గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, సెప్టెంబర్ 2026, మంగళవారం

అ నఘా,దేవేరి,ఉత్సుక,నిష్కారణ,దురంతక,కాటకాటక,స వచసా,కువచా,తగులు, దారుణ,నీతి దూర,సువచా,కటుతర.మృగ్య నీతి, గర్భ చరాచర వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

జైశ్రీరామ్

అ నఘా,దేవేరి,ఉత్సుక,నిష్కారణ,దురంతక,కాటకాటక,స వచసా,కువచా,తగులు,

దారుణ,నీతి దూర,సువచా,కటుతర.మృగ్య నీతి, గర్భ చరాచర వృత్తము,


                                               రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

                                                                            జుత్తాడ,


చరాచర వృత్తము,


 తిరుగు రాయి జన్మిదే?తీరును లేదన?బొల్చెనే!దివి జేరు నేనాటికో?

చర మదేను చర్వితమ్!సార విహీన మెంచగా!స వచస్సు దూరంబయెన్!

కరువు కాటకంబులే!కారణ లేని ఘోషయెనే!కవచం బయెన్!పాపతన్!

దరియ నీతి పాల్పడెన్!దారుణ యత్న మొప్పగన్!దవులన్! స రీవే?హరా!


చరా చర వృత్తము,న,ర,య,స,స,జ,జ,త,గగ,గణము లుండును,

అభికృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,9.18.: వృ,సం:-98.77.080.


1.గర్భగత అనఘా వృత్తము,


       తిరుగు రాయి జన్మిదే!

      చర మదేను చర్వితమ్!

      కరువు కాటకంబులే!

     దరియ నీతి పాల్పడెన్!


అనఘా వృత్తము,న,ర,లగ,గణము లుండును,కార

అనుష్టుప్ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

వృ,సం:-88.


2.గర్భగత దేవేరి వృత్తము,


    దివి జేరు నే నాటికో?

    స వచస్సుదూరంబయెన్!

   కవచం బయెన్!పాపతన్!

   దవులన్!సరీవే!హరా!


దేవేరి వృత్తము,స,య,లగ,గణములుండును,

అనుష్టు ప్ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

వృ,సం:-80.


3.గర్భగత ఉత్సుక వృత్తము,


 తీరును లేదన?బొల్చెనే!

 సార విహీన మెంచగా!

 కారణ లేని ఘోషయెన్!

దారుణ యత్న మొప్పగన్!


ఉత్సుక వృత్తము,భ,భ,ర,గణము లుండును,

బృహతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

వృ,సం:-182.


4.గర్భగత నిష్కారణ వృత్తము,


తిరుగు రాయి జన్మిదే!తీరును లేదన బొల్చెనే!

చర మదేను చర్వితమ్!సార విహీన మెంచగా!

కరువు కాటకంబులే!కారణ లేని ఘోషయెన్!

దరియ నీతి పాల్పడెన్!దారుణ యత్న మొప్పగన్!


నిష్కారణ వృత్తము,న,ర,య,స,న,వ గణము లుండును,

అత్యష్టి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-63.044.


5.గర్భగత దురంతక వృత్తము,


  తీరును లేదన బొల్చెనే!తిరుగు రాయి జన్మిదే!

  సార విహీన మెంచగా!చర మదేను చర్వితమ్!

 కారణ లేని ఘోషయెన్!కరువు కాటకంబులే!

 దారుణ యత్న మొప్పగన్!దరియ నీతి పాల్పడెన్!


దురంతక వృత్తము,భ,భ,ర,న,ర,వ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-44.727.


6.గర్భగత,కాటకాటక వృత్తము,


     తీరును లేదన బొల్చెనే!దివి జేరు నే నాటికో?

     సార విహీన మెంచగా!స,వచస్సుదూరం బయెన్!

     కారణ లేని ఘోషయెన్కవచంబయెన్!పాపతన్!

     దారుణ యత్న మొప్పగన్!దవుల న్సరీవే?హరా!


కాటకాటక వృత్తము,భ,భ,ర,స,య,వ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలిది, ప్రాస నియమము కలదు,

యతి.10.వ,యక్షరము,వృ,సం:-38.583


7.గర్భగత.స,వచసా వృత్తము,


   దివి జేరు నేనాటికో?తీరును లేదన బొల్చెనే!

   స వచ స్సుదూరంబయెన్!సార విహీన మెంచగా!

  కవచం బయెన్!పాపతన్!కారణ లేని ఘోషయెన్!

 దవులన్!సరీవే!హరా!దారుణ యత్న మొప్పగన్!


స,వచసా వృత్తము,స ,య,య,స,స,వ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-46.668.


8.కు వచా వృత్తము,


 తిరుగు రాయి జన్మిదే?దివి జేరు నే నాటికో?

చర మదేను!చర్వితమ్!స వచస్సుదూరంబయెన్!

కరువు కాటకంబులే!కవచం బయెన్ పాపతన్!

దరియ నీతి పాల్పడెన్!దవులన్!సరీవే?హరా!


కు వచా వృత్తము,న,ర,జ,జ,త,గ,గణములుండును,

అష్టి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-19.288.


9.తగులు వృత్తము,


దివి జేరు నే నాటికో?తిరుగు రాయి జన్మిదే!

సవచ స్సుదూరంబయెన్!చర మదేను!చర్వితమ్!

కవచం బయెన్ పాపతన్!కరువు కాటకంబులే!

దవులన్!సరీవే!హరా!దరియ నీతి పాల్పడెన్!


తగులు వృత్తము,స,య,జ,స,జ,గ,గణము లుండును,

అష్టి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-22.348.


10.దారుణ వృత్తము,


తీరును లేదన బొల్చెనే! తిరుగు రాయి జన్మిదే?దివి జేరు నే నాటికో?

సార విహీన మెంచగా!చర మదేను చర్వితమ్!స వచస్సదూరంబయెన్!

కారణ లేని ఘోషయెన్!కరువు కాటకంబులే!కవచం బయెన్!పాపతన్!

దారుణ యత్న మొప్పగన్!దరియనీతి పాల్పడెన్!దవులన్!సరీవే?హరా!


దారుణ  వృత్తము,న,భ,ర,న,ర,జ,జ,త,గ,గణము లుండును

,అభికృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,10.18. వృ,సం:-25.37.095.


11.నీతి దూర వృత్తము,


తీరును లేదన బొల్చెనే!దివి జేరు నే నాటికో?తిరుగుడు రాయి జన్మిదే?

సార విహీన మెంచగా!స వచస్సుదూరంబయెన్!చర మదేను!చర్వితమ్!

కారణ లేని ఘోషయెన్!కవచం బయెన్!పాపతన్!కరువు కాటకంబులే!

దారుణ యత్న మొప్పగన్!దవులన్ స రీవే?హరా!దరియ నీతి పాల్తిపడెన్


నీతి  దూర వృత్తము,న,భ,ర,స,య,జ,స,జ,గ,గణములుండును,

అభికృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,10.18.వృ,సం:-1.13.41.848.


12.సు వచా వృత్తము,


 తిరుగు రాయి జన్మిదే!దివి జేరు నేనాటికో?తీరును లేదన బొల్చెనే!

 చర మదేను చర్వితమ్!స వచస్సు దూరంబయెన్!సార విహీన మెంచగా!

కరువు కాటకంబులే!కవచం బయెన్!పాపతన్!కారణ లేని ఘోషయెన్!

దరియ నీతి పాల్పడెన్!దవులన్!సరీవే?హరా!దారుణ యత్న మొప్పగన్!


సు వచా వృత్తము,న,ర,జ,జ,త,త,జ,జ,గ,గణములుండును,

అభికృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు.9.17.వృ,సం:-1.19.46.840.


13.కటుతర వృత్తము,


దివి జేరు నేనాటికో?తిరుగు రాయి జన్మిదే!తీరును లేదన బొల్చెనే!

స వచ స్సు దూరంబయెన్!చర మదేను!చర్వితమ్!సార విహీన మెంచగా!

కవచం బయెన్!పాపతన్!కరువు కాటకంబులే!కారణ లేని ఘోషయెన్!

దవులన్!సరీవే?హరా!దరియ నీతి పాల్పడెన్!దారుణ యత్న మొప్పగన్!


కటుతర వృత్తము,స,య,జ,స,జ,త,జ,జ,గ,గణము లుండును,

అభికృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,9.17. వృ,సం:-1.19.60.900.


14.మృగ్య నీతి వృత్తము,


దివి జేరు నే నాటికో?తీరును లేదన బొల్చెనే?తిరుగు రాయి జన్మిదే!

స వచ స్సు దూరంబయెన్!సార విహీన మెంచగా!చర మదేను?చర్వితమ్!

కవచం బయెన్!పాపతన్!కారణ లేని ఘోషయెన్!కరువు కాటకంబులన్!

దవులన్!స రీవే?హరా!దారుణ యత్న మొప్పగన్!దరియ నీతి పాల్పడెన్


మృగ్య నీతి వృత్తము,స,య,య,స,స,జ,స,జ,గ,గణము లుండును,

అభికృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,9.18.:వృ,సం:-1.14.49.932.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.