గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2019, మంగళవారం

2019 ఆంగ్లవత్సరాది శుభాకాంఖ్షలు

జైశ్రీరామ్🙏🏼
సహృదయులారా. శుభోదయమ్.🕉

అసమానాద్భుత కాలవాహినిని యీ యాంగ్లంపు వర్షంబహో
దెసలెల్లన్గణనీయమై ప్రబలుటన్ దీనిన్ గ్రహించున్ ప్రజల్.
వ్యసనంబయ్యె శుభాదిగా గొనుట. స్నేహంబొప్ప సౌభాగ్యముల్
లసదంచిత్కమనీయ కావ్యకళ హేలన్గొల్పునీవర్షమున్.

క్రీ.శ. 2019. ఆంగ్ల వత్సరమాద్యంతము 
మీకు మాకు మంగళప్రదం కావాలని, జగన్మాత సర్వమంగళ మంగళ కార్యములనుపమానముగా మనచే చేయించాలని హృదయపూర్వకముగా కోరుకొంటున్నానండి.
💐💐💐🤝👍
జైశ్రీమన్నారాయణ.
చింతా రామకృష్ణారావు.
తే. 01 . 01 . 2019
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నూతన సంవత్సర శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.