గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2019, మంగళవారం

చేతో భృఙ్గ! భ్రమసి ...మేలిమి బంగారం మన సంస్కృతి.

జై శ్రీరామ్.

శ్లో.  చేతో భృఙ్గ! భ్రమసి వృథా భవ మరు భూమౌ విరసాయాం,

పిబ పిబ గీతా మకరందం యదుపతి ముఖ కమల భవాడ్యమ్.

శా.  శ్రీమన్మంగళ భారతావనిజవే, చేతో లసత్ భృంగమా!

భూమిన్ స్వార్థముతోడ వెల్గుటె ఘనంబో? నీరసంబైన యీ

ధామంబన్ మరుభూమిపై తిరిగెదే? ధర్మాది సంసిద్ధితో  

క్షేమంబున్ గన, కృష్ణబోధిత లసద్గీతా సుధన్ గ్రోలుమా. 

మనస్సు అనెడి ఓ తుమ్మెదా!రసహీనమగు యీ సంసారమను 

మరుభూమిపై యేల సంచరించుచుంటివి?  శ్రీకృష్ణ పరమారత్మునియొక్క 

ముఖ పరద్మమునుండి వెలువడిన గీతా మకరందమును పానము 

చేయుము. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.