గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జనవరి 2019, శనివారం

12వ పద్యపక్షము భారత రాజ్యాంగము అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ. రచన. చింతా రామ కృష్ణా రావు.

0 comments

జైశ్రీరామ్.
12వ పద్యపక్షము 
భారత రాజ్యాంగము అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ.
రచన. చింతా రామ కృష్ణా రావు.
౧. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
శ్రీనివాసమదియె స్వేచ్ఛకు నిలయము - పలుకవచ్చు ధనము బలము చేసి.
భారతావనినిట ప్రకటింప భావముల్ - స్వేచ్ఛ లేదు నిజము వినుమ కృష్ణ!
స్వేచ్ఛ కలదటంచు వెలువరించితిమేని, - తుచ్ఛులైన నరులు తునుమ వచ్చు.
భావప్రకటనంబు ప్రాణంబులకు తెచ్చు - ముప్పు నిజము చూడ పూజ్య కృష్ణ!
ఆ.వె. మనసులోకలదని మాటలాడ తగదు. - మనుజులున్న లోక మార్గమెఱిఁగి.
బ్రతుకవచ్చు మనము ప్రఖ్యాతమెఱుఁగుచు, - బ్రతుకు బాట కనుచు రమ్య కృష్ణ!
౨. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
స్వేచ్ఛ కలదటంచు నిచ్ఛానుసారము - మంచి చెడ్డలు విడి మాన్య జనుల
పరువు మంటఁ గలుపు ప్రకటనలనుచేయు - మూర్ఖ లధికమైరి పుడమిఁ గృష్ణ!
స్వేచ్ఛ కలుగనౌను. తుచ్ఛత సరికాదు. - భంగ పరుప రాదు పరుల శ్వేఛ్చ.
అట్టి భావప్రకటనంబునే రాజ్యాంగ - మొసగెనయ్య కనఁగ వసుధ కృష్ణ!
ఆ.వె. మాటలాడనగును మనభావమునుదెల్ప. - నోటి మాట, వినిన తోటివారి
యాత్మగౌరవమును హాని పరుపరాదు. - భావ భాగ్యమపుడె ప్రబలు కృష్ణ!
౩. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
సమసమాజమునను సభ్యతా సంస్కార - ములను వీడఁ దగదు మూలమదియె.
భావప్రకటనంచు వాచాలురైనచో - శిక్షతప్పదపుడు శ్రీశ కృష్ణ!
వ్రాతలందయినను భాషణంబందైన - భావ ప్రకటనాన వరలుసుగతి
నీవు కనుచు మంచి నేర్పుమా ప్రజలకు - నేర్పు మీర జనులు నేర్వ కృష్ణ!
ఆ.వె. భావ ప్రకటనాన బ్రహ్మస్వరూపంబు - జూపు వారు ఘనులు. శోభిలుదురు.
మంచిఁ గొలిపి మాకు మర్యాద దక్కించు. - మంగళములు నీకు మహిత కృష్ణ!
శా. సర్వంబున్ తమదేయటంచు తలచే సంస్కార హీనుల్ మహద్
గర్వాంధంబున సంచరించుచు సదా గణ్యంపు రాజ్యాంగమున్
సర్వోదంచిత భావ స్వేచ్ఛ సుగతిన్ సర్వంబు వక్రించుచున్
నిర్వీర్యంబొనరించుచుండిరి మహిన్ నిస్తేజతన్ గొల్పుచున్.
ఉ. స్వస్తి జగాళికిన్ గొలుపు, స్వస్తిని గొల్పును భావ శ్వేచ్ఛ. వి
శ్వ స్తుతమై రహించు ప్రజ పద్య సుపక్షము ద్వాదశాకృతిన్
ప్రస్తుతిఁ గాంచు ధర్మము. పరాత్పర దర్శన మానసాళికిన్
స్వస్తిని గొల్పితీరు.. గుణ వర్ధక మంగళమీకు కృష్ణయా!
స్వస్తి.
జైహింద్.

4, జనవరి 2019, శుక్రవారం

11వ పద్యపక్షము టీవీ సీరియళ్ళు - సమాజంపై ప్రభావం. రచన. చింతా రామ కృష్ణా రావు.

1 comments

జైశ్రీరామ్.
11వ పద్యపక్షము 
టీవీ సీరియళ్ళు - సమాజంపై ప్రభావం.
రచన. చింతా రామ కృష్ణా రావు.
౧. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
శ్రీపతి కనిపించు చేతనత్వముఁగొల్పు - రమ్మని పిలిచేమొ రారు జనులు.
దూరదర్శనమున దూరిపోదురు వారు - కాంచు కాంక్ష వలన, కనుము కృష్ణ!
బుల్లితెరను వచ్చు పుంఖానుపుంఖాల - నాటక క్రమదృష్టి నాట మదిని
చేటు కలుఁగఁ జేయు చిత్ర దర్శనమబ్బె. - మానవాళిఁ గనుమ మనిచి, కృష్ణ!
ఆ.వె. చూచువారి మదికి సూదంటురాయియే - దూరదర్శన మనివారణమయె.
ధనముచేసుకొనెడి మనమె కానఁగవచ్చు. - ప్రబలె దీని మహిమ. పాపు కృష్ణ!
౨. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
సమయ పాలనమున సాక్షులై కనిపించు - బుధులు చూడ మరిగి విధులు మరచి
దూరదర్శనమున సారించి మనమును - దూరుదురయ దానిఁ గోరి కృష్ణ!
దూరదర్శన క్రమ భూరి దుర్గతి నాడు - వారు కూడ విడువఁ గోరు మగల
నాడువారి మనసులాకట్టుకొనునవి. - చెడ్డమార్పు లొసగుఁ జేటు కృష్ణ!
ఆ.వె. మంచియు చెడు నుండు మన దూరదర్శినిన్ - సమయపాలనమది జరుగనీదు.
కాలగతిని మరచి కాంచుటన్ వికటించి - జీవితములు సమసిపోవు కృష్ణ!
౩. ఆటవెలది త్రయ గర్భ సీసము.( నామ గోపన చిత్రము )
దూర దర్శనమున దురితంబులే చేయు - టీ వ్యవస్థ మరగు పృథ్వి పైన.
విలువలన్ విడుతురు విగత నైతికముల - వీక్షణమునఁ జేసి వినుత కృష్ణ!
విలువలెంచని మది నలముకొనదె యుదా - సీనత? మనకింక చెడుటె మిగులు.
ఇహ పరములపైన నేరీతిగా కల్గు - రిక్త జీవుల కనురక్తి? కృష్ణ!
ఆ.వె. ధర్మదూరులగుచు తరియింప లేక జ్ఞే -  యము నిలం దెలియక యలమటింత్రు.
అంతులేని కథల ననురక్తిఁ గనుచు, క్రు - ళ్ళుచు, కృశింతురు కలఁగుచును కృష్ణ!
౪. శా. కర్మంబియ్యది దూరదర్శనగతుల్ కాలుష్యసంపూర్ణముల్.
మర్మాతీతగుణాతిరిక్త కథలన్ మంత్రించు దృశ్యాళిచే
నైర్మల్యంబగు మానవాళి కలఁగున్ నారీజనోత్ప్రేరణన్
దుర్మార్గంబగు చిత్ప్రవృత్తి, కలుగున్ దుస్తంత్ర దుర్మార్గముల్..
౫. ఉ. కాలమునాహరించు కలికాలపు ధర్మమనంగ పెచ్చు, స
చ్చీలములన్ హరించు, వివశీకృతులౌనటు చేయునెల్లరన్.
గోలగనావరించు, గుణకోవిదునైనను మార్చు నద్దిరా!
యేలికలున్ గ్రహింపరె యహీన దురంతపు దూరదర్శనిన్.
స్వస్తి.
జైహింద్.

3, జనవరి 2019, గురువారం

10వ పద్యపక్షము వైద్యరంగం - మారుతున్న సమీకరణాలు. రచన. చింతా రామ కృష్ణా రావు.

1 comments

జైశ్రీరామ్.
10వ పద్యపక్షము 
వైద్యరంగం - మారుతున్న సమీకరణాలు. 
రచన. చింతా రామ కృష్ణా రావు.
౧. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
శ్రీకర, మహనీయ, శ్రీహరి నామమున్ జేకొను మనుజుండు చెలఁగునెపుడు
ననుపమమయినట్టి యారోగ్య సంపదన్ వైద్యమతనికేల వినుత కృష్ణ!
వైద్య వృత్తి నలరు వైద్యుఁడే నారాయణుండటంచు గనరె నిండు మదిని,
అట్టివైద్యుడెలమినసహాయుడై వృత్తి నమ్ముకొంచు బ్రతుకు నవని కృష్ణ!
ఆ.వె. వైద్యవృత్తిచేత వర్ధిల్లిరానాడు. విశ్వ జనులు పొగడ వేల్పులయిరి.
ధనమె ఘనమటంచు దయమాలి పీడించు రాక్షసులయినేడు క్రాలు కృష్ణ!
౨. ఆటవెలది త్రయ గర్భ సీసము.
మారుచుండె జగతి. మర్యాదలును మారె మానవత్వమిలను మట్టి కలిసె.
వైద్య విద్య కొఱకు వరలు భూములనమ్మి రిక్త హస్తులగుచు వ్రేగు కృష్ణ!
అట్టివారు పృథివి ననుపమ ధనవాంఛ నరయ నేర్వరహిత దురితగతులు.
ధనము కురియు రోగి తమకు దక్కినవేళ పిండుచుండిరవని. వేద్య కృష్ణ!
ఆ.వె. వైద్యవిద్యనరయ వలయునుచితముగ, పాలకులు గ్రహించి, వారి కొఱకు
ధనము కూర్చి చదువు తప్పక చదివించ లోకులఁ గని వారు సాఁకు కృష్ణ!
౩. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
ఉచిత వైద్యమమరనొప్పగున్ జనులకు. బ్రతుకజాలుదురిల ప్రజలు భువిని,
ధనము కొఱకు వైద్యమును నేర్చుకొనుటిమి? శోచనీయముకద! శుభద కృష్ణ!
ప్రకృతివైద్యమిలను ప్రాణరక్షణఁ గొల్పి వరలఁ జేసెనపుడు ధరను జనుల.
ప్రకృతి వికృతమయ్యె బ్రతుకు భారంబయె. జనుల స్వాస్త్యమమరఁ గనుము కృష్ణ!
ఆ.వె. రోగముల్ ప్రబలెను. రోగార్తులను కాచు వైద్యముల్ ప్రబలెను. వైద్యశాల
లెల్ల ధనము కొఱకునెల్లలు మరచిరే! రోగికేమి దిక్కు? ప్రోవు కృష్ణ!.
ఉ. మేలగు వైద్యమందున సమీకరణంబులు మారుచుండె, ని
ర్భీలత రోగులందు కనిపించుట లేదు దురంత దుస్థితిన్.
కాలము మారిపోయె. కలికాల ప్రభావము పెచ్చురేగె నీ
వేల గణింపకుంటివొ? రమేశ్వర! రక్షణ గొల్ప రావయా.
క. నారాయణులుగ వైద్యుల
నారాధన చేతురు ప్రజ. నాయనలారా!
మీరావైద్యామృతమును
కోరి యొసగి కాచి జనులకున్ హరియగుడీ!
స్వస్తి.
జైహింద్.

2, జనవరి 2019, బుధవారం

9వ పద్యపక్షము తెలుఁగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర, మన కర్తవ్యము.. రచన. చింతా రామ కృష్ణా రావు.

1 comments

జైశ్రీరామ్.
9వ పద్యపక్షము 
తెలుఁగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర, మన కర్తవ్యము..
రచన. చింతా రామ కృష్ణా రావు.
౧. ఆటవెలది త్రయ గర్భ సీసము.
శ్రీకరంబు తెలుఁగు. శ్రీవాణి మంజీర - నాద మంజులమగు నా తెలుంగు.
తెలుఁగు దివ్వె భువిని కొడికట్టుకొనుచుండ, - ప్రభుత కాంచకుండె భవిత కృష్ణ.
జీవభాష తెలుఁగు, చిన్మూర్తిఁ గనఁ జేయు, - ధైవభాష పోలి ధాత్రి వెలిఁగె.
భావ సుందరమగు పదసంపదల భాష. - బ్రతుకఁ జేయుమయ్య క్షితిని కృష్ణ!
ఆ.వె. ప్రభుత దృష్టి పెట్టి పాఠశాలలనుండి - తెలుఁగు వరలఁజేసి నిలుప వలయు.
జనులు మాతృభాష ఘనతను మరువక - తెలుఁగు నేర్వ భువిని వెలుఁగు కృష్ణ!
౨. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
తెలుఁగు తెనుఁగు నాంద్ర దేదీప్య నామాల - వెలుఁగె నాడు తెలుఁగు జిలుఁగులీని
తెలుఁగు వెలుగుకింక తెల్లవారుచునుండె - నాంగ్లమరయుచుంట నమల కృష్ణ!
చిత్ర కవిత, బంధ చిత్ర, గర్భకవిత, - శ్లేష కవిత తెలుఁగు హృదయమపుడు
నేడు వర్ణచయము నేర్వకుండుటఁ జేసి, - వీడిపోయె తళుకు వినుము కృష్ణ!
ఆ.వె. సద్వధాన సుగతి, సరస వాఙ్మయముతో - నలరు భాష తెలుఁగుకథమ గతియె
కలుగుచుండె. ప్రభుత కని కావఁగావలెన్, - మరచిరేని తెలుఁగు మనదు కృష్ణ!
౩. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
మనము తెలుఁగు భాష మాటలాడవలయు - సరస కావ్య తతిని చదువ వలయు.
ఘనత చాటు తెలుఁగు ఘన చిత్ర బంధముల్ - కలవటంచు తెలుపవలయు కృష్ణ!
నవ రసామృత మిది, శ్రవనసుందరమిది - నవ్య గతుల వెల్గు భవ్య భాష
అట్టి తెలుఁగు వీడుటన్యాయమేకద! - అరసి కావుమయ! యనంతకృష్ణ!
ఆ.వె. బ్రతుకు కొఱకు మనము పాశ్చాత్య దేశాల - కేగి యుండవచ్చు నెచ్చటున్న
మాతృభాష తెలుఁగు మన్ననందునటుల మేము - చేయవలయు పృథ్వి కృష్ణ!
4. కంద గీత చంపకమాల గర్భ సీసము.
మన తెనుఁగున్ సదా మహిని మన్నన లందెడి మ్రానిపండునాన్ కమ్రగతిని
ఘనత గనన్గ సత్ కవులు గాంచెడి ధీపథ క్రాంత దర్శిగా తరిచి తరిచి
కని మనుపందగున్. కనఁగ కమ్మని తెన్గిది, గ్రాహ్యమిద్ది. మా తేజమంచు
ధనమనుచున్, సదా ధరణి తప్పక నిల్చెడి ద్రవ్యమౌనుగా భద్రతనిడ.
తే.గీ. ప్రభుతయున్ బ్రజ తెన్గును వర్ధిలంగ - చేయ వలయును సద్ గణనీయ కృషిని.
చిత్ర బంధ సద్గర్భాది శ్రీకరమగు - రచనలను చేసి సత్ కవుల్ ప్రబల వలయు.
సీస గర్భస్థ చంపకమాల.
మన తెనుఁగున్ సదా మహిని మన్నన లందెడి మ్రానిపండు నాన్
ఘనత గనన్గ సత్ కవులు గాంచెడి ధీపథ క్రాంత దర్శిగా
కని మనుపందగున్ కనఁగ కమ్మని తెన్గిది గ్రాహ్యమిద్ది. మా
ధనమనుచున్, సదా ధరణి తప్పక నిల్చెడి ద్రవ్యమౌనుగా.
సీస గర్భస్థ కందము.
తెనుఁగున్ సదా మహిని మ
న్నన లందెడి మ్రానిపండు నాన్ ఘనత గనన్
మనుపందగున్ కనఁగ క
మ్మని తెన్గిది గ్రాహ్యమిద్ది. మా ధనమనుచున్,
సీస గర్భస్థ తేటగీతి.
మహిని మన్నన లందెడి మ్రానిపండు
కవులు గాంచెడి ధీపథ క్రాంత దర్శి
కనఁగ కమ్మని తెన్గిది గ్రాహ్యమిద్ది.
ధరణి తప్పక నిల్చెడి ద్రవ్యమౌను.
5. చం. తెలుఁగునఁ గల్గు చిత్రములు, దీపిత గ్రాహ్య మహత్ ప్రహేళికల్,
వెలుఁగులనీను కావ్యములు, వేల్పులఁ జూపెడి భాషణాంశముల్,
సులువగు నీతి పద్యములు, సుందర సద్రచనాదికంబులన్
వెలుఁగఁగ చేయుటే విధిగ ప్రీతిని చేకొనుటొప్పునందరున్.
స్వస్తి.
జైహింద్.

1, జనవరి 2019, మంగళవారం

23 . 01 . 2022..రాత్రి బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతిగారు అకాల మరణం చెందిరి, వారి ఆత్మకు శాంతి చేకిఇరుగాక.

0 comments

ఓం నమశ్శివాయ.

వశ్యవాక్కులైన సమగ్రజ్యోతిశ్శాస్త్రఖని, 23 . 01 . 2022..రాత్రి బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతిగారు శివైక్యము చెందటం హృదయాన్ని కలిచివేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను.

ఓం శాంతిః

శ్రీరమ పట్టాభిషేకం ... రచన ... చింతా రామకృష్ణారావు. ... గ్రంథావిష్కరణ మహోత్సవము. SRVD ELIGHT క్లబ్ హౌస్ లో తే. 11 - 4 - 2025.

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.




 

నా జన్మ...

0 comments

జైశ్రీరామ్. 

1.శా.  శ్రీమన్మంగళ దేవ దేవ! నృహరీ! చింతాన్వయంబందు నన్

భూమిన్ బుట్టఁగఁ జేసి, పెంచితివిటుల్ పూజ్యంబుగా నిల్పి, నా

క్షేమంబీవె నిరంతరంబు గనుచున్ గేల్పట్టి నన్ బ్రేమతో

శ్రీమార్గంబున సాగఁ జేసితివి, నేరీతిన్ నినున్ గొల్చెదన్?

2.శా.  జన్మంబందున నొక్కమారయిన నిన్ సద్భక్తి నెన్నన్, బున

ర్జన్మంబే కలిగింప నేర్వక హరీ! సాయుజ్యమున్ గొల్పుదే,

సన్మార్గంబున పాపదూర శుభ సత్ సంస్కారిగా నిల్పి, న

న్నున్మాదాదులకున్ సుదూరునిగ నీ వొప్పారగా నిల్పితే.

3.మ.  తలిదండ్రుల్ మహనీయు లెన్నఁగ, లసద్ధాత్రీశులే బంధువుల్,

కలనైనన్ మరువంగరాని గురువుల్, కారుణ్య పూర్ణుల్ హితుల్,

కలనైనన్ నను  వీడనట్టి సతి, నీ కారుణ్యమున్ జేసి నా

కిలఁ బ్రాప్తించె, నృసింహదేవ సరిరా రీకెవ్వరున్ సృష్టిలోన్.

4.మ.  ఋణముల్ తీర్పను బుట్టఁ జేసితివిగా పృథ్విన్? ఋణంబంతయున్

ప్రణవాకారుఁడ! తీరునెట్లు?  కన నా భారంబునే మోయు నీ

ఋణ మే జన్మకు తీర్చఁ గల్గుదును? మాతౄణంబు, పిత్రాదులన్

ఋణభారంబులవెట్లుతీర్తు? నృహరీ! కృష్ణా! విముక్తిప్రదా!

5.ఉ.  శ్రీపతి! నీ పదద్వయము చేకొన నీయని పాప జన్మ, యీ

పాపపు కూపమందుఁ బడ, పాప విమోచన సాధ్య మెట్లగున్?

భూ పరిధిన్ గలారలకు పుణ్యఫలంబులు, వాని తోడనే

పాపఫలంబులున్ గలుగు, పాయు టసాధ్యము వీటి నో హరీ!
జైహింద్.

చింతా వారి... వినాయక సీసగర్భస్థ దండకం

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శ్రీమద్విశ్వావసు నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.

ఆంధ్రాంఋతం పాఠకులకు

శ్రీమద్విశ్వావసు నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఈ సంవత్సరం ఆద్యంతం మీకు మీకుటుంబానికి మీ ఆత్మీయులకు మంగళప్రదంగా ఉండాలని ఆ జగన్మాతను కోరుకొంటున్నాను.

జైహింద్.

2019 ఆంగ్లవత్సరాది శుభాకాంఖ్షలు

1 comments

జైశ్రీరామ్🙏🏼
సహృదయులారా. శుభోదయమ్.🕉

అసమానాద్భుత కాలవాహినిని యీ యాంగ్లంపు వర్షంబహో
దెసలెల్లన్గణనీయమై ప్రబలుటన్ దీనిన్ గ్రహించున్ ప్రజల్.
వ్యసనంబయ్యె శుభాదిగా గొనుట. స్నేహంబొప్ప సౌభాగ్యముల్
లసదంచిత్కమనీయ కావ్యకళ హేలన్గొల్పునీవర్షమున్.

క్రీ.శ. 2019. ఆంగ్ల వత్సరమాద్యంతము 
మీకు మాకు మంగళప్రదం కావాలని, జగన్మాత సర్వమంగళ మంగళ కార్యములనుపమానముగా మనచే చేయించాలని హృదయపూర్వకముగా కోరుకొంటున్నానండి.
💐💐💐🤝👍
జైశ్రీమన్నారాయణ.
చింతా రామకృష్ణారావు.
తే. 01 . 01 . 2019

సూర్య శ్రీరామము గ్రంథావిష్కరణ.... శ్రీ పొన్నెకంటి సూర్యనారాయణ రావు కవి కృతము. తే. 05 - 3 - 2025.

0 comments

జైశ్రీరామ్. 

బ్రహ్మశ్రీ పొన్నెకంటి సూర్యనారాయణ రావు కవి కృత

సూర్య శ్రీరామము గ్రంథావిష్కరణ సందర్భముగా సమర్పించిన

సన్మాన కుసుమాంజలి.

రచన…చింతా రామకృష్ణారావు. తే. 05 – 03 – 2025.


శా.  శ్రీమన్మంగళ సత్సభాసదులకున్, శ్రీ బేతవోల్ వంశజుల్

రామబ్రహ్మము గారికిన్, సురభికిన్, బ్రఖ్యాత  జంధ్యాలకున్,

శ్రీమంతంబగు కావ్యమై పరగ నీ శ్రీ సూర్య శ్రీరామమున్

బ్రేమన్ వ్రాసిన పొన్నెకంటి కవికిన్,  నే మ్రొక్కెదన్ విజ్ఞతన్.


శా.  శ్లోకంబుల్ శతకోటి దేవతతికిన్ జూపించు బ్రహ్మంబు న

స్తోకంబౌ వర బ్రహ్మ తత్త్వమును నీశుండెంచె నీ ధాత్రిపై

శ్రీకల్యాణ కరంపు గ్రంథ కృతిగా చేయింప వాల్మీకిచే

శ్లోకంబుల్ పదివేలు నాల్గుపదివేల్ శోభిల్లఁ వ్రాయించెనే.


ఉ.  శ్లోకములందునుండుటను చూచియు నేర్వగలేని వారికిన్

శ్రీకరమైన తెల్గున ప్రసిద్ధపు సద్వచనంబులోన మీ

రేకముగా రచించిరి మహిన్ సుకరంబుగపాఠకాళికిన్

మీకు శుభంబులౌ ధరణి, మేలగు పాఠక సజ్జనాళికిన్.


ఉ.  రాముని సచ్చరిత్రమగు రమ్యతనొప్పెడి శ్లోకరాజికిన్

ధీమతి! బ్రహ్మవిద్యను గతిన్ విడనీయక రామవృత్తమున్

క్షేమము గూర్ప లోకులకు శ్రీకరమార్గమునందు వ్రాసిరే,

రాముఁడు మిమ్ముఁ గాచు తన రాజ్ఞిని గూడి నిరంతరంబుగా.


ఉ.  మంగళమౌత మీకు, శుభ మంగళముల్ తమ పత్నికిన్, సదా

మంగళమౌత పాఠక సమంచిత మూర్తులకెల్ల ధాత్రిపై,

మంగళమౌత శాంభవికి, మంగళముల్ సభనున్నవారికిన్,

మంగళమౌత శ్రీహరికి, మంగళముల్ మన భారతాంబకున్.

మంగళమ్                మహత్                శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

జైహింద్.

చేతో భృఙ్గ! భ్రమసి ...మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జై శ్రీరామ్.

శ్లో.  చేతో భృఙ్గ! భ్రమసి వృథా భవ మరు భూమౌ విరసాయాం,

పిబ పిబ గీతా మకరందం యదుపతి ముఖ కమల భవాడ్యమ్.

శా.  శ్రీమన్మంగళ భారతావనిజవే, చేతో లసత్ భృంగమా!

భూమిన్ స్వార్థముతోడ వెల్గుటె ఘనంబో? నీరసంబైన యీ

ధామంబన్ మరుభూమిపై తిరిగెదే? ధర్మాది సంసిద్ధితో  

క్షేమంబున్ గన, కృష్ణబోధిత లసద్గీతా సుధన్ గ్రోలుమా. 

మనస్సు అనెడి ఓ తుమ్మెదా!రసహీనమగు యీ సంసారమను 

మరుభూమిపై యేల సంచరించుచుంటివి?  శ్రీకృష్ణ పరమారత్మునియొక్క 

ముఖ పరద్మమునుండి వెలువడిన గీతా మకరందమును పానము 

చేయుము. 

జైహింద్.

సీతా రాఘవయోర్వివాహ సమయే కుర్యాత్ సదా మంగళమ్.

0 comments

 జై శ్రీరామ్.

సీతా రాఘవయోర్వివాహ సమయే కుర్యాత్ సదా మంగళమ్.
శ్రీ సీతారాముల కల్యాణ శుభ సందర్భముగా భక్తులకందరికీ  ఆ సీతారాముల ఆశీస్సులు లభించాలని, ఈ సంవత్సరమంతా సుఖసంతోషాలతో అందరూ జీవించాలని మనసారా కోరుకొంటున్నది ఆంధ్రామృతం.

జైహింద్.

అయనేషు చ సర్వేషు .... ||1-11|| తస్య సఞ్జనయన్హర్షం.... ||1-12||

0 comments

 జైశ్రీరామ్ 

శ్లో. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |

భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి ||1-11||                                                                       

కం. మీరలువ్యూహములన్నిట                                                                                                        

మీరక మీ స్థానములనుమెలగుచు భీష్మున్                                                                

నేరుపుతో రక్షింపుడు                                                                                     

చేరగసద్విజయ పథముశ్రీమంతముగా.                                                                    

భావము.                                                                                                                                    

అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా 

భీష్ముణ్ణే రక్షించాలి

శ్లో. తస్య సఞ్జనయన్హర్షం కురువృద్ధః పితామహః |

సింహనాదం వినద్యోచ్చైః శఙ్ఖం దధ్మౌ ప్రతాపవాన్ ||1-12||                                                       

కం. అతనికి హర్షము  గూర్చుచు                                                                                

పితామహుఁడు సుప్రతాప వీరుఁడు భీష్ముం                                                                   

డతులిత  శంఖానాదము                                                                           

క్షితి,కురువృద్ధుండు చేసె కీర్తిప్రసదుఁడై.                                                                                            

భావము.                                                                                                                      

అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా 

సింహగర్జన చేసి శంఖం ఊదాడు. 

జై శ్రీరామ్

స్వాతంత్ర్యవైభవభారతి..ఽంఋతోత్సవ శుభాకాంక్షలు.

0 comments

  • జై శ్రీరామ్.
  • మీకు భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షము.


  • స్వాతంత్ర్యవైభవభారతి

సీ౹౹    శ్రీ మన్మహాభాగ్య చిద్భారతావనీ 

             ప్రాభవంబెన్న నా వశము కాదు,

  ధీమంతులైనట్టి తేజోవిరాజితుల్   

            వేదాంతవేద్యులున్ వెలసిరిచట,

  బంగారుపంటలన్ భవ్యంబుగా ప్రజన్    

                       వర్ధిల్ల జేసెడి భాగ్య సీమ,

  యాధ్యాత్మికప్రభ లసమానరీతిలో  

              పండించుసుజ్జానులుండిరిచట

తే.గీ.  ఇట్టి మహనీయభూమిపై పుట్టుటనిన 

     పూర్వ జన్మంపు పుణ్యమే పూజ్యులార

     తల్లి భారతి సేవలో తనియుడయ్య!  

     అందమైనట్టి భారతీ! వందనమ్ము

జైహింద్.

                 

నేడు శంకరంబాడిసుందరాచార్యులు. జయంతి.

0 comments

జైశ్రీరామ్.

 మహాకవి శంకరంబాడి సుందరాచారి మన రాష్ట్ర గీతమైన' మా తెలుగు తల్లి'గేయ రచయిత అయిన శంకరంబాడి సుందరాచారి 1914 ఆగస్టు 10న తిరుపతిలో జన్మించారని ప్రముఖ సాహిత్య వేత్త డాక్టర్ శిరీష తెలిపారు. సర్పవరం జంక్షన్ లో బోటు క్లబ్ వాకర్స సంఘం ఆధ్వర్యంలో శంకరంబాడి సుందరాచారి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయనది మాతృభాష తమిళమైనా తెలుగుపై ఎక్కువ మక్కువ   చూపేవారని అన్నారు.  చిన్ననాటి నుండి స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి అని అన్నారు.  బ్రాహ్మణుడైనప్పటికీ ఆచారాలను  వ్యతిరేకించి తల్లిదండ్రులను ఎదిరించి ఇల్లు వదిలి వెళ్లిపోయాడని అన్నారు. ఆయన అనేక భావ గీతాలు, స్థల పురాణాలు ,జానపద గీతాలు, ఖఒ   డకావ్యాలు, గ్రంథాలు రచించాడని  అన్నారు.  రవీంద్రుని గీతాంజలిని తెలుగులోకి అనువదించాడన్నారు. ఆయన జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది.

జైహింద్.

తెలుఁగు భాషా దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.

నేడు అనగా తే. 20 - 8 - 2022న గిడుగు రామమూర్తి గారి జన్మదినం సందర్భంగా మన్ము జరుపుకొనుచున్న తెలుఁగు భాషా దినోత్సవము సందర్భముగా నా శుభాకాంక్షలు.ంఅన్ తెలుగు భాష, తెలుఁగు జాతి ఆచంద్రతారార్కము సృష్టికే అనందప్రదముగా వెలుగుచూ ఉండాలని మంసరా కోరుకొనుచున్నాను.

జైహింద్.

అన్యే చ బహవః శూరా // అపర్యాప్తం తదస్మాకం. శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగములో..౯..౧౦ శ్లోకములు.

0 comments

జైశ్రీరమ్. 

శ్లో.  అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |

నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||1-9||

తే.గీ. కువలయమున శూరులున్ యుద్ధకోవిదులును,

త్యక్తజీవులై రెందరో ధరణిపైన

ప్రేమతోడ నాకొఱకని,వీరవరులు,

చూడుడందరిన్మీరలు,శుభసుఅరిత!

భావము.

ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి 

నాకోసం జీవితాలని త్యాగం చేశారు.

శ్లో.  అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |

పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||1-10||

తే.గీ. భీష్మ రక్షిత సైన్య మభేజ్యమనగ

కలిగె మనకు ననల్పమై, కనుఁడు మీరు,

భీమ రక్షిత సైన్య మవిస్త్రుత మటఁ

గలిగె వారికి నల్పమై, ఘన సుచరిత! 

భావము.

భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత 

రక్షింపబడే వారి బలం పరిమితమైనది.

జైహింద్.

అస్మాకం తు విశిష్టా యే ||1-7| // భవాన్భీష్మశ్చ కర్ణశ్చ ||1-8|| . శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగములో..౭..౮ శ్లోకములు.

0 comments

జై శ్రీరామ్. 

శ్లో.  అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ||1-7||

తే.గీ. బ్రాహ్మణోత్తమా! తెలియుఁడు ప్రస్తుతమున

ఘనులు మన పక్షమందున కలిగిరెవరొ,

నాదు సైన్యంబునందలి నాయకులను

తెలిపెదను నమీకునేనిటఁ దెలియుటకని.

భావము.

బ్రాహ్మణోత్తమా! మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను.

శ్లో.  భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||1-8||


తే.గీ. భీష్ముఁడును, మీరు, కర్ణుండు, వీరవరుఁడు

కృపుఁడు, సోమదత్తజుఁడు భూరిశ్రవుడును,

ఘనఁడుద్రోణ సుతుండు, వికర్ణుఁడునిట

కలరు మనసైన్యమందున ఘనసు చరిత!

భావము.

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు.

జైహింద్.


8వ పద్యపక్షము సమాజ శ్రేయస్సు - నా కర్తవ్యము. రచన. చింతా రామ కృష్ణా రావు

0 comments

జైశ్రీరామ్.
8వ పద్యపక్షము
సమాజ శ్రేయస్సు -  నా కర్తవ్యము. 
రచన. చింతా రామ కృష్ణా రావు
౧. అటవెలది త్రయ గర్భ సీసము. 
అజుని సృష్టిని భువినపురూప సౌందర్య - సత్ప్రభా ప్రణవ ప్రశస్తి నిండె.
జ్ఞాన హీనులమయి గ్రహియింపఁగాలేము. - జ్ఞానమొదవునట్లు కనుమ కృష్ణ!
జ్ఞాన దీప్తి కలుగ కానంగనగును సత్. - సత్స్వభావమిలను జయపథంబు.
నాదు కృషిని దాని శోధించి వ్యాప్తిలం - జేయఁదగును. కలుగ జయము కృష్ణ!
ఆ.వె. సత్వమీవె ప్రణవ సౌందర్యమును నీవె, నిన్నె జూపు జనులనెన్ని వారి
వలన ప్రబల సత్స్వభావంబు కృషి చేయ వలయునయ్యనేను వసుధ కృష్ణ!
౨. అటవెలది త్రయ గర్భ సీసము. 
చిత్స్వరూపమున ప్రసిద్ధంబుగా నీవు మనములందు దాగి మసలుదువయ
నిన్నుఁ గాంచి ప్రజల కెన్ని చూపుట నాదు విది. చరింపఁ గనుమ ప్రీతిఁ గృష్ణ!
దోష గతులఁ బాపి, భాషణంబునమంచి భావనమున మంచి ప్రబలఁజేయు
ధర్మమమరె నాకు. తప్పక చేయించు, నాకు నీడవగుచు నడచు కృష్ణ!
ఆ.వె. నీవె దోష రహిత నిర్మలాత్ముఁడవయ్య! దోష రహితమైన భాషవీవె.
భావనములవెల్గు బ్రహ్మంబు నీవె నిన్ వరలజూపుదునయ వరద! కృష్ణ!
౩. అటవెలది త్రయ గర్భ సీసము. 
ఆత్మశుద్ధి కొఱకు హరి పాదపద్మముల్ మనములందు నిలుపి మనునటులను
చేయవలయు నేను చిన్మార్గ గామినై భక్తపాళికిలను భవ్య కృష్ణ!
నీదు తోడు కలిగి ఖేదంబులను బాపి నిత్య సంతసమును నిలుపవలయు
భారతీయులమది. పరమార్థమిదె కదా! ధర్మ పథము నిమ్ము దయను కృష్ణ!
ఆ.వె. ఇహములోన కుములు నీస్వరు నెఱుఁగమిన్, మోహతప్తులగుచు మూర్ఖ జనులు.
వారి మదులకెక్క నీరూపమును జేయ వలయు నేను. మదుల నిలుచు కృష్ణ!
౪. చ. త్రికరణశుద్ధిగా శుభ గతిన్ జరియించుచు, సత్యమార్గమున్
ప్రకటితమౌనటుల్ తెలిపి భవ్యమహోద్గతి కొల్పి మేదినిన్
సకల జనాళికిన్ జయము, శాంతియు గొల్పుట నాదు ధర్మమౌన్
ప్రకటిత భక్తితో హరిని ప్రార్థన చేసి యొనర్తు నా విధిన్.
౫. చ. ప్రజలకు స్వస్తి గొల్పఁగను, రాజులు ధాత్రిని ధర్మ దీక్షతో
సుజనులు మెచ్చ చేయఁగ, వసుంధరదేవులు ధేనువుల్ సదా
ప్రజనిత సౌఖ్యమున్ వరల, ప్రాభవమొప్పఁగ చేయఁ బూనెదన్.
నిజమగు శక్తిమ్ము, ధరణిన్ విధి పూర్తిగ చేయ దైవమా!
స్వస్తి.
జైహింద్.