గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2019, మంగళవారం

అస్మాకం తు విశిష్టా యే ||1-7| // భవాన్భీష్మశ్చ కర్ణశ్చ ||1-8|| . శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగములో..౭..౮ శ్లోకములు.

జై శ్రీరామ్. 

శ్లో.  అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ||1-7||

తే.గీ. బ్రాహ్మణోత్తమా! తెలియుఁడు ప్రస్తుతమున

ఘనులు మన పక్షమందున కలిగిరెవరొ,

నాదు సైన్యంబునందలి నాయకులను

తెలిపెదను నమీకునేనిటఁ దెలియుటకని.

భావము.

బ్రాహ్మణోత్తమా! మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను.

శ్లో.  భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ ||1-8||


తే.గీ. భీష్ముఁడును, మీరు, కర్ణుండు, వీరవరుఁడు

కృపుఁడు, సోమదత్తజుఁడు భూరిశ్రవుడును,

ఘనఁడుద్రోణ సుతుండు, వికర్ణుఁడునిట

కలరు మనసైన్యమందున ఘనసు చరిత!

భావము.

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.