గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మార్చి 2025, ఆదివారం

యయోరేవ సమం విత్తం - ... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  యయోరేవ సమం విత్తం  -  యయోరేవ సమం శ్రుతం |

తయోర్వివాహః సఖ్యం చ  -  న తు పుష్టవిపుష్టయోః ||   (మహాభారతం)

తే.గీ.  ధనము విద్యయు సమముగా ధరణిఁ గలుగు

వారి మధ్యనే స్నేహ వివాహములును,

హెచ్చు తగ్గులు గలవారికెన్నటికిని 

శ్రేయముగనొప్పఁబోవవి శ్రీనృసింహ!     

భావము.  ఎవరికి ధనం మరియు విద్య సమానంగా ఉన్నాయో, వారి మధ్య 

మాత్రమే వివాహం మరియు స్నేహం ఉత్తమం. హెచ్చుతగ్గులు ఉన్నవారిలో 

ఇది శ్రేయస్కరం కాదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.