గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జనవరి 2025, సోమవారం

అగ్నిహోత్రఫలా వేదాః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  అగ్నిహోత్రఫలా వేదాః - శీలవృత్తఫలం శ్రుతమ్l         

రతిపుత్రఫలా నారీ - దత్తభుక్తఫలం ధనమ్ll

తే.గీ.  వేద ఫల మగ్ని యందున వేల్చుటెయగు, 

సత్ప్రవర్త ఫలమగు శాస్త్రములకు, 

పతిని గూడిపుత్రినిగాంచు టతివఫలము, 

ధనము నకు  దాన భోగముల్ తగిన ఫలము. 

భావము.  వేదము అగ్నిహోత్రార్చమే ఫలముగా కలది . శాస్త్రము సత్ప్రవర్తనయే 

ఫలముగా కలది. స్త్రీ భర్తృసంగమమూ, తద్వారా పుత్రప్రాప్తీ ప్రయోజనంగా కలది. 

ధనము దానం చేయఁబడుట, అనుభవింపఁబడుట ఫలముగా కలది.

జైహింద్.

తే. 19 - 01 - 2025.న కూకట్పల్లిలో జరిగిన అవధానములో....

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

మైత్రి అన్న అంశం మీద ఉపన్యాసము - వాగ్విదాంవర బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ. - మియాపూర్ మిత్రమండలి 18 - 01 - 2025.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

19, జనవరి 2025, ఆదివారం

యస్మాదభావీ భావీ వా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  యస్మాదభావీ భావీ వా  -  భవేదర్థో నరం ప్రతి |

అప్రాప్తౌ తస్య వా ప్రాప్తౌ  -  న కశ్చిద్వ్యథతే బుధః ||  (మహాభారతం)

తే.గీ.  కోరుకొనునది చేరునో, చేరబోదొ

దైవవశమది, దానికై తగదు వగవ,

జ్ఞాని వగవఁడు దేనినైనను సహించు,

నుత్తమునిలక్షణంబిది యుర్విపైన.

భావము.  అదృష్టం అనేది దైవవశమైనందువల్ల మనిషికి ఇష్టమైన వస్తువులు 

లభించవచ్చు లేదా లభించకపోవచ్చు. అందుచేత, జ్ఞానవంతుడైనవాడు 

తనకు ఇష్టమైన వస్తువు లభించకపోయినా లేదా అనిష్టం కలిగినా దుఃఖపడడు.

జైహింద్.

మియాపూర్ సాహితీమిత్రమండలి చతుర్ధ వార్షికోత్సవము...మా.శ్రీ. గారి గ్రంథావిష్కరణ.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

కవుతా రామకృష్ణ యాదృచ్ఛిక సాధనావధానము.

1 comments

 

జైశ్రీరామ్.
కవుతా (ఊకదంపుడు) రామకృష్ణ మా గృహమునకు న్యస్తాక్షరి నేర్చుకుందామని వచ్చి మూడు ఛందోభాషణలు, సమస్యాపూరణ, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరీ, ఆశువు,న్యస్తాక్షరి అప్రస్తుతము, సమర్ధవంతంగా చేసిన సందర్భంగా నేను వానికి చేసిన సత్కారం.

కవుతా రామకృష్ణ యాదృచ్ఛిక సాధనావధానములోని ధారణాంశములు

నిషిద్ధాక్షరి  రాధాకృష్ణులు ఆధారముగా జీవత్మ పరమాత్మ ఐక్యత
(పథమాక్షరం శ్రీవినావర్ణ నిషిద్ధం. చివరి రెండు పాదములు స్వేచ్ఛ)    
శ్రీవిద్యాచిహ్నవిధిన్
జీవిపథగతిన్ యశదరుచిన్ నేర్పన్ రా
జీవాక్షుండును రాధయు
భావింప నభేదము గని, ప్రాపించిరటన్

సమస్య:
భామకు మీసము మొలిచెను బాపురే కనితే

ఏమందులు దాఁ గొనెనో
కోమలత నెగడఁగఁగోరి కోమలి యకటా!  
మోమున సత్కళ దప్పెను
భామకు మీసము మొలిచెను బాపురె కనితే

దత్తపది:
హరి,పర,కర, హర పదములతో మరికాసేపటిలో జరుగనున్న పుస్తకావిష్కరణ
 
హరిజుని భార్యయె మురియగ,
ధర బుధపరమై వెలుంగఁ, దత్త్వము గఱపన్
గరమీ పుస్తకము దనరు
హరదేవుడు దయఁ గవీంద్రు ననయము గావన్    

వర్ణన : 
శ్రీలక్ష్మీదేవి, తేటగీతి లో

పద్మమున నిల్చి సాగరభవయె శోభ
లీనుచును దయాభరితమౌ దృక్కులొలుక
శ్రీహరికృపాసహితముగఁ జెంగలించె
మీగృహంబున నిరతము మిమ్ముఁ గావ!  

న్యస్తాక్షరి
1వ పాదము 4వ అక్షరము "రా"
2వ పాదము 11వ అక్షరము "మ"
3వ పాదము 7వ అక్షరము "కృ"
4వ పాదము 19వ అక్షరము  "ష్ణ"
ఉత్పలమాలలో నూతన సంవత్సరాగమనము

చిత్తము రాజిలన్ వరలె శ్రీకరమౌ నవవర్ష మిత్తరిన్
సత్తువ మీకొసంగగను, క్షామము బాపగ నుర్వియంతటన్
దత్తుడు చూడగా కృపను  ధ్వాంతము మాసియె శోభలీనగన్
రిత్తపు మాటలై చనక ప్రేమగఁ దీర్చుత మీదుతృష్ణలన్  
-------------------
ఒక ఛందోభాషణము
ప్రా: నీపేరేమిటి చెప్పుమా
రా: బుధులు క్షోణిన్  రాముడంచందురే
ప్రా: ప్రాపౌపుత్త్రకుడుండెనా?
రా: కలడు రూపంబౌచు నాతోడుతన్
ప్రా: మీపద్మాక్షియు క్షేమమా?
రా: తనరు తాన్ మీనాక్షి సేవోన్నతిన్;
    మీపేరేమియొ?
ప్రా:రామకృష్ణుడను
రా:స్వామీ మీకు చేతున్ నతుల్  
నీపేరేమిటి చెప్పుమా? బుధులు క్షోణిన్  రాముడంచందురే
ప్రాపౌ పుత్త్రకు డుండెనా? కలడు దీపంబౌచు నాతోడుతన్
మీపద్మాక్షియు క్షేమమా? తనరు తాన్ మీనాక్షి సేవోన్నతిన్,
మీపేరేమియొ? రామకృష్ణుడను;  స్వామీ మీకు చేతున్ నతుల్.

జైహింద్.

మనిషి గుణం గురించి స్వామీ వివేకానంద చెప్పినంత విపులంగా ఎవరూచెప్పలేదు.

0 comments

జైశ్రీరామ్.
ఈ వివరించిన విషయాలను కవులు పద్యాలుగా అత్యద్భుతంగా వ్రాసి కామెంట్ చేసి పంపగలరు.
జైహింద్.

18, జనవరి 2025, శనివారం

ఆగమాపః ప్రజా దేశః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.   "ఆగమాపః ప్రజా దేశః  -  కాలః కర్మ చ జన్మ చ.!

ధ్యానం మంత్రోఽథ సంస్కారో,  -  దశైతే గుణహేతవః".!!  (మనుస్మృతి)

తే.గీ.  దైవము, పరిసరము, పని, త్రాగు నీరు,

దేశమును, జన్మ, కొనునుపదేశ, మంత్ర,

ధ్యాన విషయమున్, మనుకాల మను పదియును,

వ్యక్తి గుణముల మూలముల్, భక్తిపూర్ణ! 

భావము.  ఆరాధించు దైవము, త్రాగునీరు, చుట్టూ ఉండే పరివారము, 

జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయుపని, పుట్టిన పుట్టుక, 

ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము. 

ఈ పదిన్ని వ్యక్తులలోని గుణము లకు కారణము లగుచున్నవి.

జైహింద్.

17, జనవరి 2025, శుక్రవారం

అనేక శాస్త్రం బహు వేదితవ్యమ్. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అనేక శాస్త్రం బహు వేదితవ్యమ్ - అల్పశ్చ కాలో బహుశ్చ విఘ్నాః ।

యత్ సారభూతం తదుపాసితవ్యం - హంసో యథా క్షీరమివామ్బుమధ్యాత్ ॥

తే.గీ.  ఎఱుఁగ వలసిన గ్రంథము లెన్నొ కలవు,

కాలమల్పము, విఘ్నముల్ కలుఁగుచుండు,

క్షీరనీరంబులను హంస క్షీరముగొను,

మంచినట్టులే గొనవలె మనము, నరుఁడ!

భావము.  చాలా గ్రంథాలు ఉన్నాయి, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి, 

కానీ సమయం పరిమితంగా ఉంది. మరియు అనేక అడ్డంకులు ఉన్నాయి. 

కాబట్టి మనం హంస యే విధముగా క్షీరనీరముల మిశ్రమము నుండి క్షీరమును 

మాత్రమే గ్రహించునో అట్టులే మనము కూడా సారవంతమైనవాటినే 

గ్రహించవలెను.

జైహింద్.

అనవాప్యం చ శోకేన. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  అనవాప్యం చ శోకేన - శరీరం చోపతప్యతే

అమిత్రాశ్చ ప్రహృష్యన్తి - మా స్మ శోకే మతిం కృథా:                         

(విదురనీతి)

తే.గీ.  దుఃఖపడినంత దొరకదు దూరమైన

దేదియైనను, తాప మహితము మిగులు,

శత్రువులు సంతసింతురు, జయనిధాన!

మెలగుమీవు దుఃఖము వీడి, మేలు గనుము. 

భావము. శోకించినంత మాత్రాన కోరిన వస్తువు లభించదు. శరీరమా తాపము 

చెందును.  శత్రువులు సంతసించెదరు. అందువలన నీ మనస్సును శోకము వైపు 

మళ్ళించకుము. దేనికీ దుఃఖింపకుము..

జైహింద్. 

ఆహార నిద్రా భయ మైధునాని . ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. ఆహార నిద్రా భయ మైధునాని 

సామాన్యమేతత్పశుభిర్నరాణాం 

జ్ఞానంహి తేషా మధికో విశేషః 

జ్ఞానేన హీనః పశుభిస్సమానః.

(ఉత్తర గీత 2-44)

తే.గీ.  నిద్ర, భయ, మైధు నాహార క్షుద్రగుణము

లరయ పశువులన్ మనుజుల నాశ్రయించి

యుండు, జ్ఞానంబు నరునిలో నుండు, జ్ఞాన

హీన నరుఁడు పశు సముఁడు, భానుతేజ!

భావము. ఆహారము నిద్ర భయము మైధునము నాలుగును ప్రాణి ధర్మములు.

 ఇవి జంతుకోటికి ఎంతటి అవసరమో మానవులకును ఆంతియే. అయిననిందు 

విశేష మేమిటనిన మానవులకు జ్ఞానమనునది అధికముగా నున్నది. 

పశువుల కది లేదు. అందువలన జ్ఞానహీనుడు పశు సమానుడు. 

జైహింద్.

16, జనవరి 2025, గురువారం

గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ అష్టావధానము.Gummannagari Laxminarasimha Sharma

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

దుష్కరం కిం మహాత్మనామ్? మహోదార గుణ సంపన్నులయిన బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి మహోదయులకు అభినందన చందన చర్చ.

1 comments

 జైశ్రీరామ్.

బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి .. అయోధ్య. 95507 54389 .

వీరి వితరణ అసామాన్యం. రామభక్తి అసాదృశం. ప్రజా సేవ అమోఘం.

వీరికి వీరి అర్థాంగి గారికి పాదాభివందనములు.



మహోదార గుణ సంపన్నులయిన బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి మహోదయులకు 
అభినందన చందన చర్చ.

శా.  శ్రీమన్మంగళ సూర్యవంశ తిలకా! శ్రీరామ చంద్రప్రభూ!
ధీమంతుల్, మహనీయ భక్తియుతులున్, దివ్యాత్ములైనట్టి చ
ల్లా మాన్యాన్వయ శ్రీనివాసు,  జగతిన్ లక్ష్యంబుతో సేవలన్
నీమంబొప్పఁగ చేయు నీకు, మహితున్ నీవే కృపన్ బ్రోవుమా.

శా.  లక్ష్యంబొప్పఁగ  సేవఁజేయు ఘన చల్లావంశ భాస్వన్మణీ!
సాక్ష్యంబారఘు రామచంద్రుఁడగు మీ సన్మార్గ సత్ సేవకున్,
భక్ష్యంబుల్ వరభోజనంబు, వసతిన్ భక్తాళికిన్ గొల్పు మీ
లక్ష్యంబున్ నెరవేర్చు నిత్యముగనా లక్ష్మీధవుండాప్తితోన్.

చం.  ధనమది కల్గవచ్చు, వరదానగుణంబు, నుదార తత్త్వమున్,
వినయము, సత్యశీలమును, విశ్వజనీనత కల్గుటన్న దా
జనకజ రామచంద్రుల యసాదృశ సత్కృప చేత సాధ్యమౌ
ననితరమైన మీ కృషికి నా మహితాత్ములె శక్తినిచ్చుతన్.

ఉ.  భాగ్యులు మిమ్ముఁ గన్న గుణవంతులు మీ తలిదండ్రులే కదా,
భోగ్యములన్ సుఖాదులను బొందఁగఁ గోరక, రామ సేవయే
భాగ్యముగాఁ దలంచి, వర భక్తిని నిత్యము సేవచేయు మీ
యోగ్యతఁ గాంచి, మిమ్ముల నయోధ్యనె నిల్పె రఘూద్వహుండహో!

ఉ.  మంగళమార్య! మీకు, శుభమంగళముల్ వర శ్రీనివాస మీ
సంగతిఁ వెల్గు మీ సతికి, మంగళముల్ తమ బంధుకోటికిన్,
మంగళలౌత రామునకు, మంగళముల్ నిత సీతకున్, సదా
మంగళమౌ నయోధ్యకును, మంగళముల్ మన భారతాంబకున్.

మంగళం   ...   మహత్   ...   శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

వినమ్రతతో 
రామభక్తులైన మీ పాదధూళి,

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

15, జనవరి 2025, బుధవారం

డా. ఎంవీ పటువర్ధన్ గారి శతావధాన ఆహ్వానపత్రిక. నిర్వహణ .. ప్రజ - పద్యం మరియుపిట్టిశ్రీరాములు తెలుఁగు విశ్వవిద్యాలయము.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

మియాపూర్ సాహితీ మిత్రమండలి, హైదరాబాదు వారి ఆహ్వానము.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

గోదాకల్యాణం - శతావధాని భరత్ శర్మ ప్రవచనం Goda Kalyanam pravachanam by Av...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

చిత్రకవి శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ కృత తేటగీతి గర్భ చంపకమాల... శ్లోకానువాదము.

0 comments

జైశ్రీరామ్.

నాకు తన చిత్రకవితతో పరమానందమునందించిన 

మా తమ్ముఁడు చి. మరుమాముల దత్తాత్రేయశర్మకు 

ఆనందపారవశ్యంతో అమ్మవారి ఆశీస్సులు అర్ధిస్తున్నాను.

*  *  *

చిత్రకవి శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ కృత శ్లోకానువాదము.

శ్లో.  యత్నో హి సతతం కార్యః  -  తతో దైవేన సిద్ధ్యతి|

దైవం పురుషకారశ్చ  -  కృతాన్తేనోపపద్యతే||

👇🏼

తేటగీతి గర్భ చంపకమాల.

👇🏼

సతతము కార్యముల్ సలుప జాలుట ధర్మము సజ్జనాళికిన్

వ్రతముగ దైవమే బలము భాగ్యములిచ్చును ప్రాప్త సిద్ధికిన్

హితమగు సత్కృతుల్ జనులకీగతి సేమము సత్వశక్తియున్ 

జతగొని పూర్తియౌ మనుజ శక్తియు దైవము మంచిగూర్చుచున్

👇🏼

చంపకమాల గర్భస్థ  తేటగీతి.  

👇🏼

సలుప జాలుట ధర్మము సజ్జనాళి

బలము భాగ్యములిచ్చును ప్రాప్త సిద్ధి

జనులకీగతి సేమము సత్వశక్తి

మనుజ యత్నము దైవము మంచిగూర్చు.

భావము.  

👇🏼

తమ ఇష్టసిద్ధికి నిరంతరం ప్రయత్నం చేయవలసినదే. 

అప్పుడు దైవానుగ్రహం ఫలిస్తుంది. దైవానుగ్రహం, మానవప్రయత్నం, 

కాలం వల్లనే సిద్ధిస్తాయి. 

👌🏼

చిరంజీవి తమ్మునకు ఆ జగన్మాత ఆశీస్సులు నిండుగా ఉండుగాక.

పాఠకులు ఈ చిత్రకవితపై తమ అభినందనలందఁజేయఁగలరు.

జైహింద్.

14, జనవరి 2025, మంగళవారం

తునిలో గల తపోవనం పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతీస్వామివారితో సంతోష్ కుమార్ ఘనపాఠి చతుర్ముఖ సంభాషణ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

హారతి కళ్ళకు అద్దుకోకూడదని ఎలా అనగలరు? బ్రహ్మశ్రీ సంతోష్ ఘనపాఠి గారి స్పష్టమైన సోపపత్తిక వివరణము. #Hindudharmakshetram #SantoshGhanapathi

0 comments

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ సంతోష్ కుమారా! మీకు నిరంతరమూ ఆవేదమాత కరుణాకటాక్షాలు లభిస్తూనే ఉండుగాక. ఆ పరమేశ్వరి సనాతనమైన తన హైందవ ధర్మపరిరక్షణను తానే పలుపలు రూపాలలో ప్రత్యక్షమగుచు అనేకప్రక్రియలలో మానవులకు అర్థమయేలా ప్రబోధిస్తూ నిద్రాణమైన ఆత్మశక్తిని ప్రేరేపిస్తూ కర్తవ్యాంశాలను ప్రబోధిస్తూ ఉంటుందనుటకు మీరు చేయుచున్న ఈ సుస్పషటమైన వివరణతో కూడిన ప్రబోధలే నిదర్శనము. హిందువుగా పుట్టినందులకు మీరు హైందవ ధర్మాన్ని రక్షించుటకు యథాశక్తి కృషి చేస్తున్నారు. మిమ్ములను మీకుటుంబాన్ని ఆ పరమేశ్వరి ఆయురారోగ్యానందైశ్వర్యాలతో శతాధికవర్షములు జీవింపచేయుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. మీ దర్శన భాగ్యాన్ని పొందడానికి కూడా యోగం సమకూడాలి. ఏమో అది నాకుందో లేదో ఆ అమ్మకే యెఱుక.
పూజనుద్దేశించి శివ ఉమా సంవాదములో 

మంత్ర హీనం, క్రియాహీనం యత్ కృతం పూజనం హరేః
సర్వం సంపూర్ణతామేతి కృతే నీరాజనే శివే.

కృత్వా నీరాజనం విష్ణోః దీపావల్యా సుదృశ్యయా
తమో వికారం జయతి జితే తస్మింశ్చ కో భవః.

కోటయోర్బ్రహ్మ హత్యానా మగమ్యాగమ కోటయః
దహత్యాలోకమాత్రేణ విష్ణోస్సారాత్రికం ముఖమ్.

యచ్చ దీపస్య మాహాత్మ్యం పూర్వం లిఖితమస్తితతః
ద్రష్టవ్యం సర్వ మత్రాపి ప్రాయేణాభేదతోనయోః

అతస్సాదరముత్థాయ మహానీరాజనం ద్విధం,
ద్రష్టవ్యం దీపమత్సర్వైః వంద్యం ఆరాత్రికంచ యత్.

ధూపంచారాత్రికం పశ్యేత్ కరాభ్యాంచ ప్రవందతే,
కులకోటిం సముదృత్యయాతి విష్ణోః పదమ్.

నీరాజనంచ యః పశ్యేత్ దేవదేవస్య చక్రిణః 
సప్త జన్మని విప్రస్స్యా దంతేచ పరమం పదమ్.

జైహింద్.

ఏకాదశ రుద్రుల స్తవము. ... రచన చింతా రామకృష్ణారావు.

0 comments

 జైశ్రీరామ్.

"విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ 

కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ 

శ్రీమన్మహాదేవాయనమః" 

అని రుద్రనమకంలో చెప్పబడింది. 

దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు 

1. విశ్వేశ్వరుడు, 

2.మహాదేవుడు,

3. త్ర్యంబకుడు, 

4.త్రిపురాంతకుడు, 

5.త్రికాగ్నికాలుడు, 

6.కాలాగ్నిరుద్రుడు, 

7.నీలకంఠుడు, 

8.మృత్యుంజయుడు, 

9.సర్వేశ్వరుడు,

10. సదాశివుడు, 

11. శ్రీమన్మహాదేవుడు. 


౧ తే.గీ.  వినుత విశ్వేశ్వరా! నీదు విభవమెన్న

విశ్వవిజ్ఞానవేత్తకే వీలుపడును,

మానవుఁడనైన నేనెట్లు మన్ననమున

చెప్పఁనౌనయ? నీవె నన్ జేదుకొమ్ము.

 

౨ తే.గీ. ఓ మహాదేవ! సన్నామ! యో మహేశ!

నిన్ను సేవింప నీవౌచు నేనునొప్పి

నప్పుడే సాధ్యమౌనేమొ? యాదిశక్తి

కృపను పొంది నే సేవింతు నుపమ రహిత! 


౩తే.గీ.  ఓ త్రయంబకా! నీ శక్తి నొప్పుదీవె, 

సాటినీకేది? జననియే సాటి నీకు,

నన్ను మన్నించి, నిన్ సదా మన్ననమున

జపము చేయంగఁ జేయుమా, జయనిధాన!


౪తే.గీ. వినుత త్రిపురాంతకా! నాదు వినుతి వినుము,

జ్ఞాన సంపత్ప్రభనుఁ గొల్పి కాంక్షతీర

నీదు రూపంబు మదిలోన మోదమునను

కాంచునట్టులఁ జేయుము, కాలకంఠ! 


౫తే.గీ. హర! త్రికాగ్ని కాల! ధర మో హము ను వీడి 

నీదు దివ్యాగ్ని తేజంబు నేను గనుచు

నిన్ను నభిషేకమునుఁ జేయనిమ్ము దయను,

వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!


౬తే.గీ. జయము! కాలాగ్ని రుద్రా! ప్రశాంతతనిడి

నీదు మహనీయ రూపంబు నేర్పు మీర 

నాదు మదినెన్ని నిరతంబు మోదమలర

సేవలన్ జేసి తనియనీ, చిత్స్వరూప!


౭తే.గీ. నీలకంఠా! యుమానాథ! నిర్వికార!

నిత్యకల్యాణ కారకా! నీ మహత్వ

మెన్నుచున్ దృప్తి పొందనీ యీశ్వరుండ! 

వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!


౮తే.గీ. దేవ! మృత్యుంజయ! జయము, దేవదేవ!

మృత్యుమార్గంబు నెడఁబాపి సత్యపథము

నందు నన్నిల్పి, నీ కృపనందనిమ్ము,

వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!


౯తే.గీ. దివ్య సర్వేశ్వరా! జ్ఞానదీప్తి నీవె,

సర్వమీసృష్టి నీదౌను నిర్వికార!

మంచినే పెంచి మాలోన మానవతను

దైవశక్తిగా మార్చుమా! తత్త్వమరయ.


౧౦తే.గీ. ఓ సదాశివా! లోక సద్భాసమాన

పూర్ణరూపంబునీది, నిను పూర్తిగాను

చూచు చిచ్ఛక్తి నాకిమ్ము శుభగుణాఢ్య!

వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!


౧౧తే.గీ. వినుత శ్రీమన్మహాదేవ! విశ్వనాథ!

ముక్తిమార్గము చేరంగ భక్తి నిమ్ము,

భక్తి నీ పాదములపైన వరలనిమ్ము,

వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!

🙏🏼🙏🏼🙏🏼

జైహింద్.