జైశ్రీరామ్.
శ్లో. కన్దుకో భిత్తినిక్షిప్త - ఇవ ప్రతిఫలన్ముహుః|
ఆపతత్యాత్మని ప్రాయో - దోషోఽన్యస్య చికీర్షతః|| (కథా సరిత్సాగరం)
తే.గీ. బంతి గోడకు కొట్టిన వచ్చు తిరిగి,
యటులె మనమితరులకును హాని చేయ
మనకె యాహాని కలుగును, మరువఁబోకు,
జ్ఞానహీనతన్ వరలకు గర్వమునను.
భావము. గోడకు కొట్టిన బంతి వెంటనే వేసిన చోటకే తిరిగి వచ్చినట్టు, ఇతరులకు
చెడు చేద్దామని ప్రయత్నిస్తే, ఆ చెడు మనకే జరుగుతుంది. కావున
ఇతరులకు చెడు తలపెట్టకూడదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.