గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, మే 2015, శుక్రవారం

అజరామరవత్ప్రాజ్ఞ: విద్యామర్థం చ సాధయేత ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. అజరామరవత్ప్రాజ్ఞ:  -  విద్యామర్థం చ సాధయేత్
గృహీత ఇవ కేశేషు  -  మృత్యునా ధర్మ మాచరేత్.
ఆ. ముసలితనము, మరణము తనకు లేనట్లు 
ధనము విద్య లరసి గొనుత నరుడు.
మృత్యువమరుటెఱిగి నిత్యంబు ధర్మము
చేయుచుండుటొప్పు. చేయుడయ్య.
భావము. మానవుడు  ముసలి తనము  మరణము లేనివాని వలె విద్యను ధనమును  సంపాదించ వలెను. ఇక మృత్యువు తనను జుట్టుపట్టుకొని లాగుచున్నదను భావము తో ధర్మమును ఆచరించ వలెను. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమే విద్యను సంపాదించు కోడానికి వయస్సుతో పనిలేదు .అలాగే వయస్సు పెరిగే కొలదీ మంచి పనులు చేయడం మానవ ధర్మం ఇంతకంటే మెలైన బంగారం వేరే ఎక్కడుంది ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.