గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, డిసెంబర్ 2017, సోమవారం

బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ వనజ దంపతులకు షష్టిపూర్తి సందర్భముగా సమర్పించిన అభిఅందన నవరత్నమాలిక

జైశ్రీరమ్.
శ్రీరస్తు          శుభమస్తు      అవిఘ్నమస్తు.
బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ వనజ దంపతులకు
షష్టిపూర్తి సందర్భముగా సమర్పించిన
అభిఅందన నవరత్నమాలిక
రచన. చింతా రామకృష్ణారావు. తేదీ. 25 - 12 - 2017.
                                                                             
శా. శ్రీ జ్ఞానాశ్రయ భాగ్యదాయినిని, రాజీవాక్షి నా శాంభవిన్
జిజ్ఞాసిన్గని నారు మంచికగు యీ శ్రీ షష్టి పూర్తిన్, ప్రభల్
సుజ్ఞేయంబుఁగఁ గొల్పఁగా నిచటికిన్ శోభాయమానంబుగా
విజ్ఞుల్ మెచ్చఁగ వచ్చి దీవనలిడన్ వేమారు నేఁ గోరుదున్.       1

శా. సుబ్రహ్మణ్య సరోజనీ పితరులన్ శోభింపఁగాఁ జేయఁగా,
సుబ్రహ్మ ప్రపితామహున్ తనుపఁగా శుంభద్గుణోద్దిష్టుఁడై,
శ్రీ బ్రహ్మంబు కనన్ బితామహులు నా కృష్ణయ్యలక్ష్మమ్మలున్,
ధీబ్రహ్మంబుగ నారుమంచి వెలసెన్, దివ్యుండనంతుండుగా.   2

మ. వనజాతాయత నేత్ర భార్యగ క్షితిన్ భాసింపఁగానొప్పుచున్,
ఘనతన్ వెల్గు నపర్ణ కూతురవగా, కాన్ మూర్తి జామాతఁగా,
వినుతిన్ గౌశికు బుత్రుఁడున్, శ్రుతిమహద్విఖ్యాతయౌ  కోడలున్,
మనుమండున్, తగు మన్మరాండ్రు కలుగన్ మాన్యుండుగా వెల్గిరే. 3


 5               
ద్విపదద్వయ, మత్తకోకిల గర్భ సీసము.
శ్రీపరాత్పరి నెంచి చేతువు సేవ ని - త్యమనంతుఁడా నీవు తత్వ ఖనివి.
దీపితంబగు భక్తి తేజము దేవతల్ - గణియింపఁగా వచ్చు కరుణ చూప.
ప్రాపు శాంభవి భావ రమ్యుఁడ భక్త దీ - పిత నీకిలన్, భాగ్య తతినొసంగు.
శ్రీపదాశ్రయ వెల్గు శ్రీపద చింతనా - మృత ధారగానింక క్షితిని సతము.
తే.గీ. సత్య సంపన్న జీవన సాక్షివగుచు
నిత్య మానంద సామ్రాజ్య నేతవగుచు,
స్తుత్య జీవన భాగ్యసంశోభివగుచు
షష్టి పూర్తిని గనుమ సంతుష్టి నీవు.  6.

చ. ప్రగణిత సత్య సంభవిత భాస్కర తేజ! యనంత కృష్ణుఁడా!
జగతిననంతతేజమగు సంస్తుత శాంభవి నీదు రూపునన్
సుగుణ చయంబు పెంచుత వసుంధర భారతి కీర్తి పెంచుతన్.
నిగమ సువేద్యు నద్భుత మనీషులలో వరలింపఁ జేయుతన్.  7
మ. పరమోత్కృష్టము షష్టి పూర్తి. మిములన్ వర్ధిల్లఁ జేయున్. శుభా
కరమై వంశ వివృద్ధిఁ జేయు, మహితాకాంక్షల్ ఫలించున్ మహ
ద్వరమై వర్ష శతంబు నిల్పు మిములన్ ప్రజ్ఞాన సంపూర్ణతన్.
ధరపై మంగళ మూర్తులై శుభములన్ దర్శించుడీ సత్కృతిన్.  9.

మంగళమ్              మహత్             శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ 
     జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
షష్టి పూర్తి సందర్భముగా బ్రమశ్రీ నారుమంచి అనంత కృష్ణ వనజ దంతులకు హృదయ పూర్వక శుభాభి నందనలు .[శిరసాభి వందనములు ] చి. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
అందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు.

Unknown చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు
మీ అభినందన నవరత్న మాలిక అద్భుతంగా నున్నవి, షష్ఠి పూర్తి సందర్భంగా బహ్మశ్రీ నారుమంచి దంపతులకు శుభాభినందనలు..
మీ శిష్యుడు
వరప్రసాద్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.