జైశ్రీరామ్.
శ్లో. ఏకం విషరసో హంతి - శస్త్రేణైకశ్చ హన్యతే |
సబంధురాష్ట్రం రాజానం - హంత్యేకో మంత్రవిప్లవః || (యశస్తిలక)
తే.గీ. విషము చంపునొక్కనిఁ జూడ విబుధవర్య!
ఆయుధము చంపునొకనినే, మాయ దుష్ట
రాజకీయంబు నాశమున్ రాజునకును,
రాజ్యమునకునుఁ గలిగించు ప్రబలమగుచు.
భావము. విషం ఒక వ్యక్తిని చంపుతుంది. ఆయుధంతో ఒక వ్యక్తిని
హతమార్చవచ్చు. కానీ, చెడు రాజకీయ ప్రణాళిక (దుష్ట మంత్రాలోచన)
రాజును మాత్రమే కాక, ఆయన కుటుంబాన్నీ, రాజ్యాన్నీ నాశనం చేస్తుంది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.