గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 26 నుండి 30 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

0 comments

 

జైశ్రీరామ్.

26. ప్రాతర్నమామి దినరాజ! అనంత తేజా!   

చైతన్యమున్ గొలుపు సత్పరిపూర్ణభాసా.

నీ తత్వమెన్ను మహనీయులె లేరు ధాత్రిన్.  

ఖ్యాతి ప్రదా. విజయ కారక. సూర్యదేవా!  

27. సప్తాశ్వముల్ కనఁగ సప్త వివర్ణ మాలల్  

లుప్తంబయెన్ తెలుపు లోపల చేరియుంటన్.

గుప్తార్థమిందు కనుగొన్న ప్రభాత వేళన్   

దీప్తంబగున్ మహిత తేజము సూర్యదేవా!   

28. వేదస్వరూప! నిను వేడెద పేదవారిన్,  

నీ దాసులన్ గనుము నిత్యమనంత తేజా.

బోధన్ కృపంగొలిపి పుణ్యము గట్టుకొమ్మా.  

మోదంబుతోఁ గొలుతు పూజ్యుఁడ సూర్యదేవా!   

29. నారాయణా! భరమ? నా దరి చేర నీకున్.  

కారుణ్యమే మదిని కానఁగ లేదదేమో.

ధీరాత్ములన్ సతము తేల్చెడి దివ్య తేజా  

ప్రారబ్ధముల్ కనుచుఁ బాపుమ సూర్యదేవా!  

30. ఆనందదాయివి గ్రహాధిప! లోకబంధూ!  

జ్ఞానంబె తేజముగ కల్గగ చేయుమయ్యా.

నీ నామ సంస్మరణనే విడనీకుమయ్యా.  

జ్ఞానాక్షి దాతవయి కావుమ సూర్యదేవా! 


జైహింద్.

శ్రీ వసంతతిలక సూర్యశతకము 21 నుండి 25 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

0 comments

 

జైశ్రీరామ్.
01 నుండి 05 వరకు 18 - 8 - 2023
06 నుండి 10 వరకు 18 - 8 - 2023
11 నుండి 15 వరకు 18 - 8 - 2023
16 నుండి 20 వరకు 18 - 8 - 2023
వ తేదీని ప్రచురించఁబడినవి.

21. జ్ఞానంబు తేజసమె. కావున నిన్నెఱుంగన్  

జ్ఞానంబు కల్గునటగా కరుణాలవాలా.

దీనావనా సుగుణ తేజసమిమ్ము మాకున్.  

జ్ఞానంబదే కొలుపు గాంచఁగ సూర్యదేవా!  

22. ఆరోగ్య సౌఖ్యములనాదిగనిచ్చువాడా!

నీ రాక మాకిటననేకశుభంబులిచ్చున్.

భారంబు నీదె. జయ భాగ్యద. కావు మమ్మున్.  

నీరేజమిత్ర! మము నిల్పుమ సూర్యదేవా!  

23. తారాడు గర్వనిశి దంబమడంచు వీరా!  

స్వైరంబుగా తిరుగు పాప వినాశకారీ.

భారంబు నీదెకద, వందనమాచరింతున్. 

కారుణ్యమొప్ప ననుఁ గావుమ సూర్యదేవా!  

24. సాగింప వచ్చెదవు జాగృతిఁ గొల్పి సృష్టిన్.  

నీ గాత్రమే యరుణ నిర్భర వర్ణమొప్పన్

వేగంబె వచ్చి కనువిందుగనుందువయ్యా.

నేఁ గాంచి మ్రొక్కెదను నిన్ మది సూర్యదేవా! 


25. జీవాత్మవీవె. జయశీలమునిత్తువీవే.  

భావోన్నతంబు పరివర్ధన చేతువీవే.

నీవాడ నన్ గనుము నీవిక ప్రేమతోడన్.  

దేవాదిదేవ! వినుతింతును సూర్యదేవా!  

జైహింద్.

7, సెప్టెంబర్ 2023, గురువారం

ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారికి విశ్వనాథ సాహితీ పురస్కారము.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

మనది భా.ర.త. దేశము అనగా దైవ ప్రకాశములో రమిస్తూ తరించుటకు ఆధారమయిన దేశము. భారత దేశము

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

షట్బంధ కందము. .... కవి .. వద్దిపర్తి కోనమరాట్కవీంద్రులు, సర్వసిద్ధి గ్రామము.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.


ఓమ్ .... బ్రాహ్మణ భావ జాలము..... చక్కని వివరణము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

 

ఇష్ఠన్ ప్రత్యయాంతాలు....వర్ధమాన అవధానకవులకుపయోగించే క్రొత్తప్రయోగాలు....ధూళిపాళ మహాదేవమణి.

0 comments

 వర్ధమాన అవధానకవులకుపయోగించే క్రొత్తప్రయోగాలు 🌹

         🌹  ఇష్ఠన్ ప్రత్యయాంతాలు 🌹


సంస్కృత పాణినీయంలో తద్ధిత ప్రకరణంలో కొన్ని ఇష్ఠన్.ప్రత్యయాంతాలైన విశేష శబ్దాలు చెప్పబడ్డాయి.అట్టిచోట్ల  ప్రాతిపదిక వేరూ పరిణిష్ఠిత రూపం వేరుగానూ ఉంటాయి.వానిని వర్ధమాన కవుల ఉపయోగార్థం  ఇక్కడ అందిస్తున్నాను.

పాణినీయం ప్రాగివీయ ప్రకరణం లో 🔺 అతిశాయనే తమబిష్ఠనౌ 🔺అని తమ , ఇష్ఠన్ ప్రత్యయాలు చెప్పబడ్డాయి.అతిశాయనం అంటే ఉత్కర్ష ,అధికంగా ,మిక్కిలి అని అర్థాలు.

ఉదా. అతిశయేన లఘుః = లఘుతమః , లఘిష్ఠః. పటిష్ఠః .ఈప్రత్యయాలు సాధారణంగా స్వార్థంలో అన్ని ప్రాతిపదికల మీదా ఉన్న అర్థమే మరింత ఉత్కర్షగా చెప్పలసి వస్తే వస్తాయి..అలావచ్చినప్పుడు ప్రాతిపదికు టిలోపం వస్తుంది. అందుకే "లఘు +ఇష్ఠ అనిఉండగా" ఘు"లోని ఉకారం లోపించింది.

కొన్నిచోట్ల ఇష్ఠన్ వచ్చినతరువాత కూడా మరింత ఉత్కర్ష కోసం తమ ప్రత్యయం కూడాచేసారు మనపెద్దలు.🥀ఉదా. శ్రేష్ఠతమః . 🥀

వీనిని ప్రయోగ ప్రమాణాలననుసరించి మనం ప్రయోగించడం మంచిది.

అయితే కొన్ని ప్రాతిపదికలకు ఇష్ఠన్ వచ్చినప్పుడు అనేక విశేషాలు రావడంతో తిరిగి 

 " *ప్రియ స్థిర స్ఫిరౌరు......"(  6 . 4 .157 ) మున్నగువిధంగా విశేషమైన సూత్రంచెప్పారు పాణిని మహర్షి.అవి పరిశీలించి తెలుసుకొందాం.

🌷1. ప్రేష్ఠః 🌷ప్రియ శబ్దానికి మిక్కిలి ఇష్టమైనవాడు అన్న అర్థం లో "ప్రియ + ఇష్ఠ = ప్రేష్ఠః 

2.🥀  స్థిర  + ఇష్ఠ = స్థేష్ఠః = మిక్కిలి స్థిరమైన.

3🥀  స్ఫిర+ ఇష్ఠ = స్ఫేష్ఠః = ప్రచురమైన . 

4🥀 ఉరు +ఇష్ఠ =  వరిష్ఠః . మిక్కిలి గొప్పవాడు.

5🥀 బహుళ +ఇష్ఠన్ "= అతిశయేన బహుళః.

       బంహిష్ఠః .= మిక్కిలి వృద్ధి పొందిన.

6🥀 గురు + ఇష్ఠన్ = గరిష్ఠః ."= మిక్కిలి గురువైన

7🥀వృద్ధ + ఇష్ఠన్ = వర్షిష్ఠః ""=మిక్కిలి వృద్ధుడు.

8🥀 తృప + ఇష్ఠన్.= త్రపిష్ఠః = మిక్కిలి సిగ్గుపడ్డం.

9.🥀దీర్ఘ + ఇష్ఠ = ద్రాఘిష్ఠః .మిక్కిలి పొడవైన.

10🥀బృందారక + ఇష్ఠ = బృందిష్ఠః. బృందారక శబ్దానికి "బృంద" అన్న ఆదేశం వచ్చింది.

11🥀 శ్రేష్ఠః . అతిశయేన ప్రశస్యః.మిక్కిలి ప్రశంసింప దగినవాడు.

 ఇలా ప్రయోగసిద్ధాలైన  అనేక క్రొత్తప్రయోగాలు మూడులింగాల్లోనూ కవులు సేవించవచ్చు. 

యస్తే దదాతి రవ మస్య వరం దదాసి ....

0 comments

 జైశ్రీరామ్.

రెంటాల సాంబశివరావు గారికి నమస్కృతులతో.

శ్లో.  యస్తే దదాతి రవ మస్య వరం దదాసి

యో వా మదం వహతి తస్య దమం విధత్సే।

ఇత్యక్షర ద్వయ విపర్యయ కేళి శీల!

కిం నామ కుర్వతి నమో న మనః కరోషి।।

ఈ శ్లోకం లో అక్షరద్వయం విపర్యం అవడం గమనించండి...

యః - ఎవ్వడైతే,

తే - నీకు,

రవం - ధ్వనిని,

దదాతి - ఇస్తాడో,

తస్య - వానికి,(రావణునికి),

వరం - వరాన్ని,

దదాసి - ఇస్తావు.

యః వా - ఎవ్వడైతే,

మదం - గర్వాన్ని,

వహతి - పూని ఉంటాడో,

తస్య - వానికి

,(యముడు,భస్మాసురుడు వంటి వాళ్ళకి),

దమం - అణచివేయుట అనే శిక్షని,

విధత్సే - విధిస్తావు కదా!

ఇతి - ఈ విధంగా,

అక్షర ద్వయ - అక్షరముల జంటను,

విపర్యయ - మార్చుట అను,

(రవం-వరం ;

మదం - దమం;

నమః - మనః)

కేళి- విలాసములో,

లోల - తేలియాడేవాడా!

ఓ దేవా! శివా!

నమః - నమస్కారం,(నమః),

కుర్వతి - చేయునట్టి (నా పట్ల),

మనః - మనస్సు పెట్టుట,(మనః)

న కరోషి - చేయవు,

కిం నామ - ఎందుకో గదా।।

జగద్ధర భట్టు అనే కవి ఈ శ్లోకంలో శివుని వ్యాజస్తుతి చేస్తున్నాడు,

"ఓ దేవా! శివా! నిన్ను గురించి రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తేటప్పుడు 

పెద్దగా అరిచాడు.("రవం" చేశాడు)(-అందుకే "రావణుడు"అయ్యాడు).

వానికి"వరం" ఇచ్చావు.

గర్వించిన("మదం"తో విర్రవీగిన)రాక్షసులని అణచివేశావు ("దమం").

ఈ విధంగా జంట అక్షరాల పదాలతో ఆటలాడుకునే లీలావిలాసము గల 

ఓ దేవా! పరమేశ్వరా! 

అదే విధంగా నేను నీకు నమస్కరిస్తే ("నమః") నా పట్ల నీవు ఎందుకు 

మనస్సు ("మనః")పెట్టవో గదా!!

జైహింద్

ఖలః సర్షప మాత్రాణి....మేలిమి బంగారం మన సమ్స్కృతి.

0 comments

జైశ్రీరామ్.

 సుభాషితమ్

శ్లో|| ఖలః సర్షప మాత్రాణి - పర చ్ఛిద్రాణి పశ్యతి|
ఆత్మనో బిల్వ మాత్రాణి - పశ్యన్నపి న పశ్యతి||
తే.గీ.  దోష మావంతయున్ గనున్ దురితుఁ డన్యు
లందుఁ, గన నేరఁడే తన యందుఁ గలుఁగు
బిల్వ ఫలమంత దోషమున్, వింత యిదియె,
యాత్మవంచన, పరనింద, యఘము కాదె?
భావము. మూర్ఖుడు ఇతరులలోని ఆవగింజంత దోషాన్ని కూడా చూచును. తనయందు 
మారేడు పండంత దోష మున్ననూ చూసి చూడనట్లే వ్యవహరించును.

జైహింద్.

ఇష్టావధానము. .... చింతా రామకృష్ణారావు. 23 జులై, 2021 4:26 PM

0 comments

జైశ్రీరామ్. 

1. నిషేధాక్షరి :-

భ, ర,ల,వ,శ,ష అక్షరాలు ఎక్కడా రాకుండా సరస్వతీ దేవిని సంబోధిస్తూ కంద పద్యంలో స్తుతించండి. 

కం. బాసకు మాత మదంబయె ,
నే సంస్తుతి చేయ, జనని నిత్యానందం
బే సమధికముగనిడునుగ,
బాసించును మదముగ మది పండించు కృతిన్.

2. సమస్య:-

బంధంబున్ పెనవేసుకొంచు జగతిన్ బ్రఖ్యాతుఁడౌ యా ఫిరోజ్
గాంధీ చిత్తము గెల్వ నెంచి విలసత్ కల్యాణి యా యిందిరా
గాంధీ పాపిట దీసి దువ్వుకొనె రాగం బొప్ప కేశoబులన్,
సౌందర్యమ్మది మోమునన్ మనమునన్ చూపట్టుటొప్పున్ గదా.

3. దత్తపది:-

ఇదిగో! బీరముచూపుటొప్పు నని నీవేలా గనన్ నేరవో?
మది చింతింపగ రాదుధాత్రిపయి ధర్మం బీర నిల్పన్ వలెన్,
మదులన్ జిక్కుడు పంచకంబన మిమున్, మన్నించి చేయన్ దగున్,
మది మన్నించుట మాటలోర్చుటయును క్షేమంబౌనొ? చింతింపుమా.

4,వర్ణన :-

కుట్టు సూదిని సీసా పద్యంలో వర్ణించండి
ఆధునికతకిలననుపమ వస్త్రంబె సాటి లేనిది కన సంఘమందు,
అట్టి వస్త్రంబును కుట్టెడి సూదికి గలబెజ్జమింతె, తా కానరాదు,
ఆబెజ్జమందునామరిన్ దారమేవ్ పట్టుగా బట్టను పట్టి నిలుపు,
శస్త్రచికిత్సకున్ పట్టైఅ దారంబు కుట్టాఅ సూదియె గట్టిదిలను,
నూది కాలిలో ముల్లును సులభగతిని
తీయ నుపయోగపడుచు నమేయమైన
ముఖ్యమైనట్టి పనిముట్టు పూజకొఱకు
పూలుగ్రుచ్చుటకుది తగు,పూజ్యులార!

5. న్యస్తాక్షరి :-

1పాదం -13 - వి
2పాదం -14- ద్యా
3పాదం -7-దే
4పాదం - 3-వీ అనే అక్షరాలను ఉపయోగిస్తూ 
మత్తేభ వృతంలో నేటి విద్యా వ్యవస్థ తీరు తెన్నులను వర్ణించoడి .
విద్యా వ్యవస్థ తీరు తెన్నులను వర్ణించoడి .
జయమార్గంబును వీడె బోధనము(౧౩)విశ్వాసంబు క్రోల్పోయె, నే
డయినన్ గానదునేర్వదీ ప్రభుత, వి(౧౪)ద్యాసంస్థలన్ బోధనన్
ప్రియమున్ గొల్పర(౭)దేలనో?శుభగతిన్, విశ్వాసమున్ గొల్పగా,
ప్రియ(౩)వీణావరపాణి సత్కృయె ప్రాప్తించంగ వాంఛించెదన్.

6. ఆశువు:
మొబైల్ ఫోన్ వ్యసనానికి గురైన యువత స్థితిని వర్ణిస్తూ ఒక పద్యాన్ని చెప్పండి
చరవాణీసమలంకృతాద్భుతకరుల్, చాంచల్యచిత్తుల్, ప్రవి
స్తర లోకజ్ఞులు, నిత్యభాషణచణుల్ తాదాత్మ్యతన్నైహికం
బరయంనేరని జాలవర్తనులు దాహంబైన కానంగలే
రరయంగావలెశ్రీహరీ యువతనీయాపన్నులన్ గావగన్.

2.ఆశావాద దృక్పథం గొప్పతనాన్ని వివరించండి
ఆశ గలవారలెపుడు నిరాశపడక
సాధనముచేయుచుందురు చక్కగాను,
భాషణంబునసౌమ్యులై వరలుచుండి 
సిద్ధసంకల్పులగుదురు. చిత్రమిదియె.

శ్రమైక జీవన సౌందర్యాన్ని వివరించండి
పొందుడు శ్రమైక జీవన 
సౌందర్యము సుజనులార! శాశ్వత సుఖులై
యుందురు సతతము భువిపయి,
నందంబది జీవికిల యనంతశుభదయై.

7.చిత్రానికి పద్యం:-
జీవనాధారమౌ వృక్ష మీవె నరుక
నీదు ఆత్మయే నిన్ను సమాధి చేయు,
వృక్షములు పెంచి కాంచుము వృద్ధి నీవు,
తప్పునెఱుగుచు మానుము, ముప్పు తప్పు.

8.అప్రస్తుతం:-

అందరూ పైకి రావాలి అని కోరుకునే వారెవరు ?
కొందరు మంచివారితో సంచైంచేవారు,

అశోకుడు అంటే ఓ రకంగా మూర్ఖుడు అని అర్థమా?
మూర్ఖుఁడు నిత్యశోకుఁడు, ఎవరిమీదో ఒకరిమీద అలా ఏడుస్తూనే ఉంటాడు. 
అట్టి వాడు కాని వాడు అశోకుఁడు..

భర్త భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తోంది. భర్త పశువ అన్నాడు. భార్య కోతి అంది. 
వారి మాటల్లో ఆంతర్యమేమిటి"
పరిశుద్ధాత్మవై వడ్డించుదానా. అన్నాడు భర్త,
కోరినంత తినండి అంది భార్య.

సన్యాసికీ, సన్నాసికీ తేడా ఏమిటి?
సంసారంనుండి విడువడిన మనసు కలవాడు సన్యాసి,
సంసారంలోనే ఉంటూ విడువలేక నిత్యం బాధలు పడేవాడు సన్నాసి.

జైహింద్.

మల్లారెడ్డి రచించిన షట్చక్రవర్తి చరిత్ర లోని ఏకాక్షర కందం ద్వక్షర కందం #...

0 comments

జైశ్రీరామ్
జైహింద్

చిరంజీవి ఉప్పలధడియం భరత్ ద్విగుణిత అష్టావధానము.

0 comments

 జైశ్రీరామ్

జైహింద్.

విద్యాదేవత ... సరస్వతీ సూక్తము .... భావము.

0 comments

 జైశ్రీరామ్.

విద్యాదేవత

సరస్వతీ దేవి విద్యాధి దేవతగా ఆరాధింప బడుచుండుట అనాదిగా వచ్చిన 

సంప్రదాయము.  మానవజాతి ఉచ్చరించిన మొదటి వాజమ్యమగు 

ఋగ్వేదమునందే జ్యోతిర్మయమై, శబ్దమయమై, బహురూప సమన్వితమైన 

సరస్వతీదేవి దర్శనమిచ్చును. మొట్టమొదటగా సరస్వతిని దర్శించిన 

ప్రాచీన ఋషులు చేసిన సంకీర్తనములలో కొంత భాగము నేడు మనకు 

లభ్యమయిన ఋగ్వేద సంహితయందు ఋక్కుల రూపమున 

లభ్యమగుచున్నది.  ఈ ఋక్కులు భావగర్భితములు, మంత్రశక్తి సంపన్నములు.

స్వయం సంపూర్ణమైన మూర్తిని ప్రతిపాదించునవి కనుక ఋగ్వేదమందలి 

సరస్వతీ సూక్తమునకు గల ప్రాధాన్యమును గూర్చి వేరుగా నొక్కి చెప్పనక్కరలేదు.  

సరస్వతీ సూక్తపారాయణము సర్వవిద్యా ప్రదాయకమై మనోవాక్కాయ కర్మలను 

పవిత్రము చేసి భోగ మోక్షము లను ప్రసాదించును. మననుండి ఉచ్ఛ్వాస 

నిశ్వాసలు అప్రయత్నముగా నెట్లు వెలువడునో అట్లే కంఠధ్వనియు, 

దానిచే నిర్మితములయిన అకారాది క్షకారాంతము వర్ణములును వెలువడును. 

వాని యందు అంతర్వాహినిగా భావస్వరూపమై సరస్వతి ప్రవహించి ఉచ్ఛారణ 

రూపమునొందును. క్రమశిక్షణ, సంస్కారము,వాజ్మయ రూపమున నీమె 

నుపాసించువారి నోటివెంట శుభములే వెలువడును. శత్రుత్వము, విభేదము, 

రాగ ద్వేషాదులు కల్గించు వాక్కులు గాని, వానిని పుట్టించు భావములు కాని    

సంభవింపవు.  అంతర్వాహినిగా ప్రవహించి వచ్చుచున్న ఈ సరస్వతి వేగము 

ఊహ కతీతము. ఆమె నుపాసించువారి బుద్ధి వేగము కూడ నట్టిదే.

 కవుల వాక్కులలో అర్ధ తాత్పర్యములనబడు తీరములను బ్రద్దలు కొట్టుకొని 

ఈ నది పరవశయై ప్రవహించును.తామరతూళ్ళు తిన్న హంస కంఠధ్వనులు

(శ్వాసనుండి పుట్టిన కంఠధ్వనులు) ఈమె నుండి వెలువడును. 

బాహ్య ప్రపంచమున జీవుడు వాక్కుల రూపమున వ్యవహారము చేయును. 

వాని లోపల నియమ రూపమైన సరస్వతి గృహము నందున్న భార్యవలె 

కనపడకుండ దాగియుండిఅన్నిటిని సమకూర్చి పెట్టుచుండును. 

ఇందలి మంత్రములు ఋగ్వేద సంహిత లోనివి. మంత్రము చివరి అంకెలు 

ఋగ్వేద మందలి మండలము, సూక్తము,ఋక్కులను సూచించును.

సరస్వతీ సూక్తము

ఋగ్వేద మంత్రము.

అర్ధము

ఇయ మదదాత్ రభస మృణచ్యుతమ్

దివో దాసం వధ్ర్యశ్వాయ దాశుఅషే

యా శశ్వంత మా చఖాదావసం పణిమ్

తాతే దాత్రాణి తవిషా సరస్వతి

 ( 6-61-1)

వధ్ర్యశ్వునకు ఋణవిమోచనము కలిగించి దివోదాసుడను 

పుత్రుని ప్రసాదించినయీ సరస్వతి, శాశ్వమైన ఆయువునొసగి 

సంపన్నునిగాజేసినది. నీసామర్ధ్యము, నీ దానగుణము ఉదాత్తము 

( అట్టి నీకు నమస్కారము)

ఇయం శుష్మేభి ర్బిసఖాఇవారుజత్

సానుగిరీణాం తవిషేభిర్మిభి:

పారవతఘ్నీమనసేసువృక్తిభి: 

సరస్వతీమావివాసేమధీతిభి: (6-61-2)

గిరిసానువుల పైకినెగిరిన అలలతోఈ సరస్వతివేగమున ప్రవహించుచుండగా

తమ్మితూడులను దిన్న్ఝ్హ్ఝహంసల ఋతములు పుట్టుచున్నవి. 

కూలములనొరసికొని బ్రద్దళూ కొట్టగల వేగమున ప్రవహించు నీ 

సరస్వతి రూపమున వసింతుముగాక! బుద్దిబలము రూపమునమేము 

ఎడబాటులేక ఆమెయందు వసింతుముగాక. 

సరస్వతి దేవనిదో నిబర్హయ

ప్రజాంవిశ్వస్య వృసయస్యమాయిన:

ఉతక్షితిభ్యో ననీరనిందో

విష మే భ్యోఆస్రనో వాజినీవతి (6-61-3)

వేగవంతములైన ప్రవాహములు గలదానా! సర్వసతీ ! దేవతలను 

నిందించువారిని చీల్చుము. అసుర మాయల నుండి సర్వజీవులను 

రక్షింపుము. క్షీణదశనుండి నదులను కాపాడుము. మిట్టపల్లములనుండి  

జలములను కాపాడుము. 

ప్రణోదేవీ సరస్వతీ

వాజేభిర్వాజినీవతీ

ధీనామవిత్ర్యవతు  (6-61-4)

వేగవంతములైనప్రవాహములు యగు సరస్వతి మా బుద్దులను 

పరిపాలించునదియై, తనప్రవాహవేగములతో మ్ముకాపాడు గాక!

యస్త్యాదేవి సరస్వతి

ఉపబ్రూతే ధనేహితే

ఇంద్రం నవృత్ర తూర్యే (6-61-5)

ఓ సరస్వతీ! యుద్దమునవృత్రుని జయించిన ఇంద్రుని స్తుతించునో నిన్నెవడు 

స్తుతించునో అతనికి ధనము, హితము కలుగును

త్వందేవి సరస్వత్యనా

వాజేషు వాజిని

రదా పూషేన: సనిమ్ ( 6-61-6)

ఓ సరస్వతీ! వేగవంతులైనదేవతల సృష్టిలో నీవు వేగముయెక్క

స్వరూపము గలదానవు. అట్టి నీవు మమ్ము రక్షింపుము. పూష అను దేవతను 

స్తోత్రము చేసిన ఫలితమువలె మాకు పంటిక్రిందికి నిలుచున్నట్టి  

ఆహారమును ( మంచి యుచ్చారణతో వాజ్మయ స్వరూపమగు జ్ఞానమును ) 

దానము చేయుము.

ఉతస్యాన: సరస్వతిఘోరా హిరణ్యవర్తిని:

వృత్రఘ్నీవష్టి సుష్టుతిమ్ (6-61-7)


కిరణమయములైన అంచులు కలిగి ప్రవర్తించు చున్న సరస్వతి రూపము 

వృత్రాసురుని వధకై ఏర్పడినది.  అట్టి ఘోర రూపము స్తుతిపాత్రమై 

వసించును గాక!

8. యస్యా అనంతో అహృతస్తు

ఏష శ్చరిష్ణు రర్ణవ: |

అమశ్చరతి రోరువత్ ||ఋ 6-61-8

ఏ సరస్వతి యొక్క అనంతమైన సముద్రాకృతి అపహరింప వలనుపడదో; 

మహారావము చేయుచు మాయందు సహవసించి చరించు చున్నదో 

అట్టి తత్త్వము మమ్ము రక్షించుగాక!

సానో విశ్వా అతిద్విష:

స్వ సౄరన్యా ఋతావరీ

అతన్న హేవ సూర్య: ||  ఋ 6-61-9

విశ్వమున ద్వేషించువారిని జయించి, వారి సోదరీ గణమైన స్వేచ్ఛాప్రవృత్తి గల 

స్వైరిణులను గూడ తిరస్కరించి, అన్యులను అతిక్రమించి ఋతముచేత 

ఆవరింపబడినదై మించును గాక: అహస్సును సూర్యుడతిక్రమించువట్లు 

అతిక్రమించును గాక!

ఉత న: ప్రియా ప్రియాసు

సప్త స్వసాసు జుష్టా

సరస్వతీ స్తోభ్యాభూత్ ||   6-61-10

ఏడుగురు సోదరీమణులతో కూడినది, నిత్య సంతోష స్వరూపిణి, 

మాకు ప్రియులైన దేవతలలో ప్రియతమమైనది యగు సరస్వతి 

ముక్తకంఠములైన మా కీర్తనములకు లక్ష్యమగు గాక!

ఆ పప్రుషీ పార్థివాని

ఉరు రజో అంతరిక్షమ్

సరస్వతీ నిదస్పాతు  ||ఋ6-61-11

సరస్వతి సర్వాంతర్యామి భావమై పూరణము చేయుచున్నది కనుక, 

నిందలనుండి అనగానిందలు జేయు స్వభావము నుండి ఎల్లరను రక్షించి 

మంచి వాక్కుగా వెలువడుగాక

త్రిషధస్థా సప్త ధాతు:

పంచ జాతా వర్ధయంతీ

వాజే వాజే హవ్యాభూత్ ||  6-61-12

మూడు నివాసముల యందున్నదియు, ఏడుగురు బ్రహ్మలకు 

ఐదు జాతుల రూపమున నుద్భవించుచున్నదియు నగు సరస్వతి 

వేగమునకొక్క హవిస్సు రూపమున వర్ధిల్ల జేయునది అగుగాక ! 

దేవీం వాచ మజనయంత దేవా: తాం

విశ్వరూపా: పశవో వదంతి |

సానో మంద్రేష మూర్జం దుహానా ధేను:

వాగస్మానుప సుష్టు తైతు ||  8-100-11

దేవతలు దేవియగు వాక్కును పుట్టించిరి.  విశ్వరూపులైన జీవులు ఆమెను 

ఉచ్చరించుచున్నారు.  మాలో అంతర్లీనమైన కుతూహల స్వరూపమై యుండి 

పాడియావు వలెనిలిచి యున్న ఈ వాక్కు తన్ను చేరనిచ్చి మాచే స్తుతింపబడినదై 

ఆత్మ శక్తిగా మమ్ములను పొందుగాక !

చత్వారి వాక్పరిమితా పదాని

తాని విదుర్బ్రాహ్మణా యే మనీషిణ: |

గుహా త్రీణి విహితా నేంగయంతి

తురీయం వాచో మనుష్యా వదంతి || ఋ 1-164-45

మన వాక్కునకు గల పదములన్నియు నాల్గు విధములుగ నున్నవి.  

అందు మూడు గుహయందుంచబడినవై కదలిరావు.  నాల్గవరూపము అగు 

వాక్కునుమనష్యులు పలుకుచున్నారు. ఎవ్వరీ నాల్గు వాక్కులను తెలియుదురో 

వారే వేదమను ప్రజ్ఞగల బ్రాహ్మణు లనబడుదురు.

ఉతత్వ:  పశ్యన్ న దదర్శ వాచమ్

ఉతత్వ: శృణ్వన్ న శృణోతి ఏనామ్ |

ఉతోత్వస్మై తన్వం విసస్రే

జాయేవ పత్యు: ఉశతీ సువాసా: ||    ఋ 10-71-4

మానవుడు ఈ వాక్కు అను దేవతను చూచుచునే దర్శనము చేయడు. 

వినుచునే ఈమెను వినడు. ఐనను, వానియందు వినుచు, వానియందు వినబడుచు

చక్కని నివాసమందు మంచి భార్యవలె నీమె వానియందు ప్రవేశించి యున్నది.

అంబీతమే నదీతమే దేవితమే సరస్వతి |

అప్రశస్తా ఇవ శ్మసి ప్రశస్తిమ్ అంబనస్కృధి ||   ఋ 2-41-16

సరస్వతీ! నీవు ఉత్తమమైన మాతృదేవతవు; నదులలో శ్రేష్ఠమైన దానవు; 

దేవతలలో ఉత్తమురాలవు; నీవప్రకాశమూర్తివలె నున్నావు. ఐనను

మాకు ప్రశస్తిని కలుగజేయుము.

పావకా న: సరస్వతీ

వాజేభిర్వాజినీవతీ

యజ్ఞం వష్టు ధియావసు: ||ఋ   1-3-10

ఓ సరస్వతీ!  నీవు పవిత్రము చేయగల స్వభావము గలదానవు.  

వేగవంతములలో వేగస్వరూపమై దాగియున్న శక్తిని, బుద్ధి బలము చేత

నిర్వహింప బడినదై నీ స్వరూపము సంపత్కరమై మా యజ్ఞమునందు 

వసించి యుండును గాక!

ఆనో దివో బృహత: పర్వతా దా

సరస్వతీ యజతాగంతు యజ్ఞమ్ |

హవం దేవీ జుజుషాణా ఘృతాచీ

శగ్మాంనో వాచముశతీ శృణోతు ||     ఋ  5-43-11

మా యజ్ఞమున స్తుతింపదగిన దేవియగు సరస్వతి వెలుగుల లోకమునుండి 

దిగివచ్చును గాక! ఎత్తైనపర్వతము నుండి దిగివచ్చును గాక! దిగివచ్చుటకై 

నా పిలుపును అనుసరించినదై, నేతిచే పదను చూపినదై, సుఖకరమైన 

నా వాక్కు నందు వసించుచు ఈ వాక్కును వినుగాక!

జైహింద్.

సరస్వతీదేవి గురించి మీకు తెలియని నిజాలు ..

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సరస్వతీ వైభవము...బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మSarswathi Vaibhavam Navarathrulu 2014

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సరస్వతి వైభవం | wonder gods |

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

లేఖాః ప్రాగాయతాః పంచ రేఖాః ..... ఈ శ్లోకము పూజా సమయంలో స్వస్తిక్ గుర్తు వేసెడి వివరణము.

0 comments

 జైశ్రీరామ్. 

ఈ శ్లోకము పూజా సమయంలో స్వస్తిక్ గుర్తు, 

దానికి తూర్పున ఏనుగు కుంభస్థలాకారము, 

పశ్చిమమున కలశాకారము వచ్చునట్లు రేఖలు వేయవలెను.

శ్లో.  లేఖాః ప్రాగాయతాః  పంచ రేఖాః  పంచోదగాయ తాః 

రేఖే ద్వే కోణతాః కోణే  తిర్యగ్రేఖా చతుష్టయమ్  

పశ్చిమే కలశాకారం పురతో గజ కుంభవత్ 

పదాత్ పార్శ్వ గతో యేన  యిదం స్వస్తిక లక్షణమ్.

ఈ శ్లోకము వినాయకునికి చెందిన పూజలలో ఎక్కడైనను ఉండవచ్చు. 

లేక లింగ పురాణంలో ఉండవచ్చును.

ఆయతాః = పెద్దవైన, 

పంచ రేఖాః = ఐదు గీతాలు, 

ప్రాక్ = తూర్పునకు; 

ఆయతాః = పెద్దవైన, 

పంచ రేఖాః = ఐదు గీతాలు, 

ఉదక్ = ఉత్తరమునకు (మధ్యలో కలియునట్లు వేయవలెను).

రేఖే = గీతలలో, 

ద్వే కోణే = రెండు మూలలయందు 

( తూర్పు రెండు మూలలు, ఉత్తరము రెండు మూలలు ప్ర

త్యేకముగా రేఖలు అని అర్థము స్వీకరించవలెను), 

చతుష్టయం = నాలుగు దిక్కులు కలియునట్లు రెండు గీతలు 

(కలియునట్లు వేయవలెను).  

పదాత్  = మార్గముల నుండి, 

పార్శ్వగతః = ప్రక్కలకు వెళ్ళునట్లుగా, 

తిర్యక్ = అడ్డముగా, 

రేఖాః = గీతలు ( వేయవలెను). 

యేన = ఈ ప్రకారముగా గీయటచే, ( ఏర్పడు ఆకారము), 

స్వస్తిక లక్షణమ్ = స్వస్తిక అను (గుర్తు) బంధము 

ఏర్పడుటకు లక్షణము. (ఈ స్వస్తిక గుర్తునకు) 

పురతః = ముందు భాగములో ఏనుగు కుంభస్థలము వలె, 

పశ్చిమే = పడమర వైపునకు, 

కలశాకారం = కలశము ఆకారములో, 

రేఖాః = గీతలు, ( వేయవలెను). 

పూజా సమయంలో స్వస్తిక్ గుర్తు, 

దానికి తూర్పున ఏనుగు కుంభస్థలాకారము, 

పశ్చిమమున కలశాకారము వచ్చునట్లు రేఖలు వేయవలెను.

జైహింద్.

భూజాతేఽ లసమాన విగ్రహయుతః ..... చమత్కార శ్లోకము.....వివరణ.

0 comments

 జైశ్రీరామ్

సీతా రావణ సంవాదఝరి!

ఒక అద్భుత సంస్కృత కావ్యం

అశోక వృక్షం క్రింద వున్న సీత దగ్గరకు వచ్చిన రావణుడు రాముని నిందించడం 

ఆత్మస్తుతి చేసుకోవడం మొదటి మూడు పాదాల్లో వుంటుంది!

సీత “ఓ మూర్ఖుడా! నీ మాటలలో ఫలానా అక్షరాన్ని తీసేయ్!” అంటుంది. 

అంతే మొత్తం అర్థం మారిపోతుంది! రామనింద రామస్తుతిగా మారుతుంది! 

రావణుని ఆత్మస్తుతి స్వనిందగా మారుతుంది!

అద్భుతమైన ఈ 50 శ్లోకాలను వ్రాసిన వారు కర్నూలు జిల్లా ఔకు గ్రామవాసి 

కీ.శే. బచ్చు సుబ్బరాయగుప్త!

ఆంధ్ర టీకా తాత్పర్యం వ్రాసిన వారు కర్నూలు వాసి అష్టావధాని 

కీ.శే. పుల్లాపంతుల వేంకట రామ శర్మ!

  1  (_ల)

భూజాతేఽ లసమాన విగ్రహయుతః సీతేహ్యలర్కోపమః

భర్తా తే వికలస్వర స్వవదనో యుద్ధే చలశ్రీవృతః।

నిష్ణాతో లలనానురూప తను సంయుక్తో స్మ్యహం పాలనే

వాక్తే పాప! సదావిలేతి సుజనాః కే న బ్రువంతి క్షితౌ!

ఉన్నది ఉన్నట్టుగా చూస్తే

రావణోక్తి: రామనింద

అలసమాన విగ్రహయుతః = ప్రకాశించని విగ్రహము కలవాడు

అలర్కోపమః = పిచ్చి కుక్కతో సమానుడు

వికలస్వర స్వవదనః = నోరెత్తి మాటలాడలేనివాడు

చల శ్రీవృతః = సంపద తొలగినవాడు

రావణ ఆత్మస్తుతి:

పాలనే నిష్ణాతః = పాలనా దక్షుడను

లలనానురూప సంయుక్తః = స్త్రీలకు మనోహర సౌందర్యము కలవాడను

సీత ప్రత్యుక్తి.

అవిలా = ఎప్పుడునూ కలుషమైనది (రావణునిమాట) అని సామాన్యార్థం

విశేషార్థం.

అవిలా = లకార రహితమైనది

ఇప్పుడు అన్నింటా లకారాన్ని తీసివేసి చూద్దాం.

అసమాన విగ్రహయుతః = సాటి లేని శరీరము కలవాడు

అర్కోపమః = సూర్య సమానుడు

వికస్వర స్వవదనః = ప్రకాశించు కంఠధ్వని కలవాడు

శ్రీవృతశ్చ = సంపద్యుక్తుడు

అని రామస్తుతిగా మారింది

ఇక ల తీసేస్తే రావణుడేమైనడో చూడండి

నానురూప తను సంయుక్తః = అనర్హ శరీర యుతుడను

పానే నిష్ణాతః = మద్య పాన నిరతుడను

అని రావణ ఆత్మస్తుతి ఆత్మనిందగా మారింది

ఇంతటి అద్భుతాలు చేసిన కవులున్నారు! అటువంటి వారికి శిరసా నమామి! 

జైహింద్.

ముక్తావిద్రుమ హేమనీల.... శ్లోకమునకు నా పద్యానువాదము. 09 - 10 - 2018.

3 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః

యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం !

గాయత్రీం వరదాభయాంకుశ కళాః శుభ్రం కపాలంగదాం 

శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వ హంతీంభజే !!

సీ. ముత్యమ్ము పగడమ్ము పుత్తడి నీలమ్ము వజ్ర వర్ణములొప్పు పంచ ముఖిని,

మూడు కన్నులతోడ పొడమెడి  తల్లిని, చంద్ర రత్న మకుట చంద్రముఖిని,

తత్వార్థ వర్ణాత్మ తానై ప్రకాశించు సత్వ స్వరూప మహత్వ నిధిని.

పాశాంకుశంబులన్, వర కపాలంబును, గద శంఖము చక్రముల్ కలిగి మరియు  

తే.గీ. కరములన్ బద్మ యుగళంబు కలుఁగు జనని 

నమిత ప్రేమామృతోదధి నఖిల జగతి

నలరు సద్యుక్త గాయత్రి నమిత శక్తి

నహరహమ్మును సేవింతు నమిత భక్తి.

భావము. ముత్యము, పగడము, బంగారము, నీలము శ్వేత 

వర్ణములతో నొప్పియున్న ఐదు ముఖములు కల జననిని, 

మూడు కన్నులతో నొప్పియున్న మాతను, చంద్రమణియుక్త 

మకుట ధారిణియైన చంద్రుని పోలు ముఖముతో ప్రకాశించు లోకేశ్వరిని, 

తత్వ ప్రబోధాత్మకములగు వర్ణచయము తానో అయి ప్రకాశించెడి 

సత్వ భావముతో ప్రకాశించు మహత్వమునకు స్థానమైన అమ్మను, 

పాశము అంకుశము, కపాలము, గద, చక్రము, 

పద్మద్వయములతోనొప్పియుండెడి లోకమాతను, అనంత ప్రేమ వారాశియై 

సమస్త్అజగతిని అలరుచున్నటువంటి ఒప్పిదమై యున్నట్టి అమితమైన 

శక్తి స్వరూపిణియైన గాయత్రీమాతను అమితమైన భక్తితో నేను 

ప్రతీ దినమూ సేవించెదను. 

జైహింద్.

సన్నిందా సతి నామవైభవ కథా...... నామమంత్ర సాధకులు చేయరాని పది దోషములు.

0 comments

 జైశ్రీరామ్.

దశాపరాధాలు

శ్లో.  సన్నిందా సతి నామవైభవ కథా శ్రీశేశయో ర్భేదధీ

రశ్రద్ధా శ్రుతిశాస్త్ర దైశిక గిరాం నామ్న్యర్థ వాద భ్రమః

నామాస్తీతి నిషిద్ధ వృత్తి విహిత త్యాగో హి ధర్మాంతరైః

సామ్యం నామ్ని జపే శివస్యచ హరే ర్నామాపరాధా దశ॥  

(భాగవతము)


భావము.

‘మంచివారిని నిందించుట, చెడ్డవారికి దైవ నామ 

వైభవ కథనము, శివకేశవ భేదబుద్ధి, వేదములయెడ అశ్రద్ధ, 

శాస్త్ర ములయెడ అశ్రద్ధ, దేశికులమాటలయందు 

అశ్రద్ధగానుండుట, మాటలాడునపుడు శ్రద్ధ లేకపోవుట,, 

శివకేశవ నామార్థవాద భ్రమ, చేయకూడని కర్మాచరణం, 

చేయవలసిన కర్మలను విడిచిపెట్టుట. పరిత్యాగం, 

ధర్మాంతర సామ్యం’. ఇవి 

దశాపరాధాలు.భగవన్నామ మంత్ర 

సాధకులు చేయరాని పనులు.

జైహింద్.

*సూర్యుండా యుదయాద్రి నెక్కి పొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్.*.... నా పూరణ.

0 comments

జైశ్రీరామ్. 

ఓం నమో నారాయణాయ.🙏

సమస్యాపూరణ.
👇
శా.  ఆర్యుల్ నిన్ జపియించ తర్పణవిధిన్, హాయిన్ బ్రసాదించుచున్,

కార్యోద్భాస మనోజ్ఞ దీక్షితుడవై కాంతిన్ గృపన్ జిందుచున్,

సౌర్యంబొప్పగ పశ్చిమాద్రికి జనన్, సాయంత్ర వేళంచు నో

*సూర్యుండా! యుదయాద్రి నెక్కి పొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్.*

జైహింద్.

యత్ర విద్వజ్జనో నాస్తి శ్లాఘ్యస్తత్రల్పధీరపి,... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  యత్ర విద్వజ్జనో నాస్తి శ్లాఘ్యస్తత్రల్పధీరపి,

నిరస్త పాదపే దేశే హేరండోపిద్రుమాయతే.

తే.గీ.  పండితులు లేని సభల నపండితుండె

గౌరవంబును పొందును ఘనతరముగ,

వృక్షములులేని చోటులో వెలసియుండు

నాముదముచెట్టె ఘనవృక్షమనుట నిజము.

భావము.

వృక్షములే లేని ప్రదేశములో ఆముదముచెట్టున్నను అది గొప్పదఘ. అటులనే 

పండితులయినవారు లేని సభలలో అల్పజ్ఞులును గౌరవింపబడుదురు.

జైహింద్.

కవయిత్రి శ్రీమతి కటకం విజయలక్ష్మీవేంకటరామశర్మ కృత శ్రీ సూక్త పద్యానువాదము పై నా అభిప్రాయము.

0 comments

 ఓం శ్రీమాత్రే నమః.

శ్రీ సూక్త పద్యానువాదము

కవయిత్రి శ్రీమతి కటకం విజయలక్ష్మీవేంకటరామశర్మ.

శా.  శ్రీమన్మంగళభావనాభరితమౌ శ్రీసూక్తమాంధ్రమ్మునన్

క్షేమంబున్ గననెంచుచున్ విజయలక్ష్మీ మాత చే పట్టె తా

శ్రీమాతృకృపఁజేసి వ్రాయుటకునై,  సిద్ధించెనాకోర్కె,  యీ

స్త్రీమూర్తిన్ శుభసంహతుల్ వడయుతన్, శ్రీమాత దీవించుతన్.

     శ్రీమాత అనుగ్రహ ఫలముగా బ్రహ్మశ్రీ కటకం వేంకటరామశర్మ మహోదయుల అర్థాంగలక్ష్మి శ్రీమతి విజయలక్ష్మీ మాతకు శ్రీసూక్తమున కాంధ్రపద్యానువాదము చేయవలెనను తలంపు కలుగుట లోకకల్యాణకారణమయినది. వైదికవాఙ్మయమున ప్రసిద్ధమయిన శ్రీ సూక్తమును భావన చేయుచూ చదువుటకు కష్టమగుటచే మాతృభాషలోనికి అనువదించి సులభతరము చేయుటకు పూనుకొని, చక్కని తెలుఁగు ఛందస్సులయిన సీసము తేటగీతి మున్నగు వాటిలో భావస్పోరకముగా విరచించి తన జన్మను చరితార్థము చేసుకొనగలిగిన పుణ్యమూర్తి యీ కవయిత్రి.

     వీరి అనువాదము మూలమునకు అద్దముపట్టుచున్నట్లొప్పియున్నది. ఈ విధముగా వ్రాయుట బహు క్లిష్టతరము. ఎంతయో అవగాహన చేసుకొనినగాని యీ విధముగా వ్రాయుట సులభము కాదు.

మనము పరికించినచో ఈ విషయము అవగతమగును.

.సూక్తము.  

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ

అను సూక్తమునకు

ఓ అగ్నిదేవా! బంగారపు రంగుకలిగిన పాపాలను హరించేది, బంగారము మరియు వెండి ఆభరణాలతోఅలంకరించబడినది,చంద్రునిలా చల్లగా ఉండేది, బంగారముతో కూడినది అయిన లక్ష్మీదేవిని ( ఎవరిచేత సర్వము చూడబడునో ఆమె లక్ష్మి)నా కొరకు ఆవాహన చేయుము .అను భావమును గ్రహించిన కవయిత్రి

సీస పద్యములో

బంగారు ఛాయతో బంగారు వెండియా

భరణములు ధరియింపబడి లక్ష్మి

హరిపత్ని పూర్ణ చంద్రాంశు హిరణ్మయీ

పిలువ సన్నిధినిమ్ము పీఠమంది

వేదములగురించి విశదీకరించిన

హుతవాహ! మాధవ సతిని యావ

హించు మా కొఱకు మా యింటిలో మంత్రబ

లముచేతనే విగ్రహముల నిలుపు,

తే.గీ.

ఎవరిచూపుతో సంపదలివ్వబడునొ

యామె నన్వీడదెన్నడు నమ్మ లక్ష్మి

పైడియావులు హయములు బంధువుల సు

భిక్షముగ పొందుపరచుము విజయరూప 

అని పద్యమున పఠన్ యోగ్యముగా ఉండునటుల వ్రాసిరి.

ఇందు మూల సూక్తమున ఉన్న భావము ప్రతిబింబించు విధముగ, ఛందో బద్ధముగ, 

పఠనానుకూలముగ వ్రాయుట వీరి సాధనా పటిమ పట్టుదల భక్తి చాటుచున్నవి.

ఈ విధముగా ఫలశృతితో కలిపి మొత్తం 22 పద్యములలో వ్రాసి ఆ శ్రీమాత అనుగ్రహపాత్రులయిరి. 

    ఆద్యంతమూ ఇదే విధముగా భక్తులగు పాఠకులకు అర్థముచేసుకొనుచు చదువుటకవకాశము కలుగ జేసిన ఈకవయిత్రి ఇంకనూ ఎన్నియో రచనలు చేసి పాఠకులకానందము చేకూర్చగలరని నా ప్రగాఢ విశ్వాసము.

మహనీయంబగు దైవమంత్రతతి, సన్మాన్యంబుగా నీమెచే

నిహమున్ సత్పర సాధనార్థమికపై హృద్యంబుగా వెల్వడున్

స్పృహనే గొల్పుచు సాధకాళికిలపై, క్షేమంబుగా వీర లీ

మహిపై వర్ధిలు దీర్ఘకాలము, సదా సమ్మానముల్ పొందుచున్. 

కవయిత్రికి అభినందనలతో

సద్విధేయుఁడు

చింతా రామకృష్ణారావు.

తే. 14 - 10 - 2022.

ఓమ్ నమోzహం పదార్థాయ మేలిమి బంగారం మన సమ్స్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  ఓమ్ నమోzహం పదార్థాయ - లోకానాం సిద్ధి హేతవే!

సచ్చిదానందరూపాయ - శివాయ పరమాత్మనే.

తే.గీ.  లోకముల మోక్షసిద్ధికి శ్రీకరముగ

హేతువగు సచ్చిదానంద హృదయవర్తి

యాత్మరూప సచ్ఛివున కే నంజలింతు

భక్తిపూర్ణుండనై మదిన్ బ్రబలముగను.

భావము.

లోకము(జను)ల (మోక్ష) సిద్ధికి కారణ మైనది, సచ్చిదానంద స్వరూపమైనది, అగు 

అహం(బ్రహ్మ) పదార్థమునకు నమస్కరించు చున్నాను.

జైహింద్.

పచ్చడిచేయనట్టి మగవాడు నిజమ్ముగ పచ్చడేయగున్, నేను చేసిన యీ సమస్యా పూరణము.

0 comments

జైశ్రీరామ్. 

ఉ.  ముచ్చట తీర్చ శ్రీమతికి ముద్దుగ నొప్పుగ వత్సరాదిలో

హెచ్చుగ పొంగచేయవ లె హృద్యముగా దగ వంట వార్పులన్,  

మెచ్చని రీతి వర్తిలుచు మేలగురీతిని వీడి వేపపూ

*పచ్చడిచేయనట్టి మగవాడు నిజమ్ముగ పచ్చడేయగున్.*

జైహింద్.

ద్రాగిన వాని జీవితము ధన్యమగున్ ధరలోన జూడగన్. నేను చేసిన సమస్యాపూరణము.

0 comments

  జైశ్రీరామ్.

ఉ.  యోగము భక్తిముక్తుల ననూన విధంబున పొందుటెన్నగా

శ్రీగిరిరాజకన్యక ప్రసిద్ధపదాంబుజ భావనా సుధన్

వేగమె గ్రోల లభ్యమగు, ప్రీతిని బొందగ భక్తినాసుధన్

*ద్రాగిన వాని జీవితము ధన్యమగున్ ధరలోన జూడగన్.*

జైహింద్.

ప్రియవాక్య ప్రదానేన.. మేలి మి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

 శ్లో.  ప్రియవాక్య ప్రదానేన  -  సర్వే తుష్యంతి జంతవః|

తస్మాత్తదేవ వక్తవ్యం  -  వచనే కా దరిద్రతా||

తే.గీ. ప్రియముగా పల్క జీవాళి ప్రీతిఁ జెందు,

మంచి మాటచే గొనవచ్చు మంచిపేరు,

కాన ప్రియముగాపలుకుము, కాదనకుము,

మాటలాడగ లోటేమి? మహిత సుగుణ!

భావము. సంతోషం కలిగే మాట మాట్లాడినచో అందరూ ఆనందిస్తారు.

అందువల్ల అలాంటి మాటనే మాట్లాడాలి. అలా సంతోషం కలిగించే 

మాట మాట్లాడం వల్ల వచ్చే దరిద్రమేమున్నది ?[అనగా?ఎలాంటి కష్టము 

ఉండదని భావము.

జైహింద్.

6, సెప్టెంబర్ 2023, బుధవారం

శ్రీకృష్ణాష్టమి సందర్భముగా శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీకృష్ణ!🙏🏼

శ్రీకృష్ణాష్టమి సందర్భముగా శుభాకాంక్షలు.💐🍒


శ్రీకృష్ణం వందే జగద్గురుమ్.

శా.  లీలామానుషవిగ్రహుండు హరి సల్లీలన్ జగత్పాలనన్

హేలన్ జేసెడివాడు మిమ్ము సతమున్ హృద్యంబుగా గాంచుచున్,

బాలించున్ సుధలీను మానసమునన్ వర్తిల్లుచున్ బ్రీతితోన్,

శ్రీలక్ష్మీసహితుండు మీకు సఖుఁడై శ్రీలన్ బ్రసాదించెడిన్.

మీ హృదయమున నెలకొనియున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 

నిత్యమూ మిమ్ము సన్మార్గమున

 ప్రవర్తింపఁజేయుచు రక్షించుచుండుగాక.🙏🏼

జైశ్రీకృష్ణ.

చింతా రామకృష్ణారావు.

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

ప్రపంచంలోని కథలన్ని 64 రకాలే..... ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

నేడు ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా ఉపాధ్యాయులుగా పునీత జీవనులయిన అందరికీ నా శుభాకాంక్షపూర్వక నమస్కృతులు.

0 comments

జైశ్రీరామ్. 

ఓంశ్రీమాత్రే నమః.

ఓం శ్రీగురుభ్యోనమః.

శ్లో.  "గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 

గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

కం.  గురువే బ్రహ్మయు, విష్ణువు

గురువే, పరమేశ్వరుండు గురువే తలపన్,

గురువే  బ్రహ్మము, కావున

గురుదేవులకంజలింతు గురుతరభక్తిన్.

భావము.  గురువే బ్ర్హ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుఁడు, గురువు సాక్షాత్ బ్రహ్మమే. అట్టి గురువుకు నమస్కరింతును. 🙏🏻

ఉపాధ్యాయులకే చక్కని గుర్తింపు తెచ్చున డా.సర్వేపల్లి రాధాకృష్ణులకు నమస్కరిస్తూ, 

ఉపాద్యాయులుగా పునీతజీవనులైన మహనీయులారా! మీకు నా శుభాకాంక్షలు.

సీ.  స్వార్థంబు విడిచి నిస్వార్థంబుగా విద్య బోధకుఁడై గొల్పు పూజ్యుడతఁడు,

విద్యార్థిలో గొప్ప విశ్వజనీనతన్ పూర్తిగా గొలిపెడి బుద్ధుఁడతఁడు,

నైపుణ్యమును జూపి నాణ్యతనే పెంచు దేశికుండయినట్టి దివ్యుఁడతఁడు,

తరతమ భేదాలు తలపక విద్యను తగినవారలకిచ్చు ధన్యుఁడతఁడు,

తే.గీ.  అట్టిఘనుడుపాధ్యాయుండె యహరహంబు

జ్ఞానదీప్తులు పంచు సుజ్ఞానమూర్తి

దైవమేయతఁడనుటయే తగును ధరను,

అట్టి మహితులకంజలులాచరింతు.

జైహింద్.