జైశ్రీరామ్.
శ్లో. సర్వా ఏవాపద స్తస్య యస్య తుష్టం న మానసమ్ !సర్వాః సమ్పత్తయ స్తస్య సన్తుష్టం యస్య మానసమ్ !!
ఆ. తృప్తి లేకయున్న ప్రాప్తించునశుభముల్.
తృప్తి యున్న వర శుభాప్తి మనకు.
తృప్తి విడిచి దుఃఖ తీరంబు గననేల?
తృప్తితోడ మెలగు జ్ఞప్తిఁ గలిగి.
భావము. ఎవని మనస్సున తృప్తి యనునది ఉండదో అట్టివానికి అన్నీ ఆపదలే. ఏ మానవునకు మనస్సు నిత్యము సంతృప్తితో నుండునో అట్టి మానవునికి అన్నీ సంపదలుగనే పరిణమించును.
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును . అసలు తృప్తి అనేది లేకపోవడమే అశాంతికి కారణము ." మనకున్నది చాలు " అనుకున్నవాడు హాయిగా ఉంటాడు . " లేదు " అన్న పదం చాలా చెడ్డది . శ్రీ చింతావారి సూక్తి అసలైన మేలిమి బంగారం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.