గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, మార్చి 2025, సోమవారం

శంకరభగవత్పాదకృత ....అ కారాది క్షకార ... సువర్ణమాలాస్తుతికి చిత్రకవితా సమ్రాట్ చింతా రామకృష్ణారావు కృత ఆంధ్రపద్యానువాదము.

 జైశ్రీరామ్.

శ్లో.  థ కథమపి మద్రసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ||౧||

తే.గీ. భవ! నీగుణ స్తుతిని జిహ్వను విశుద్ధి

చేసుకొందును పరమేశ! ధ్యాస నిలిపి,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ఖణ్డలమదఖణ్డనపణ్డిత తణ్డుప్రియ చణ్డీశ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ || ౨||

తే.గీ.  త్మభవ! యింద్రు గర్వమునణచు నిపుణ!

జయద! చండీశ! నందికేశప్రియహర!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  భచర్మాంబర శంబరరిపువపురపహరణోజ్జవలనయన విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౩||

తే.గీ.  భవపుర్వస్త్ర! భస్మ దేహిగ మదనుని

చేసినట్టి యుజ్వల నేత్ర! భాసురుండ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  శ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయభూషణ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౪||

తే.గీ.  శ్వరా! గిరీశ! మహేశ! హృది పరేశ! 

వర బిలేశయన విభూష! భవుఁడ! నతులు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  మయా దివ్యసుమఙ్గళవిగ్రహయాలిఙ్గితవామాఙ్గ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౫||

తే.గీ.  మ సుమంగళాలింగిత ప్రముద వామ

భాగ శోభితాంగా! హరా! భోగ భూష!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   రీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౬||

తే.గీ.   ర్ధ్వరేతస! అజ్ఞునన్నోపి నాదు 

దురితములు పారఁద్రోలుమా! పరమ పురుష!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   షివరమానసహంస చరాచరజననస్థితికారణ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౭||

తే.గీ.  షివర హృదయ హంస! ధాత్రిని చరాచ

రముల యునికివై వెలిగెడి ప్రముఖ! భవుఁడ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  క్షాధీశకిరీట మహోక్షారూఢ విధృతరుద్రాక్ష విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౮||

తే.గీ.  ఘ్న! ఋక్షాధిప కిరీట! ధృత చతుర్ద

శ భువనుండ! పరాత్పరా! శంకరుండ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!

(ౠఘ్న = రాక్షసులను సంహరించువాడా!)


శ్లో.  వర్ణద్వన్ద్వమవృన్తసుకుసుమమివాఙ్ఘ్రౌ  తవార్పయామి విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౯||

తే.గీ.  ప్రదా! నేత్రపుష్పముల్ సుప్రసిద్ధ

ముగను నీపాదములకిత్తు పొంగుచు మది,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   కం సదితి శ్రుత్యా త్వమేవ సదసీత్యుపాస్మహే మృడ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౦||

రే.గీ. ల నన్యముల్?  సత్తత్త్వ మీవె యనుచు

నిన్నుపాసింతు నిత్యంబు నీలకంఠ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  క్యం నిజభక్తేభ్యో వితరసి విశ్వంభరోఽత్ర సాక్షీ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౧౧||

తే.గీ.  తివీవేమహాసాక్షివన్నిటికిని,

ఐక్యమైభక్తులనుగూడి యలరు దేవ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  మితి తవ నిర్దేష్ట్రీ మాయాఽస్మాకం మృడోపకర్త్రీ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౨||

తే.గీ.  శుభంకర! ప్రణవమే యుత్తమముగ

నిన్నునెఱుఁగఁజేయఁగజాలు, నిర్వికార!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  దాస్యం స్ఫుటయతి విషయేషు దిగమ్బరతా చ తవైవ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౩||

తే.గీ.  ను, నీవు దిగంబరుండనగమనుట

నీ యుదాసీనతన్ దెల్పు నిఖిలమునను,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   అంతః కరణవిశుద్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౪||

తే.గీ.  అంగజాంతక! నా యంతరాత్మశుద్ధి,

భక్తి, నీసతి యొసఁగుత వరల నాకు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   స్తోపాధిసమస్తవ్యస్తై రూపైర్జగన్మయోఽసి విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౫||

తే.గీ.  అః! సమిష్టిగా నొంటిగా, నలరుదీవు,

జగతి నంతటన్ శుభములన్ సతము కలిగి,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!

(అః = శంకరుఁడా!)


శ్లో.   రుణావరుణాలయ మయి దాస ఉదాసస్తవోచితో న హి భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౬||

తే.గీ.  రుణకాలయ! నాపైనఁ గరుణఁ జూప 

ధరణి పయినుదాసీనత తగదు నీకు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  లసహవాసం విఘటయ సతామేవ సఙ్గమనిశం భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౧౭||

తే.గీ.  లుల సహవాసమును బాపి కావుము భవ!

సజ్జనులతోడి సంగతి సలుపనిమ్ము,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   రళం జగదుపకృతయే గిలితం భవతా సమోఽస్తి కోఽత్ర విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౧౮||

తే.గీ.  రళమునుత్రాగితివి నీవు కావ జగతి

నీకు సాటెవ్వరుందురో నీలకంఠ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   నసారగౌరగాత్ర ప్రచురజటాజూటబద్ధగఙ్గ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౯||

తే.గీ. న సుఘనసార గౌరవ గాత్ర! సాంబ!

గంగనే శిఖ లోపలఁ గట్టిన హర!,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   జ్ఞప్తిః సర్వశరీరేష్వఖణ్డితా యా  విభాతి సా త్వయి భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౨౦||

తే.గీ. నెడఁ బాపుమా యంతటం గలుగువాఁడ!

జ్ఞానమీవౌదువెంచగా కల్మష హర!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!

(ఙ = విషయేచ్ఛ.)


శ్లో.   పలం మమ హృదయకపిం విషయదుచరం దృఢం బధాన విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౨౧||

తే.గీ. పలమైనట్టి నా చిత్త కపిని భవుఁడ!

నీవు బంధించి నిలుపుము నిర్వికల్ప!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ఛాయా  స్థాణోరపి తవ తాపం నమతాం హరత్యహో శివ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౨౨||

తే.గీ. ఛాయనిచ్చెడి స్థాణువు చక్కగ నిను

కొలుచు వారి భవాంధమున్ దొలఁగఁ జేయు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  య కైలాసనివాస ప్రమథగణాధీశ భూసురార్చిత భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౨౩||

తే.గీ.   యము కైలాస వాస విజయము నీకు,

భూసురాళి ప్రమదపాళి పూజిత శివ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   ణుతకఝఙ్కిణుఝణుతత్కిటతకశబ్దైర్నటసి మహానట భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౨౪||

తే.గీ.   ణుత ఝణత్ కఝఙ్కిణుఝణుత కిటత,

శబ్దములతోడనటియించు సాంబుఁడవయ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   జ్ఞానం విక్షేపావృతిరహితం కురు మే గురుస్త్వమేవ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౨౫||

తే.గీ.    నధిరోహించి వెలుగెడి జ్ఞాన రూప!

సత్య మెఱిగించు, దాచుమసత్యమెన్ని

దాచఁ బోవక బోధిం చసత్తును దాచుచు హర!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!

(ఞ = ఎద్దు)


శ్లో.   ఙ్కారస్తవ ధనుషో  దలయతి హృదయం ద్విషామశనిరివ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౨౬||

తే.గీ.   ఙ్కృతిధ్వని నీవిల్లుటమ్ములును త్రి

శూలముల్ జేయ రిపులెల్ల తూలినారు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   ఠాకృతిరివ తవ మాయా బహిరన్తః శూన్యరూపిణీ ఖలు భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౨౭||

తే.గీ.   ! జగదీశ్వర! కన బయటను మరియును

లోన శూన్య రూపిణి మాయ, కాననగునె?

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!

(ఠ = ఓ శివుఁడా!.)


శ్లో.   మ్బరమంబురుహామపి దలయత్యనఘం త్వదఙ్ఘ్రియుగళం భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౨౮||

తే.గీ.   ప్పు మ్రోగించి చెప్పెద డంబ రహిత!

నీ పదారుణిమకు లొంగి నిలుచు తమ్మి,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  క్కాక్షసూత్రశూలద్రుహిణకరోటీసముల్లసత్కర భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౨౯||

తే.గీ.   క్క,  శూలాక్షసూత్రముల్, చక్కనయిన

చేతినల బ్రహ్మ పుర్రెయు చెలఁగు నీకు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   ణాకారగర్భిణీ చేచ్ఛుభదా తే శరణగతిర్నృణామిహ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౦||

తే.గీ.   ణాకృతిగ పొది నీదు బాణమ్ములున్న

ప్రజల మేలునకైయుండు పరమశివుఁడ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!

(ణాకృతిగ = కృపతో కూడిన ఆకారముతో)


శ్లో.   వ మన్వతిసఞ్జపతః సద్యస్తరతి నరో హి భవాబ్ధిం భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౩౧

తే.గీ.  లచి జపియింప నెవ్వడేన్ ధరణిపైన 

నీదుమంత్రంబు, వానికిన్  లేదు భవము,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


 శ్లో.  థూత్కారస్తస్య ముఖే భూయాత్తే నామ నాస్తి యస్య విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౨||

తే.గీ.  నదిరోహణన్ నినుఁ గాంతు దాతిఁ కనఁగ

నిన్నుతలవని ధూర్తుని నెన్న నీకు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!

(థ ను = కొండ ను)


శ్లో.   యనీయశ్చ దయాళుః కోఽస్తి మదన్యస్త్వదన్య ఇహ వద భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౩౩||

తే.గీ.  యకు  నేతప్ప ప్రార్థింప ధరణి  కలరె?

నీవుకాకదయనుచూప దేవులేరి?

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ర్మస్థాపనదక్ష త్ర్యక్ష గురో దక్షయజ్ఞశిక్షక భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౩౪||

తే.గీ.  ర్మ సంస్థా పనా దక్ష! త్ర్యక్ష! దక్ష

యజ్ఞ విధ్వందకా! గురుఁడ! యమరవినుత!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   ను తాడీతోఽసి ధనుషా లుబ్ధధియా త్వం పురా నరేణ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౫||

తే.గీ.  రుఁడు లక్ష్యంబుతో నినున్ బరమశివుఁడ!

ధనువుతోఁ గొట్టె, పాపంబు తలపలేదు.

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   రిమాతుం తవ మూర్తిం నాలమజస్తత్పరాత్పరోఽసి విభో|

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౬||

తే.గీ.  రమపురుషుండు విష్ణువు, బ్రహ్మకూడ

నిన్నుఁ గొలువంగనందవు నిరుపమాన!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   లమిహ నృతయా జనుషస్త్వత్పదసేవా సనాతనేశ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౭||

తే.గీ.  లము మానవ జన్మకు ప్రభువువైన

నీదుపాద సంసేవయే నిరుపమాన!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  లమారోగ్యం చాయుస్త్వద్గుణరుచితాం చిరం ప్రదేహి విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౮||

తే.గీ.  లమునాయువునారోగ్య వర్ధనంబు, 

నీదుగుణగణశక్తియు, బోధనిమ్ము,

 శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   గవన్ భర్గ భయాపహ భూతపతే భూతిభూషితాఙ్గ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౯||

తే.గీ.  ర్గ!  భగవన్! భయాపహా! భస్మ భూషి

తాంగ! భూతపతీ! నమ స్సాంబ! శివుఁడ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   హిమా తవ నహి మాతి శ్రుతిషు హిమానీధరాత్మజాధవ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౦||

తే.గీ.  హిమ నీదెన్నఁ సరిపోవు సహనమూర్తి!

వేదములు హైమపతిదేవ!  విశ్వభాస!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   మనియమాదిభిరఙ్గైర్యమినో హృదయే భజన్తి స త్వం భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౧||

తే.గీ.  మము నియమము మున్నగు నఖిలసిద్ధు

లను నినున్ యోగులాత్మలన్ గనుదురయ్య!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  జ్జావహిరివ శుక్తౌ రజతమివ త్వయి జగన్తి భాన్తి విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౨||

తే.గీ.  జ్జుసర్పంబు నాన్ శుక్తి రజత మట్లు 

ప్రబలు లోకముల్ నీలోన, భ్రమయె చూ

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   బ్ధ్వా భవత్ప్రసాదాచ్చక్రం విధురవతి లోకమఖిలం భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౩||  

తే.గీ.  బ్ధమయ్యెను చక్రంబు లక్ష్యమొప్ప

లోకపాలక హరికి నీలోననుండి,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  సుధాతద్ధరతచ్ఛయరథమౌర్వీశరపరాకృతాసుర భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౪||  

తే.గీ.  సుధ, యా శేషుఁ డావిష్ణుఁ డసమ రథము,

విల్లు, బాణమ్ము కాన్, దుష్ట విదరు వయితె?

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్తగర్వహరణ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౫||

తే.గీ.  ర్వదేవ! సర్వోత్తమా! సర్వద! శివ!

దురిత, దుర్వృత్త గర్వాపహ! రమణుండ! 

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   డ్రిపుషడూర్మిషడ్వికారహర సన్ముఖ షణ్ముఖజనక విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౬||

తే.గీ.  డ్రిపుల, షడూర్మి, నిలను షడ్వికార

ములను హరియించు మహితుండ! పూజ్య శివుఁడ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   త్యం జ్ఞానమనన్తం బ్రహ్మేత్యేతల్లక్షణలక్షిత భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౭||

తే.గీ.  త్య సుజ్ఞాన సదనంత సర్వ పూర్ణ

బ్రహ్మసుస్వరూపుడవీవు, పరమశివుఁడ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   హాహాహూహూముఖసురగాయకగీతపదానవద్య విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౮||

తే.గీ.  రుఁడ! హాహాల హూహూల నిరుపమాన

గానములనొప్పువాఁడవో గరళ గళుఁడ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ళాదిర్న హి ప్రయోగస్తదన్తమిహ మఙ్గళం సదాఽస్తు విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౯||

తే.గీ.  పదమాదినుండదుచూడ, లక్ష్యమొప్ప

ళాంత మంగళాంతములుండు, శాంతరూప!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   క్షణమివ దివసాన్నేష్యతి త్వత్పదసేవాక్షణోత్సుకః శివ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౫౦||

తే.గీ.  క్షణికమట్టులగడుపునీ కాలమంత

నీదు పాద సంసేవకై నీ సిసువుఁడు.

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!

(సిసువుఁడు = భక్తుఁడు)


శంకరభగవత్పాదకృత సువర్ణమాలాస్తుతికి చిత్రకవితా సమ్రాట్ చింతా రామకృష్ణారావు కృత 

ఆంధ్రపద్యానువాదము సంపూర్ణము.

తే. 03 – 03 – 2025.(పూర్వదినాది దినద్వయే విరచితమ్) 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.