జైశ్రీరామ్.
జైహింద్.
1 comments
0
comments
0
comments
జైశ్రీరామ్.
శ్లో. "ఆగమాపః ప్రజా దేశః - కాలః కర్మ చ జన్మ చ.!
ధ్యానం మంత్రోఽథ సంస్కారో, - దశైతే గుణహేతవః".!! (మనుస్మృతి)
తే.గీ. దైవము, పరిసరము, పని, త్రాగు నీరు,
దేశమును, జన్మ, కొనునుపదేశ, మంత్ర,
ధ్యాన విషయమున్, మనుకాల మను పదియును,
వ్యక్తి గుణముల మూలముల్, భక్తిపూర్ణ!
భావము. ఆరాధించు దైవము, త్రాగునీరు, చుట్టూ ఉండే పరివారము,
జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయుపని, పుట్టిన పుట్టుక,
ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము.
ఈ పదిన్ని వ్యక్తులలోని గుణము లకు కారణము లగుచున్నవి.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. అనేక శాస్త్రం బహు వేదితవ్యమ్ - అల్పశ్చ కాలో బహుశ్చ విఘ్నాః ।
యత్ సారభూతం తదుపాసితవ్యం - హంసో యథా క్షీరమివామ్బుమధ్యాత్ ॥
తే.గీ. ఎఱుఁగ వలసిన గ్రంథము లెన్నొ కలవు,
కాలమల్పము, విఘ్నముల్ కలుఁగుచుండు,
క్షీరనీరంబులను హంస క్షీరముగొను,
మంచినట్టులే గొనవలె మనము, నరుఁడ!
భావము. చాలా గ్రంథాలు ఉన్నాయి, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి,
కానీ సమయం పరిమితంగా ఉంది. మరియు అనేక అడ్డంకులు ఉన్నాయి.
కాబట్టి మనం హంస యే విధముగా క్షీరనీరముల మిశ్రమము నుండి క్షీరమును
మాత్రమే గ్రహించునో అట్టులే మనము కూడా సారవంతమైనవాటినే
గ్రహించవలెను.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. అనవాప్యం చ శోకేన - శరీరం చోపతప్యతే
అమిత్రాశ్చ ప్రహృష్యన్తి - మా స్మ శోకే మతిం కృథా:
(విదురనీతి)
తే.గీ. దుఃఖపడినంత దొరకదు దూరమైన
దేదియైనను, తాప మహితము మిగులు,
శత్రువులు సంతసింతురు, జయనిధాన!
మెలగుమీవు దుఃఖము వీడి, మేలు గనుము.
భావము. శోకించినంత మాత్రాన కోరిన వస్తువు లభించదు. శరీరమా తాపము
చెందును. శత్రువులు సంతసించెదరు. అందువలన నీ మనస్సును శోకము వైపు
మళ్ళించకుము. దేనికీ దుఃఖింపకుము..
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. ఆహార నిద్రా భయ మైధునాని
సామాన్యమేతత్పశుభిర్నరాణాం
జ్ఞానంహి తేషా మధికో విశేషః
జ్ఞానేన హీనః పశుభిస్సమానః.
(ఉత్తర గీత 2-44)
తే.గీ. నిద్ర, భయ, మైధు నాహార క్షుద్రగుణము
లరయ పశువులన్ మనుజుల నాశ్రయించి
యుండు, జ్ఞానంబు నరునిలో నుండు, జ్ఞాన
హీన నరుఁడు పశు సముఁడు, భానుతేజ!
భావము. ఆహారము నిద్ర భయము మైధునము నాలుగును ప్రాణి ధర్మములు.
ఇవి జంతుకోటికి ఎంతటి అవసరమో మానవులకును ఆంతియే. అయిననిందు
విశేష మేమిటనిన మానవులకు జ్ఞానమనునది అధికముగా నున్నది.
పశువుల కది లేదు. అందువలన జ్ఞానహీనుడు పశు సమానుడు.
జైహింద్.
0
comments
1 comments
జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి .. అయోధ్య. 95507 54389 .
వీరి వితరణ అసామాన్యం. రామభక్తి అసాదృశం. ప్రజా సేవ అమోఘం.
వీరికి వీరి అర్థాంగి గారికి పాదాభివందనములు.
జైహింద్.
0
comments
0
comments
0
comments
జైశ్రీరామ్.
నాకు తన చిత్రకవితతో పరమానందమునందించిన
మా తమ్ముఁడు చి. మరుమాముల దత్తాత్రేయశర్మకు
ఆనందపారవశ్యంతో అమ్మవారి ఆశీస్సులు అర్ధిస్తున్నాను.
* * *
చిత్రకవి శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ కృత శ్లోకానువాదము.
శ్లో. యత్నో హి సతతం కార్యః - తతో దైవేన సిద్ధ్యతి|
దైవం పురుషకారశ్చ - కృతాన్తేనోపపద్యతే||
👇🏼
తేటగీతి గర్భ చంపకమాల.
👇🏼
సతతము కార్యముల్ సలుప జాలుట ధర్మము సజ్జనాళికిన్
వ్రతముగ దైవమే బలము భాగ్యములిచ్చును ప్రాప్త సిద్ధికిన్
హితమగు సత్కృతుల్ జనులకీగతి సేమము సత్వశక్తియున్
జతగొని పూర్తియౌ మనుజ శక్తియు దైవము మంచిగూర్చుచున్
👇🏼
చంపకమాల గర్భస్థ తేటగీతి.
👇🏼
సలుప జాలుట ధర్మము సజ్జనాళి
బలము భాగ్యములిచ్చును ప్రాప్త సిద్ధి
జనులకీగతి సేమము సత్వశక్తి
మనుజ యత్నము దైవము మంచిగూర్చు.
భావము.
👇🏼
తమ ఇష్టసిద్ధికి నిరంతరం ప్రయత్నం చేయవలసినదే.
అప్పుడు దైవానుగ్రహం ఫలిస్తుంది. దైవానుగ్రహం, మానవప్రయత్నం,
కాలం వల్లనే సిద్ధిస్తాయి.
👌🏼
చిరంజీవి తమ్మునకు ఆ జగన్మాత ఆశీస్సులు నిండుగా ఉండుగాక.
పాఠకులు ఈ చిత్రకవితపై తమ అభినందనలందఁజేయఁగలరు.
జైహింద్.
0
comments
0
comments
0
comments
జైశ్రీరామ్.
"విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్మహాదేవాయనమః"
అని రుద్రనమకంలో చెప్పబడింది.
దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు
1. విశ్వేశ్వరుడు,
2.మహాదేవుడు,
3. త్ర్యంబకుడు,
4.త్రిపురాంతకుడు,
5.త్రికాగ్నికాలుడు,
6.కాలాగ్నిరుద్రుడు,
7.నీలకంఠుడు,
8.మృత్యుంజయుడు,
9.సర్వేశ్వరుడు,
10. సదాశివుడు,
11. శ్రీమన్మహాదేవుడు.
౧ తే.గీ. వినుత విశ్వేశ్వరా! నీదు విభవమెన్న
విశ్వవిజ్ఞానవేత్తకే వీలుపడును,
మానవుఁడనైన నేనెట్లు మన్ననమున
చెప్పఁనౌనయ? నీవె నన్ జేదుకొమ్ము.
౨ తే.గీ. ఓ మహాదేవ! సన్నామ! యో మహేశ!
నిన్ను సేవింప నీవౌచు నేనునొప్పి
నప్పుడే సాధ్యమౌనేమొ? యాదిశక్తి
కృపను పొంది నే సేవింతు నుపమ రహిత!
౩తే.గీ. ఓ త్రయంబకా! నీ శక్తి నొప్పుదీవె,
సాటినీకేది? జననియే సాటి నీకు,
నన్ను మన్నించి, నిన్ సదా మన్ననమున
జపము చేయంగఁ జేయుమా, జయనిధాన!
౪తే.గీ. వినుత త్రిపురాంతకా! నాదు వినుతి వినుము,
జ్ఞాన సంపత్ప్రభనుఁ గొల్పి కాంక్షతీర
నీదు రూపంబు మదిలోన మోదమునను
కాంచునట్టులఁ జేయుము, కాలకంఠ!
౫తే.గీ. హర! త్రికాగ్ని కాల! ధర మో హము ను వీడి
నీదు దివ్యాగ్ని తేజంబు నేను గనుచు
నిన్ను నభిషేకమునుఁ జేయనిమ్ము దయను,
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
౬తే.గీ. జయము! కాలాగ్ని రుద్రా! ప్రశాంతతనిడి
నీదు మహనీయ రూపంబు నేర్పు మీర
నాదు మదినెన్ని నిరతంబు మోదమలర
సేవలన్ జేసి తనియనీ, చిత్స్వరూప!
౭తే.గీ. నీలకంఠా! యుమానాథ! నిర్వికార!
నిత్యకల్యాణ కారకా! నీ మహత్వ
మెన్నుచున్ దృప్తి పొందనీ యీశ్వరుండ!
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
౮తే.గీ. దేవ! మృత్యుంజయ! జయము, దేవదేవ!
మృత్యుమార్గంబు నెడఁబాపి సత్యపథము
నందు నన్నిల్పి, నీ కృపనందనిమ్ము,
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
౯తే.గీ. దివ్య సర్వేశ్వరా! జ్ఞానదీప్తి నీవె,
సర్వమీసృష్టి నీదౌను నిర్వికార!
మంచినే పెంచి మాలోన మానవతను
దైవశక్తిగా మార్చుమా! తత్త్వమరయ.
౧౦తే.గీ. ఓ సదాశివా! లోక సద్భాసమాన
పూర్ణరూపంబునీది, నిను పూర్తిగాను
చూచు చిచ్ఛక్తి నాకిమ్ము శుభగుణాఢ్య!
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
౧౧తే.గీ. వినుత శ్రీమన్మహాదేవ! విశ్వనాథ!
ముక్తిమార్గము చేరంగ భక్తి నిమ్ము,
భక్తి నీ పాదములపైన వరలనిమ్ము,
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
🙏🏼🙏🏼🙏🏼
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
ఆంధ్రామృత పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
మీ జీవితంలో ప్రతీ దినమూ నిత్య నూతన సంక్రాంతిగా మీకు ఆనందమయం కావాలని కోరుకొంటున్నాను.
జైహింద్.
0
comments
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.
0
comments
0
comments
జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ.
శ్లో. కృత్వోత్సవం తథాభూతం - ఏకాదశ్యాం విశేషతః
విశంతి మోక్షం తస్మాత్ - సః మోక్షోత్సవ ఇతీర్యతే.
తే.గీ. శ్రీకరంబౌచు నేకాదశీ దినంబు
వచ్చు పుష్యశుద్ధమునందు వామనుండు
ముక్తిదుండయి దర్శనమునొసగుటను
వత్తు రా దేవతల్ తాము భక్తిఁ గనఁగ.
భావము. ఈ ఉత్సవానికి మోక్షోత్సవమనే పేరు కూడా ఉంది. దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలవడం జరిగింది.
ఈ కారణంగా ఉత్తర ద్వారదర్శనం పరమాత్మ నేడనుగ్రహిస్తాఁడు.
కం. మదులందిత్తరముఖమున
విధిజనకునిఁ జూచువారి విషయమునందున్
వ్యధలు నశించును, శుభములు
సుధవలె మహితముగ వచ్చు శోభను గూర్చున్.
కావున మనసా ఆశ్రీమన్మహావిష్ణువును దర్శించుకొనెడి మీకందరికీ శుభాకాంక్షలు తెలియఁజేస్తోంది ఆంధ్రామృతం.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. సత్యమేవేశ్వరో లోకే - సత్యే ధర్మాః సదాశ్రితాః
సత్య మూలాని సర్వాణి - సత్యాన్నాస్తి పరం పదమ్.
తే.గీ. సత్యమేదైవమీసృష్టి, నిత్యమిదియె,
సత్యమున జేరు ధర్మముల్, శాశ్వతముగ,
సత్యమే మూలమన్నైంట, సరస హృదయ!
సత్యమును మించి లేవయ్య! సత్యపాల!
భావము. ఈ లోకంలో సత్యమే భగవంతుడు. సత్యాన్ని ధర్మాలు అన్నీ ఎల్ల వేళలా
ఆశ్రయించుకుని ఉంటాయి. సత్యమే అన్నిటికీ మూలం. సత్యాన్ని మించినది
ఏమీ లేదు.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
మంత్రము. అసుర్యా నామతే లోకా అంధేన తమసావృతాః
తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చన్తియేకే చాత్మహనో జనాః. (ఈశావాస్యోపనిషత్ ౩)
తే.గీ. రక్కసుల లోకముకు చూడ నిక్కముగను
గాఢమైనట్టి చీకటిన్ గప్పి యుండు,
నాత్మహంతులందుదు రట్టిలోక
మును గనంగను నాత్మహననము వలదు.
భావము. రాక్షసుల యొక్క లోకాలు గాఢమైన అంధకారముతో అంటే చీకటితో
ఉంటాయి. ఆత్మహంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
మంత్రము. కుర్వన్నేవేహ కర్మాణి - జిజీవిషేచ్చతగ్‌ం సమాః
ఏవం త్వయి నాఽన్యథేతోఽస్తి - న కర్మ లిప్యతే నరే. (ఈశావాస్యోపనిషత్ ౨)
తే.గీ. వరల కర్మలన్ జేయుచు వర్షశతము
నాశపడుమీవు, మించుచు నాశపడకు,
మింతకన్న నన్యము లేదు, శాంతచిత్త!
అరయ కర్తవ్యములు నిన్నునంటఁ బోవు
అర్థం: ఈ లోకములో కర్తవ్యాలను నిర్వహిస్తూ మాత్రమే నూరేళ్ళు
జీవించాలని ఆశించు. నీలాంటి వారికి ఇది తప్ప వేరే దారి లేదు.
కర్తవ్యాలు నిన్ను అంటవు.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
మంత్రము. ఓం పూర్ణమదః పూర్ణిమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే. (ఈశావాస్యోపనిషత్ )
తే.గీ. పూర్ణమెన్నంగ దైనంబు, పూర్ణమైన
దరయ నీ సృష్టి, మదిలోన నరసిచూడ
పూర్ణముననుండి తీసినన్ బూర్ణమపుడు
పూర్ణమేశేషమైయుండు పూజ్యులార!
భావము. దేవుడు పరిపూర్ణుడు. ఇది (ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది.
పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది.
పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా
పరిపూర్ణతే మిగిలి ఉంది.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనమ్.(ఈశావాస్యోపనిషత్ ౧)
తే.గీ.. ఈశ్వరుని సృష్టిలోనుండు నీ సతతము
నీశ్వరునికే సదా చెల్లు నీశ్వరుండె
నుండునంతట ననుచు నీవుండు మెపుడు,
పరుల ధనము నాశింపకు, వరగుణాఢ్య!
భావము. జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీ భగవంతునిచే నింపబడాలి.
అలాంటి త్యాగబుద్ధితో ఈ లోకాన్ని అనుభవించు. ఎవరి ధనాన్నీ ఆశించకు.
జైహింద్.
0
comments
0
comments
0
comments
జైశ్రీరామ్.
శ్లో. అనిచ్ఛంతోఽపి వినయం - విద్యాభ్యాసేన బాలకాః |
భేషజేనేవ నైరుజ్యం - ప్రాపణీయాః ప్రయత్నతః ||
(హరిహర సుభాషితం)
తే.గీ. రోగమును బాపు యత్నించి రోగికిలను
వైద్యుఁ డటులనే బాలుండు విద్యనేర్వ
బాధపెట్టుచున్ననుగాని మోదమలర
నేర్పవలె విద్య కృషిచేసి నేర్పు తనర.
భావము. రోగికి చికిత్స చేయడానికి నిరంతర ప్రయత్నం చేసి ఔషధం ఇచ్చి
రోగాన్ని పరిహరించినట్లే, పిల్లలు ఇష్టపడకపోయినా వారికి ప్రయత్నపూర్వకంగా
విద్యను అభ్యసింపజేసి మంచి నయమూ, నీతులూ నేర్పాలి.
జైహింద్.
0
comments
0
comments
0
comments
1 comments
జైశ్రీరామ్.
శ్లోకానువాదాలలో సత్తా చూపుతున్న దత్తాత్రేయ.
చూడండి ఈ క్రింది శ్లోకాన్ని ఎంత సునాయాసంగా అనువదించారో.
శ్లో. గో భూ తిల హిరణ్యాజ్య - వస్త్రౌ ధాన్య గుడాని చl
రౌప్యం లవణ మిత్యాహు: - దశ దానా: ప్రకీర్తతాll
తే.గీ. ఆవు భూమి నువ్వులు హిరణ్యంబునేయి
వస్త్రములు ధాన్యముగుడ లవణ రజతము
లనెడు దశదానములను ప్రియంబుతోడ
దానమిడవలె వేద మంత్రములతోడ.
భావము. దూడతో కూడిన ఆవు, భూమి,నువ్వులు, బంగారం, ఆవు నెయ్యి,
వస్త్రాలు, ధాన్యం, బెల్లం, వెండి, ఉప్పు.. అనేవి దశ దానాలు. వీటిని
మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి.
త్వరలో ఈ కవినుండి సుభాషిత శతకం రాబోతోంది.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. ఆపత్కాలే తు సమ్ప్రాప్తే - యన్మిత్రం మిత్రమేవ తత్ ॥
వృద్ధికాలే తు సమ్ప్రాప్తే - దుర్జనోఽపి సుహృద్భవేత్ ॥
తే.గీ. అపదలయందు తోడున్నయతఁడె సఖుఁడు,
సంపదలుకల్గు వేళలో సహజముగనె
చెడ్డవారును సఖులుగా చేరుచుంద్రు,
మిత్రశత్రులనెఱుగుచు మెలగవలెను.
భావము. విపత్తును ఎదుర్కొన్నప్పుడు మీ పక్షాన నిలబడే వ్యక్తి మీ నిజమైన
స్నేహితుడు. లేకుంటే మీరు సర్వతోముఖాభివృద్ధి దశనున్నప్పుడు
దుర్మార్గులు కూడా మీ స్నేహితుల వలె ప్రవర్తిస్తారు.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. ఆపత్కాలే తు సంప్రాప్తే - శౌచాచారం న చింతయేత్ ౹
స్వయం సముద్ధరేత్ పశ్చాత్ - స్వస్థో ధర్మం సమాచరేత్ ౹౹
తే.గీ. ఆపదలయందు చిక్కిన నట్టివేళ
శౌచమాచరించెడి చింత సాగనేల?
స్వాస్త్యమును చూచుకొనుటది సముచితమయ!
పిదప ధర్మప్రవృత్తికై విలువనిమ్ము.
భావము. ఆపత్కాలంలో అంటే కష్టాలు వచ్చినప్పుడు శౌచాచారం విషయానికి
చింత చేయరాదు. మొదట తనను తాను రక్షించుకొంటూ తరువాత
ధర్మం చేసేవైపు గమించ వచ్చు.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
భాష మీద అధికారం, పద్యవిద్యా ప్రాగల్భ్యం ఉండటం సాధారణంగా కావ్యరచనకు తగిన అవసరం. దీంతో పాటు పదప్రయోగంలో ఏయే అక్షరాలు ఎక్కడెక్కడ ఒదిగి ఉంటవో సద్య స్ఫురణలో ఉండటం చిత్రకవితకు ప్రధాన లక్షణం. చిత్ర కవితలో గర్భ కవిత్వం, బంధ కవిత్వం, ఏకాక్షర, ద్యక్షర పద్యాలు, పద్య భ్రమక, పాద భ్రమకాలు.. అనులోమ విలోమ రీతులు, అంతర్భవిస్తవి. చిత్ర కవిత నిర్వహణకు ఛందస్సు మీద ఉన్న అధికారం గర్భ కవిత్వానికి ప్రధానమైన అర్హత. సీస పద్యంలో మత్తేభం నాలుగు పాదాల్లో ఇమిడిపోతుంది. అట్లాగే గీత పద్యంలో కందము ఇమిడిపోతుంది. పై పాదాలలో మొదట చివర చేర్చవలసిన అక్షరాలు యతులకు అనుగుణంగా తెలిస్తే ఇది సాధ్యమవుతుంది.అట్లాగే ఇతర గర్భ పద్యాలకు కూడా. ప్రబంధ రాజ వెంకటేశ్వర విలాసంలో గణపవరపు వెంకట కవి ఒక సీస పద్యంలో సుమారు 190 పద్యాలను ఇమిడించాడు. ఇది ప్రపంచంలోనే ఛందో విద్యలో అసామాన్యమైన పోటీలేని ఒక గొప్ప ఉపలబ్ధి. కంద పద్యంలో ఆయా భాగాల్లో విరుపులతో నాలుగు కంద పద్యాలు ఇమిడిపోతవి. ఇది యతి ప్రాసలను ఇమిడించుకునే ఎరుకతో సాధించవచ్చు. ఆధునిక కాలంలో ఒక కవి భారత గర్భ రామాయణం అని ఒక అపూర్వ ప్రబంధాన్ని నిర్మించాడు. గర్భ పద్యాలలో రామాయణ గాధ, మొత్తం పద్యంలో భారత గాధ ఇమిడి ఉంటాయి. ఇది ఒక విధంగా ద్వ్యర్థి కావ్యాలకు విలక్షణమైన చేర్పు. సంస్కృతంలో అనులోమ విలోమ కావ్యంగా రామాయణ భారతాలను ఇమిడించిన ఒక అద్భుత కావ్యం ఉన్నది.
ఇంకా చిత్రకవిత్వంలో ఒక అక్షరంతోని, రెండు అక్షరాలతోని పద్యాలు నిర్మించే ప్రక్రియ ఉన్నది. ఈ రీతి కవికి ఉన్న నిరంతర భాషాధ్యయనము, నిఘంటు పరిజ్ఞానము వల్ల సాధ్యపడుతుంది. పద్య భ్రమక, పాద భ్రమకాలు భాషమీద ఛందస్సు మీద ఉన్న పట్టు వల్ల సాధింపబడేవి. శ్రీరామా, రామాశ్రీ అన్న కంద పద్య తొలిపాదం పాద భ్రమక రీతికి ఒక ఉదాహరణ. నాలుగు పాదాలు ఇలాగే రచన సాగుతుంది. శబ్దాల బహు అర్థ సంఘటన అక్షరాలను పోహళించే రీతి గురు లఘవుల పొదిగింపు ఈ ప్రజ్ఞలన్నీ చిత్ర కవితకు అత్యవసర సాధనాలు.
బంధ కవిత్వం విషయం వస్తే, విచిత్రమైన ఆకారాలు, ఛత్రము, ఖడ్గము, నాగము, గజము మొదలైనవి కల్పించి వాటిలో తాను ఇమిడించదలచుకున్న పద్యానికి తగిన గడులను ఏర్పరిచి ఆ అక్షరాలు రెండు మూడు సందర్భాలలో, భిన్న భిన్న అర్థాలలో కుదిరేట్లు నిర్మించుకోవటం తో పాటు గణ యతి ప్రాసలకు భంగం కలగకుండా పద్య రచన సాగించవలసి ఉంటుంది. ఈ బంధ కవిత్వాన్ని నూరు పైగా బంధాలలో చిత్రించిన వారు కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన శతావధానం కృష్ణమాచార్యులు. అట్లాగే వరంగల్‌కు చెందిన ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు తమ అనేక ప్రబంధాలలో (వాటిలో అచ్చ తెనుగు కావ్యాలు, నిరోష్ట్య, నిర్వచన కావ్యాలు ఉన్నవి) 60 విలక్షణమైన బంధ భేదాలు నిర్మించారు. ఈ పద్యాలు నూరుకు మించే ఉన్నాయి.
చిత్ర కవిత్వ అభ్యాసం ప్రధానంగా తెలంగాణాలోని కవుల రచనల్లో కన్పిస్తుంది. ఈ రకమైన విలక్షణ స్థితికి ఈ ప్రాంతంలో కవులలో ఉండే సృజన శీలంలోని ప్రయోగ దృష్టి కారణం అని చెప్పాలి. ఈ విషయం ప్రత్యేకంగా పరిశోధించితే ఈ కవులు చేసిన ప్రయోగాలలోని వైశిష్ట్యము, నైపుణ్యం తెలియవస్తాయి. చిత్రకవిత్వ పద్యాలు సాధారణంగా కావ్య మధ్యంలో దేవతా స్థుతులలో కన్పిస్తుంది. ఈ కావ్యాలలోని చక్రబంధం విలక్షణమైంది. దీన్లో ఒక వలయంలో కావ్య నామం, ఇంకొక వలయంలో కవి నామం, నిక్షేపింపబడి ఉంటాయి. మరింగంటి సింగరాచార్యులు రచించిన బిల్హణీయ కావ్యం ఇంకొకరి రచనగా ప్రచారం అయినా, చక్రబంధంలో నిక్షేపింపబడిన నామం వల్ల అది ఆయన రచనగా సురవరం ప్రతాపరెడ్డి గారు నిర్ణయించారు. చిత్ర కవిత్వం కవి వు్యత్పన్నతకి, అసాధారణ ప్రజ్ఞకు ఉదాహరణ. ఇది ఒక ప్రత్యేకమైన విద్యావిశేషం. ప్రహేళికల వంటి నిర్మాణం. ఆధునిక సాహిత్య విమర్శకులు దీన్నేదో గారడీ విద్య అని నిరసించే ప్రయత్నం చేశారు. ఈ కాలంలో అసాధారణ ప్రతిభాభ్యాసాలకు గిన్నిస్ బుక్ వంటి వాటిలో స్థానం లభిస్తున్నది. అయితే తెలుగు కవిత్వం సాధించిన ఈ అసాధారణ ప్రజ్ఞా విశేషాలను గూర్చి మనం ఎందుకు గర్వించకూడదో అర్థం కాదు. కవిత్వం అంతా భావ కవిత్వంలా ఉండదు. జీవితమంతా హంసతూలికా తల్పంలా ఉండదు. జీవితంలో వైవిధ్యం ఎలాంటిదో కవిత్వంలోని వైచిత్రి కూడా అలాంటిది. జీవితంలో అద్భుతం, మనస్సుకు ఎంత ఉదాత్తతను కల్పిస్తుందో, చిత్ర కవిత్వం కల్పించే అలాగే చిత్తానికి ఉన్నతిని కల్పిస్తుంది. మనం సమాహిత చిత్తంతో చిత్ర కవిత్వాన్ని అది కలిగించే అచ్చెరువుని అనుభవిద్దాం.
0
comments
జైశ్రీరామ్.
వాగ్దేవతలు
తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణము.
"అ" నుండి "అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండం అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అని అర్ధం.
"క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండం"అంటారు.
ఈ సౌరఖండం లోని "క, ఖ, గ, ఘ, జ్ఞ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత "కామేశ్వరి".! అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.
"చ, ఛ, జ, ఝ, ఞ" గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని".! అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.
"ట, ఠ, డ, ఢ, ణ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి "విమల".! అంటే మలినాలను తొలగించే దేవత.
"త, థ, ద, ధ, న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ".! కరుణను మేలుకొలిపేదే అరుణ.
ప, ఫ, బ, భ, మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని." అనగా జయము ను కలుగ చేయునది.
అలాగే "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండం" అంటారు. అలాగే అగ్ని ఖండంలోని "య, ర, ల, వ" అనే అక్షరాలకు అధిష్టాన దేవత "సర్వేశ్వరి." అంటే శాశించే శక్తి కలది సర్వేశ్వరి.
ఆఖరులోని ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష" లకు అధిదేవత "కౌలిని"
ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు. ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని, క్రోమొజోములను ప్రభావితం చేస్థాయి.
అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.
ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.
అంటే బ్రహ్మమే శబ్దము.
ఆ బ్రహ్మమే నాదము.
మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.
అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది.
భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి "అమ్మ"ను అర్చిస్తున్నాయి.
కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.
మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత.
మనం చేసే శబ్దమే...ఆ దేవత..!
మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.
ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత.
ఇది సనాతన ధర్మం.
ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. యథాఽస్త్రరహితే పుంసి - వృథా శౌర్యపరిగ్రహః ౹
తథోపన్యాస హీనస్య - వృథా శాస్ట్రపరిగ్రహః ౹౹
తే.గీ. అస్త్ర హీనుని శౌర్యంబు వ్యర్థమేను,
శాస్త్ర విజ్ఞాన మున్నను సభలలోన
పలుకుటయె చేతకానట్టి పండితునకు
వ్యర్థమేకద, విద్యనిరర్ధకమగు.
భావము. అస్త్రాలు లేనివానికి శౌర్యము ఉన్నను వ్యర్థమే. అలాగే
ఉపన్యాసము చేసే సామర్థ్యం లేనివారికి శాస్త్ర జ్ఞానము ఉన్నను వ్యర్థమే అగును.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. గతే శోకో న కర్తవ్యో - భవిష్యం నైవ చిన్తయేత్।
వర్తమానేన కాలేన - వర్తయన్తి విచక్షణాః॥
తే.గీ. గడిచినట్టి శోకమునకు కలతఁ బడక,
భవితకైచింత చేయక, ప్రస్తుతమును
గూర్చి చింతించు విజ్ఞాని గొప్పవాఁడు,
చేయవలసిన పనులందు చేవఁ జూపు.
భావము. గతించి పోయినదాన్ని గూర్చి ఆలోచిస్తూ కూర్చోకూడదు.
జరగబోవు దాన్ని గూర్చి ఆశాసౌధాలు కడుతూ కూర్చోకూడదు,
విచక్షణ వివేకంగలవారు వర్తమానమునకు అనుగుణంగా చేయవలసిన
కర్తవ్యాలను చేయుదురు.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః🙏🏼
మంగళాంబికా!🙏🏼
౧) ఉ. శ్రీ మధుసూదనుండు, శశిశేఖరుఁడున్, విధి, నిన్ భజించుటన్
శ్రీమదనంత సృష్టి విరచించుట గొప్పఁగఁ జేయఁగల్గిరే,
నీమముతోడ నిన్ గొలుచు నీ వరభక్తుల కాత్మశక్తివై
ప్రేమగ నిన్ భజించునటు ప్రీతిని చేయుము మంగళాంబికా!
౨) చ. కమలదళాయతాక్షి! నినుఁ గానని కన్నులు కన్నులెట్లగున్?
బ్రముదముతోడ నీ భజన వర్ధిలఁ జేయని జన్మ జన్మయా?
శ్రమగఁ దలంపఁబోక నినుఁ జక్కఁగఁ జూచెడి భాగ్యమిచ్చుచున్,
సమధిక భక్తితోఁ గొలుచు శక్తినొసంగుమ, మంగళాంబికా!
౩) ఉ. నీ పదపద్మ సేవను వినిర్మల చిత్తము తోడఁ జేసినన్,
బాపవిదూరులై జనులు వర్ధిలునమ్మరొ భక్తినొప్పుచున్,
హేపరమేశ్వరీ! జనని! హేశివ! శాంకరి! యంచు భక్తితో
నీపరతత్త్వమున్ గొలువనీ, కరుణాకర మంగళాంబికా!
౪) ఉ. నీదగు మందహాసము గణించుచు నెవ్వఁడు చూడఁ గల్గునో
మోదముతోడ వానికి సమున్నతి గొల్పుదువమ్మ నీవు, స
ద్బోధను పొంది వాఁడు గుణపూర్ణుఁడుగా జగతిన్ బ్రసిద్ధుఁడై
నీదరిఁ జేరగల్గునుగ, నిశ్చయమిద్దియె, మంగళాంబికా!
౫) ఉ. నీ వనురాగమూర్తివి, వినిర్మలచిత్తము నిత్తువీవె, మా
భావనలందు నీపయిని భక్తిని పూర్తిగఁ గొల్పుదీవె, నీ
సేవలె చేయఁ జేయుచును, చిత్తము నీపయి నిల్పఁ జేయుచున్,
గావుము మమ్ము నీవు, వర కామిత దాయిని! మంగళాంబికా!
౬) ఉ. నేనిల రామకృష్ణుఁడను, నీ ప్రియ పుత్రుఁడనమ్మ! నీ దయన్
జ్ఞానులతోడ సంగతిఁ బ్రకాశము చిత్తములోనఁ గల్గుటన్
ధీనిధులెన్నునట్టులుగ దివ్యముగా నిను గొల్చు పద్యముల్
మౌనమెలర్ప వ్రాసెదను లక్ష్యము తోడను, మంగళాంబికా!
౭) ఉ) ఏ జనయిత్రి సత్కృపకు నీశ్వరుడున్ పరితప్తుఁడౌనొ, నా
కేజనయిత్రి సమ్మతిని యీ కవితామృతమే లభించెనో,
యే జనయిత్రి పాదరజమే సృజియింపఁగఁ జాలు సృష్టినే,
యా జనయిత్రి వీవెకద, యన్నులమిన్నవు, మంగళాంబికా!
౮) ఉ. నీ పదపద్మరేణువె మనీషునిగా యొనరించు భక్తునిన్,
నీ పదపద్మరేణువె యనేకశుభంబులు గొల్పు నిత్యమున్,
నీ పదపద్మరేణువె గణించి నశింపఁగఁ జేయు దుర్గతుల్,
నీ పదపద్మ రేణువె వినిర్గతి నాకగు, మంగళాంబికా!
౯) ఉ. ఏమని నిన్ గణింతు పరమేశ్వరి! నీ పరతత్త్వమెన్ని, ని
న్నేమని బల్కరింతు పలుకే కరువౌగద నిన్నుఁ జూడ, నీ
కేమని విన్నవించెదను, హే జగదంబిక కావుమంచు, నీ
వే మది నెన్ని కావవలె నీశ్వరి నన్నిల, మంగళాంబికా!
౧౦) మంగళరూపిణీ! జయము, మంగళముల్ మముఁ జేరనిమ్ము, నీ
మంగళ నామ సంస్మరణ మాకు శుభంవులొసంగు నిత్యమున్,
మంగళ కారిణీ! నయసమంచిత వృత్తిని గొల్పి మమ్ములన్
మంగళ కార్యచారులుగ మంచిగ కావుము, మంగళాంబికా!
అమ్మ దయతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
జైహింద్
.
0
comments
జై శ్రీరామ్
శ్లో. నాస్తి మేఘసమం తోయం - నాస్తి చాత్మసమం బలమ్!
నాస్తి చక్షుఃసమం తేజో - నాస్తి ధాన్యసమం ప్రియమ్!!
తే.గీ. జలద జలము కన్నను శుద్ధ జలము లేదు,
ఘన మనోబలమును మించి కనఁగ లేదు,
కన్నులకు కల్గు తేజమ్ము కలుగఁబోదు.
అన్నమునుమించి ప్రియమైన దరయలేము.
భావము. మేఘ జలముతో సమానమైన శుద్ధ జలము లేదు. ఆత్మ బలముతో
సమానమైన బలము మరొకటి లేదు. కన్నుతో సమానమైన తేజస్సు గల
యింద్రియము శరీరములో మరొకటి లేదు. ఆహారముతో సమానమైన
ప్రియమైన వస్తువు మరొకటి లేదు.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్
శ్లో. స్వభావో నోపదేశేన - శక్యతే కర్తుమన్యథా ౹
సుతప్తమపి పానీయం - పునగచ్ఛతి శీతతామ్ ౹౹
తే.గీ. ఎన్ని యుపదేశములుచేయ నేమి ఫలము?
పుట్టుచునె వచ్చు గుణములో పోవు కనగ,
నెంతగా కాచిననుకాని సుంతయైన
వేడి మిగులునే నీటిలో, వినుత నృహరి!
భావము. ఎవరి స్వభావాలు ఉపదేశాలతో మార్చడానికి సాధ్యం లేదు.
బాగా మరగించిన నీరు కూడా మళ్ళీ చల్లగా అవుతుంది.జన్మ స్వభావాన్ని
ఎవరివల్ల మార్చడానికి అవ్వదు.
జైహింద్.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. మిత్రే నివేదితే దుఃఖే - దుఃఖినో జాయతే లఘు
భారం భారవహస్యేన - స్కంధయో: పరివర్తతే.
తే.గీ. దుఃఖమును మిత్రునకుఁ జెప్ప దుఃఖమణఁగు,
దుఃఖితునిమది తేలికౌన్ దోయజాక్ష!
భుజములనుమార్చి బరువును మోయుచున్న
భారమనిపించదది తగ్గి, భక్తవరద!
భావము. భుజము మీద బరువుమోసేవాడు ఆ బరువునును రెండుభుజాల
మధ్యకు మార్చుకుంటే భారము తగ్గినట్లుగా, మంచిమిత్రునికి బాధ చెప్పుకుంటే
బాధపడేవాని దుఃఖము తగ్గి మనసు తేలికపడుతుంది. అంటే మన దుఃఖము
మన ఆత్మీయయులతో పంచుకుంటే కొంత ఉపశమనము కలుగునని భావము.
జైహింద్.