జైశ్రీరామ్.
అభి నందన
సకల దేవతల సహస్ర నామాలనూ రోజుకొక పద్యంగా అనువదిస్తూ ఛందోమయ తపస్సు సాగిస్తున్న సుకృతులు మీరు రామకృష్ణా
రావుగారూ! నిశ్చింత రామకృష్ణారావుగా నేను సంభావించి మురిసిపోడు సహృదయ పాఠకుణ్ణి. చిత్రకవితా సమ్రాట్ - సార్థక బిరుదాంకితులు. మీరు వెలార్చిన అయిదు ఆశ్వాసాల వీరరసాత్మక ప్రౌఢ ప్రబంధం ఈ రేనాటి సూరీడు. దీనిలో అడుగడుగున చిత్ర - బంధ- ప్రబంధ కవిత్వం సామాన్యులకు అందరు. ఎవరో వ్యాఖ్యానం సంతరించి పుణ్యం కట్టుకోవాలి.
నిజానికి యీ ప్రబంధానికి పరిచయ పీఠిక వ్రాయాలంటే నాకు తెలిసిన మాన్యులు శ్రీ ఏ.వి.రమణరాజుగారు ఒక్కరే సమర్ధులు. నేనేమో మీ మాట కాదనలేక రెండు ముక్కలు వ్రాస్తున్నాను. ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్ర కలగలుపుతో ఉపజాతి వృత్తం వాల్మీకి నుంచీ సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధం. తెలుగు జగత్త అప్రసిద్ధం. దాన్ని మీరు సుప్రసిద్ధం చేశారు (5-76).
నర్మహరెడ్డి అటవీ అధికారి పీటర్ని సంహరించిన ఘట్టంలో మీ శార్దూలం నాయకుఁడు లాగానే గాండ్రించి దూకింది.
తృతీయాశ్వాసం ఆరంభంలో చతురంగ స్వస్తిక్ బంధకందం కృత్రిమ మేధకు కూడా పనిపెడుతుంది. పైగా అది సర్వ లఘువు. - ముత్యా మేధకు కూడ పనిపెడుతుంది. పైన కదిసర్వలఘువు. అయ్యా! మీ కైవాడికి కైమోడ్పులు!! తేటగీతిలో చక్రబంధానికి, కందగర్భ తేటగీతికి నివ్వెరపోయి, అష్టదళ పద్మ సుదర్శన వృత్తానికి సాగిలపడి, కడకు చతురంగ స్వస్తిక్ బంధ కందం దగ్గర చేతులు ఎత్తేసి జోడించేశాను.
తొట్టతొలి సూర్యోదయ వర్ణన, రేనాటి నగర వర్ణన, నాయికల జలకేళికి సరోవరం ఎదురు చూస్తోదన్న మీ సుకుమార సుందర ముగ్ధమనోహరరసికతాపర కోటికి శతకోటి నతులు. నేను ఇంక యేమీ మాట్లాడ లేను. సెలవు.
మీ
బేతవోలు రామబ్రహ్మం
19 - 09 - 2026.
9848169769.
పుంభావ సరస్వతీమూర్తులయిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం మహోదయులునేను కోరగానే నా మాటను మన్నించి వారు నా గ్రంథమును కూలంకషముగా పఠించి తమ అమూల్యమైన ఆశీస్సులరూపంలో సమీక్షించి ఇచ్చినందులకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదపూర్వక నమస్సులు.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.