జైశ్రీరామ్.
మ. కొరిడేవంశజ విశ్వనాథులె కృపన్ గూర్మిన్ ననున్ మెచ్చుచున్
వరణీయుండుగ చెప్పినంతనె దయావర్షంబు కుర్పించుచున్,
సురలట్లచ్చట నాకు సత్కృతులతో సద్దీవనాళిన్, ప్రభా
రమణీయంబుగ వేదమంత్రములతో రాణింపగాఁ జేసిరే.
ఈ స్వామివారి సన్నిధిలో మహనీయులైన ఈ పెద్దలు నన్ను అవ్యాజానురాగంతో సత్కరించి వేదమంత్రములతో తమ అమూల్యమైన ఆశీర్వచనములందించి ఆశ్చర్యచకితుని చేసిరి. అట్టి ఈ పెద్దలందరికి, ముఖ్యముగా బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథశాస్త్రి మహోదయులకు నా ధన్యవాదపూర్వక నమస్సులు.
జైహింద్.
Print this post
1 comments:
పండితులకు సరైన సన్మానం జరపటం ధర్మపురియుల సంప్రదాయం అందులో మహా పండితులైన చింతా వారికి గౌరవం ఇవ్వడం విశేషం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.