గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మార్చి 2025, బుధవారం

మా అమ్మగారు 90 ఏళ్ళవయసులో పాడిన పాటలు.

 

జైశ్రీరామ్.
పూజ్యులైన మా అమ్మగారు చింతా వేంకటరత్నమాంబ.


మా అమ్మగారు సంగీత విద్వాంసురాలు. వందలపాటలు చక్కగా పాడేవారు. మాపిన్నిలు ముగ్గురు మా పెద్దమ్మగారు, మా అమ్మగారు కలిసి పాడుతుంటే ఎంత ఆహ్లాదకరంగానో శ్రోత్రపేయంగానో ఉండేవి. ఇది మా చిన్ననాటి అనుభవం. ప్రస్తుతం మా ఆఖరి రాజ్యం పిన్నిగారు మాత్రమే మాకు వారి పాటలతో ఆనందంకలిగిస్తుంటారు. ఐదేళ్ళక్రితం రికార్డుచేసిన రెండు పాటలే నాదగ్గర మా అమ్మగారి జ్ఞాపకంగా మిగిలి యున్నాయి. మా అమ్మగారు పాడే పాటలను మా మేనకోడలు చి.ల.సౌ.లక్ష్మి(పాప)రత్నమాలగా గ్రంథస్థం చేసి ముద్రించి అందరికీ అందజేయుట సంతోషించ తగ్గ విషయము. మూడేళ్ళక్రితం స్వర్గస్థులైన మా అమ్మగారికి భక్తితో అంజలిఘటిస్తున్నాను.
జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.