుండి బహిష్కరింపబడేవి. ఆనాడు ఈ నాటి వలె అనారోగ్యాలు లేకపోవడానికి కారణం బహుశా మన పెద్దలు తీసుకొనే ఇలాంటి జాగ్రత్తలేనేమో కారణం. చూడండి పిల్లలకి బలవంతంగా ఆముదం ఎలా పడుతున్నారో..
‘ఆముదము’ నేడు లేదుగ! 
ఆ ‘ముదము’ను నేడు లేదు. హరహర! మాకున్
క్షేమము నెటులీయగలవు
శ్రీమచ్చిరసంపదవిడ.  శ్రేయంబెటులౌన్?
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును ఆరోజుల్లో ఇంచక్కా పసిపిల్లలకి పాలతో రంగరించి ఆముదం పెట్టే వారం .తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయించి ఒంటికి ఆముదం రాసి పల్చటి బట్ట సగం వరకు కప్పి పడుకో బెడితె హాయిగా నిద్రపోయే వారు .పెరిగిన కొద్దీ వారం పదిరోజులకోసారి ఆముదం పట్టించేవారం .ఇప్పుడు అబ్బే అసలు నెత్తికి కుడా నూనె లేదు ఆముదం అంతకంటె లేదు ప్చ్ ! ఏమిటో ఈ మార్పులు ?
మంచి విషయాలను గుర్తు చేసారు .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.