జైశ్రీరామ్.
ఆచంట సూర్య నారాయణ మూర్తి రిటైర్డ్ ప్రిన్సిపల్ నర్సీపట్నం.
చిత్రకవిసామ్రాట్ శ్రీచింతారామకృష్ణారావుగారిచేరచించబడిన"రేనాటిసూరీడు"చారిత్రకప్రబంధమునకుసమీక్ష!
శ్రీ చింతా రామకృష్ణా రావు గారు సుపరిచితులు,మిత్రులు,మేముఉత్తరాంధ్రకళాశాల లలో పనిచేసినాము.
వారనేకగ్రంధములనురచించిన సుకవివరేణ్యులు.
ఆయన కవితాకృషీవలులు. బహుముఖప్రజ్ఞా శాలి. అనేక అవధానములను నిర్వహించినఘనత ఆయనకే దక్కింది. అనేకసన్మానాలు, బిరుదులు వారి విశిష్టతను చాటుతాయి.
ఈయన"రేనాటిసూరీడు" రాయలసీమసింహము, ఉయ్యాల వాడనరసింహారెడ్డి వీర చరిత్రను చారిత్రకప్రబంధముగా రచించిన మహాకవి.
ఆంగ్లేయుల దుష్ట పరిపాలనను అత్యంత సాహసోపేతముగా యెదుర్కొన్న మహాయోధుడు ఉయ్యాలవాడనరసింహారెడ్డి.
స్వాతంత్ర్య సమరములో తనప్రజలకొఱకుబ్రిటిష్ వారికి తనంతటతానుగా పట్టుబడి ప్రాణములను తృణప్రాయముగానెంచిన మహావీరుడు వీర నరసింహుడు.
ఆయన జీవితచరిత్రను కళ్ళకుకట్టినట్లు వర్ణించి ప్రబంధరూపములో రచించి తమదేశభక్తిని నిరూపించుకొన్నమహాకవి శ్రీ చింతా రామకృష్ణారావు గారు. కావ్యలక్షణాలను మక్కిమక్కిగా పాటిస్తూరచించుట, ఆయనకేచెల్లింది. "కావ్యంయశసేsర్ధకృతేవ్యవహారవిదే"అన్నట్లు కావ్యం సామాజిక సందేశం ప్రస్ఫుటంగా ఉండేటట్లురచించుట, ఆయన ప్రతిభకు మచ్చుతునక.
ఆనాటి రాయలసీమలో పాలెగాళ్లు తమదే స్వాతంత్ర్యానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తమ దేశభక్తిని చాటుకున్నారు. వారిలోఉయ్యాలవాడ నరసింహారెడ్డి"రేనాటిసూరీడు"గావాసికెక్కాడు.
"శ్రీ భారతం బమలోదాత్త మహత్వ తత్వఖని, శోభాపూర్ణవారాశియే"
"యీమర్మవిదూర దేశము సమస్త శుభప్రద కర్మభూమి."
అనిభారతావనిని వర్ణించి "జననీజన్మభూమిశ్చస్వర్గాదపిగరీయసీ" తమ దేశభక్తిని చాటుకున్నకవి శ్రీచింతావారు.
అనేక వృత్తములతో సాహితీక్రీడావిన్యాసము ప్రదర్శించి, తమప్రతిభాపాటవాలను
ప్రదర్శించారు.
అష్టదళపద్మబంధ సుదర్శనవృత్తములో "రామలందరువేసిరావిధిరాజిలంగల మ్రుగ్గురా"
నరసింహారెడ్డి జన్మించిన రూపనగుడిలో
"సింగములట్లు పౌరుషము చిందెడివారు రహించిరాపురిన్"
ఆ గ్రామము గొప్పతనము యెట్టిదో చెప్పకనే చెప్పిరి.
ఆప్రాంతములోప్రవహించిన కుందేరు నదిని నదీప్రఘోష వృత్తములో యిలా వర్ణించిరి.
"జూడంగగ్రుందేరదిసోమధారయే"
నరసింహారెడ్డి బాల్యవర్ణన
నారసింహుడు"సూర్యుండునాన్ వెలింగె"
మాతామహుడు జయరామారెడ్డి తన కుమారుని కోల్పోయి దౌహిత్రుడైన నరసింహారెడ్డిని వారసునిగా ప్రకటించాడు.
నరసింహారెడ్డి బాల్య మిత్రులు, దొడ్డెయోబయ్య, మళ్ళవెంకయ్య.
నరసింహారెడ్డి బాల్యము నుండి దేశభక్తి తో ఆంగ్లేయుల ను ధైర్యసాహసాలతో యెదుర్కొనుచు, ఖజానాలను ముట్టడించుచు వారికంటికి కునుకుపట్టకుండా చేసిన వీర విప్లవ యోధుడు.
దేశద్రోహియైన రాఘవాచారిని మట్టుబెట్టినవీరుడు.
1846జూలై23ననొస్సంకోటపైబ్రిటిష్ వారి దాడి. అసమాన ధైర్యసాహసాలతో వారి నెదుర్కొన్న వీరాగ్రేసరుడు నారసింహుడు.
అందుకే కవిఆయనను బంగారుకడ్డీతో పోల్చి తమ విజ్ఞత ను చాటుకొన్నారు.
"బెంగను తీర్చగ వచ్చిన బంగారపుకడ్డి మీరు పావన చరితా"
"సైరాసైరనృసింహరెడ్డియనుచున్ "సైయన్నసైయంచు"
వసంత ఋతువర్ణన
"విరిసిన పూలతో కనులవిందుగనొప్పు వనాళిజూడగా"
సూర్యోదయ సూర్యాస్తమయ వర్ణనలను, సమయోచితంగా వర్ణించారు.
"నానృషిఃకురుతేకావ్యం"
"కవి గాంచిన చోట రవి గాంచ లేడు"
"కందమురాసినవాడేకవి"యనుటకువీలులేదు.ఈయన ప్రబంధరచనలో చిత్రవిచిత్ర బంధ వృత్తములు రచించారు.
సాటిలేనిమేటివీరుడైన నారసింహుడు బ్రిటిష్ వారికి పట్టుబడకుండా వారిని యేడుచెరువుల నీరుత్రాగించాడు.కానిఆదుర్మార్గులు యీయన బలహీనతపై దెబ్బకొట్టారు. సామాన్యప్రజ లననేకవిధముల చిత్రహింసలకుగురిచేస్తూఉంటే వారిబాధలు చూడలేక తనంత తానుగా
బ్రిటిష్ వారికి లొంగి, తనప్రాణాలను ప్రజారక్షణకు బలిదానము చేసిన త్యాగధనుడు, వీర నరసింహారెడ్డి.
అట్లే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కూడ యీ స్ఫూర్తితో ప్రాణాలనర్పించిన మన్యంవీరుడు.
ఈ చారిత్రక మహాప్రబంధరచన చేసిన శ్రీ చింతా రామకృష్ణారావు గారు ధన్యులు. సాహితీప్రపంచాకాశములో రాకాసుధాకరుడు, శ్రీ రామకృష్ణుడు.
వారి లేఖిని నుండి అనేక ఆధ్యాత్మిక గ్రంథరాజములు వెలువడ్డాయి. ఇంకావెలువడుతూనే ఉన్నాయి.
ఈ అవకాశాన్ని చ్చిన మిత్రులు, సహృదయులు శ్రీ రామ కృష్ణా రావు గారి కి ధన్యవాదాలు.
స్వస్తి.
నేను కోరగానే చక్కని సమీక్షని నా గ్రంథము చదివి వ్రాసి యిచ్చిన శ్రీ ఆచంట సూర్యనారాయణ గారికి నా ధన్యవాదములు.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.